Tech Mahindra Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో కార్పొరేట్ కంపెనీలు తన రెండవ త్రైమాసిక ఫలితాలను వరుసగా విడుదల చేస్తున్నాయి. దీంతో అనేక కంపెనీలు తమ పెట్టుబడిదారులకు బోనస్ షేర్లు, డివిడెండ్ వంటి బహుమతులను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటి తన ఇన్వెస్టర్లకు భారీ డివిడెండ్ ప్రకటించింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టెక్ మహీంద్రా కంపెనీ షేర్ల గురించే. కంపెనీ తాజాగా తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో నికర లాభం ఏడాది ప్రాతిపదికన 153 శాతం పెరుగుదలను చూసింది. దీంతో సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.493.90 కోట్లుగా నిలిచింది. అలాగే ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.13,313 కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాది రెండవ త్రైమాసికంలో నమోదైన రూ.12,863.90 కోట్ల కంటే 3.5 శాతం అధికం. క్వార్టర్-టు-క్వార్టర్ ప్రాతిపదికన టెక్ మహీంద్రా నికర లాభం 46.81 శాతం పెరగగా.. ఆదాయం 2.36 శాతం పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లు ఖుషీగా ఉన్నారు.

ఇదే క్రమంలో కంపెనీ తన పెట్టుబడిదారులకు డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. దీంతో అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.15 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. దీనికోసం నవంబర్ 1ని రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది. ఎవరైనా ఇన్వెస్టర్ డివిడెండ్ అందుకోవాలంటే దానికోసం కంపెనీ ప్రకటించిన తేదీ నాటికి తమ డీమ్యాట్ ఖాతాల్లో టెక్ మహీంద్రా షేర్లను హోల్డ్ చేస్తుండాలి. అప్పుడే వారు కంపెనీ పుస్తకాల ప్రకారం షేర్ హోల్డర్లుగా పరిగణించబడి ప్రస్తుతం అందిస్తున్న డివిడెండ్ పొందటానికి అర్హత పొందుతారు.
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కొత్తగా 6,653 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో ప్రస్తుతం కంపెనీని మెుత్తం ఉద్యోగుల సంఖ్య 1,54,273కి చేరుకుంది. ఈవారం మార్కెట్ల ముగింపు సమయంలో టెక్ దిగ్గజం కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.1,688 వద్ద స్థిరపడ్డాయి. ఏడాది కాలంలో కంపెనీ షేర్లు తన ఇన్వెస్టర్లుకు దాదాపు 43 శాతం పెరుగుదలను చూశాయి. గడచిన నెల రోజుల్లో కంపెనీ షేర్లు 5 శాతం పెరుగుదలను చూశాయి. మార్కెట్ల అస్థిరతలు కొనసాగుతున్న వేళ కంపెనీ ఇన్వెస్టర్లలో ప్రస్తుత ఆర్థిక ఫలితాలు మంచి జోష్ నింపుతున్నాయి. చాలా మంది మార్కెట్లో డివిడెండ్ ఆదాయం కోసం బెట్టింగ్ వేసేందుకు వెతుకున్న వేళ ఐటీ కంపెనీ షేర్లు చాలా మంది దృష్టిని ప్రస్తుతం ఆకర్షిస్తున్నాయి.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications