Jio IPO: గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన జియో ఐపీఓ..!
జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) బిడ్డింగ్ ప్రారంభమైన మొదటి రోజే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. దీంతో బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన ఈ డిజిటల్ వెంచర్, భారతదేశపు అతిపెద్ద లిస్టింగ్‌ను పూర్తి చేసే దిశగా సాగుతోంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.40 గంటలకు బీఎస్ఈ లిమిటెడ్ వెబ్సైట్లో ఉన్న డేటా ప్రకారం, మొదటి రెండు గంటల్లోనే ఆఫర్లో ఉన్న 197.5 మిలియన్ల షేర్లను బిడ్లు అధిగమించాయి. సంస్థాగత వాటా 3.25 శాతం, హై నెట్ వర్త్ వాటా 26% సబ్‌స్క్రైబ్ అయ్యాయి. రిటైల్ పెట్టుబడిదారులు తమ కోసం కేటాయించిన షేర్లలో దాదాపు 23 శాతం కోసం బిడ్ చేశారు.
ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ప్లాన్లు, భారీ వినియోగదారుల సంఖ్యను కలిగి ఉన్న దేశ టెలికాం రంగం ఒడిదుడుకుల్లో జియో దూసుకెళ్తోంది. జియో ఐపీఓ బుధవారం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ప్రారంభమైన సంగతి తెలిసిందే దీని సబ్స్క్రిప్షన్ కాలం అక్టోబర్ 23తో ముగుస్తుంది. బ్లాక్‌రాక్ ఇంక్., ఫిడిలిటీ మేనేజ్మెంట్ & రీసెర్చ్, క్యాపిటల్ గ్రూప్ మరియు అలియాంజ్ ఎస్ఈ వంటి యాంకర్ ఇన్వెస్టర్లు మార్కెట్ శ్రేణి యొక్క గరిష్ట స్థాయిలో మొత్తం $854 మిలియన్ల విలువైన వాటాలను తీసుకున్నారు. జియో తన 3.1 బిలియన్ డాలర్ల షేర్ల విక్రయంతో ఒక్కో షేరుకు రూ.1,065 నుంచి రూ.1,119 నిర్ణయించారు.

మార్కెట్ ధరల శ్రేణిలో గరిష్ట స్థాయిలో కంపెనీ విలువను 107 బిలియన్ డాలర్లుగా నిర్ధారించింది. అదే బిలియనీర్ సునీల్ భారతీ మిట్టల్ వైర్లెస్ ఆపరేటర్ విలువ సుమారు 123 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగితంపై చూస్తే, చాలా విషయాలలో జియో, భారతీ ఎయిర్టెల్ కంటే పెద్దది. ఇది వైర్లెస్, ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లు రెండింటిలోనూ అగ్రస్థానంలో ఉంది. 500 మిలియన్లకు పైగా చందాదారులను కలిగి ఉంది. అంతగా విస్తరించని హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వంటి కొత్త అవకాశాలలో భారతీ ఎయిర్ టెల్ కంటే ముందుంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి, భారతి 264 రూపాయల ARPUను నివేదించగా, జియో 216 రూపాయల ARPUను నివేదించింది.
తక్కువ విలువ కలిగిన కస్టమర్లను తొలగించి, అధిక చెల్లింపులు చేసే వినియోగదారులకు ప్రాధాన్యత ఇవ్వాలనే దాని దీర్ఘకాలిక వ్యూహం ఫలితమే ఇది. లాభాలలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. వడ్డీ, పన్ను, తరుగుదల, అమోర్టైజేషన్కు ముందు ఆదాయాలపై భారతి 57.4% మార్జిన్‌తో పరిశ్రమలో అగ్రగామిగా ఉండగా, జియోకు 53.3% ఉంది. ఫలితంగా జియో విలువ గత ఆదాయాలకు 33.2 రెట్లు కాగా, భారతి విలువ దాదాపు 37 రెట్లుగా ఉంది. ఎంటర్ప్రైజ్ వాల్యూ-టు- ఎబిట్డడా ఆధారంగా, నోమురా, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థలు జియో ప్లాట్‌ఫామ్స్‌కు భారతి కంటే ప్రీమియం విలువను ఇచ్చాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications