ITC: మరోసారి సిగరెట్ల ధరలను పెంచిన ఐటీసీ.. !
ఐటీసీ తన సిగరెట్ల ధరను మరోసారి పెంచింది. తన గోల్డ్ ఫ్లేక్ రెగ్యులర్ సైజ్ ఫిల్టర్ టిప్స్' (RSFT - 69 మిమీ) సిగరెట్ ప్యాక్ ధరను రూ.125 నుంచి రూ.135కి పెంచింది. అంటే ఒక ప్యాక్ పై రూ.10 పెంచింది. 2026 సంవత్సరంలో ఈ బ్రాండ్‌కు సంబంధించి ధర పెరగడం ఇది రెండోసారి. అంతకుముందు ఫిబ్రవరిలో ధరను రూ.95 నుంచి రూ.125కి పెంచింది. ఒక్కో ప్యాకెట్ పై రూ.30 మేర పెంచిన విషయం తెలిసిందే. ఐటీసీ సిగరెట్ వ్యాపారంలో 'గోల్డ్ ఫ్లేక్ RSFT' ఒక కీలకమైన ప్రొడక్ట్ గా ఉంది. ఇది కంపెనీ మొత్తం సిగరెట్ విక్రయాలలో దాదాపు 30-35% వాటాను కలిగి ఉంది. లాభాలకు ఈ బ్రాండ్ ఇచ్చే సహకారం ఇంకా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు, కాబట్టి ఈ విభాగంలో ధరల నిర్ణయాలు ఐటీసీ మొత్తం సిగరెట్ వ్యాపారానికి చాలా ముఖ్యమైనవి.
అందువల్ల ధరలను నిర్ణయించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ధరలను పెంచడం ద్వారా పన్నుల భారాన్ని కొంతవరకు అధిగమించవచ్చు. కానీ ధరలను మరీ ఎక్కువగా పెంచితే, వినియోగదారులు అక్రమ (చట్టవిరుద్ధమైన) ప్రత్యామ్నాయాల వైపు మళ్లే ప్రమాదం ఉంది. ఐటీసీ విక్రయాలలో లాభదాయకతలో 'గోల్డ్ ఫ్లేక్ RSFT' కీలక పాత్ర పోషిస్తున్నందున ఈ విభాగంలో భవిష్యత్తులో తీసుకునే ధరల నిర్ణయాలపై అందరి దృష్టి ఉంటుంది. ప్రస్తుతం ఐటీసీ తన ఆర్థిక పనితీరు విషయంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 20.1 శాతం తగ్గి రూ.5,180 కోట్ల నుంచి రూ.4,137.12 కోట్లకు పడిపోయింది.

దీనికి ప్రధాన కారణం సిగరెట్ వ్యాపారంపై పన్నులు ఊహించని స్థాయిలో పెరగడమే. గత బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై భారీగా పన్నులు పెంచింది. దీంతో కంపెనీ మార్జిన్లపై ప్రభావం పడింది. పెంచిన పన్ను భారాన్ని వినియోగదారులపై మోపాలని భావించింది. అందుకే రెండుసార్లు సిగరెట్ల ధరలను పెంచింది. అయినప్పటికీ సిగరెట్ బిజినెస్ ఆశించిన స్థాయిలో రాణించ లేదు. రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 1.8% పెరిగి రూ.18,081 కోట్ల నుంచి రూ.18,401 కోట్లకు చేరుకుంది. సిగరెటేతర వ్యాపారాలు కొంత ఊరటనిచ్చాయి. ముఖ్యంగా ఎఫ్ఎంసిజి (FMCG - ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) విభాగం గత 14 త్రైమాసికంలో అత్యధిక ఆదాయ వృద్ధిని నమోదు చేసింది.
సిగరెట్ల ధరలు పెంచడం వల్ల వచ్చే త్రైమాసికంలో ఐటీసీ సిగరెటు బిజినెస్ లో గ్రోత్ ఉండే అవకాశం ఉంది. ఒక వేళ వచ్చే బడ్జెట్ లో పొగాకు ఉత్పత్తులపై పన్ను తగ్గిస్తే లాభాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే కేంద్రం పొగాకు ఉత్పత్తులపై పన్ను పెంచే అవకాశం లేదు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications