Multibagger Stock: ఐదేళ్లలో రూ.లక్షను రూ. 8.56 కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం అంటే రిస్క్ తీసుకోవడమే. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు పెరుగుతుందో ఎవరికీ తెలియదు. అయితే మంచి ఫండమెంటల్ ఉన్న కంపెనీలో పెట్టుబడి పెడితే మార్కెట్ పడినా ఇబ్బంది ఉండని నిపుణులు సూచిస్తున్నారు. మల్టీబ్యాగర్ స్టాక్స్ ను గుర్తించి పెట్టుబడి పెడితే మల్టీబ్యాగర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ ల్లో స్టెల్లంట్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఒకటి. ఈ స్టాక్ పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. పెట్టుబడిదారలను కోటీశ్వరులను చేసింది. ఈ స్టాక్ కేవలం 22 నెలల్లోనే రూ. 1 లక్ష పెట్టుబడిని రూ. 1 కోటిగా మార్చింది.
స్టెల్లంట్ సెక్యూరిటీస్ లిమిటెడ్ స్టాక్ గత శుక్రవారం నాడు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ. 1087.95 వద్ద ముగిసింది. మంగళవారం ట్రేడింగ్ సెషన్ లో ఉదయం 11.59 గంటలకు దాదాపు 4 శాతం తగ్గి రూ.1,015 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ వారంలో ఇది 10 శాతానికి పైగా లాభపడింది. దీర్ఘకాలంలో ఈ స్టాక్ పెట్టుబడిదారులకు భారీ రాబడులను అందించింది. కొన్ని సందర్భాలు మినహా ఈ స్టాక్ నిలకడగా పెరుగుతూ వస్తోంది. ఇది ఒక నెలలో 83 శాతం రాబడి ఇవ్వగా.. ఆరు నెలల్లో దీని విలువ రెట్టింపు అయింది . అంటే ఈ సమయంలో దీని రాబడి 106 శాతంగా ఉంది.

ఈ సంవత్సరాన్ని అంటే జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు పరిగణనలోకి తీసుకుంటే ఇది దాదాపు 180 శాతం పెరిగింది. ఒక సంవత్సరంలో స్టెల్లంట్ సెక్యూరిటీస్ లిమిటెడ్ రాబడి 857 శాతంగా ఉంది. మీరు ఒక సంవత్సరం క్రితం ఇందులో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఈ రోజు దీని విలువ రూ. 9.50 లక్షల కంటే ఎక్కువగా ఉండేది. కేవలం 22 నెలల్లోనే రూ.1 లక్ష పెట్టుబడిని రూ.1 కోటిగా మార్చింది. అంటే రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు కోటీశ్వరులు అయ్యారు.
22 నెలల క్రితం 2024 అక్టోబర్ చివరిలో స్టెల్లంట్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ధర రూ.10.87గా ఉండేది. ఇప్పుడు ఈ స్టాక్ రూ.1087.95 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ 22 నెలల్లో ఇది 10,000 శాతం రాబడిని అందించింది. అంటే రూ.1 లక్ష పెట్టుబడి రూ.1 కోటిగా మారిపోయింది . గత ఐదేళ్లుగా ఈ స్టాక్ రాబడులు మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. ఐదేళ్ల క్రితం దీని ధర రూ.2 కంటే తక్కువగా ఉండేది. గత ఐదేళ్లలో ఈ స్టాక్ 85,565 శాతం రాబడిని ఇచ్చింది. రూ.1 లక్ష పెట్టుబడిని రూ.8.56 కోట్లుగా మార్చింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications