NSE IPO: గ్రే మార్కెట్ లో ప్రీమియంలో ట్రేడవుతోన్న ఎన్ఎస్ఈ షేర్లు..!

ఎన్ఎస్ఈ ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి భారీ డిమాండ్ వచ్చింది. షేర్ల కేటాయింపు సెప్టెంబర్ 22 రాత్రి వరకు ఖరారు కానుంది. షేర్ల కేటాయింపు విజయవంతంగా పూర్తయిన తర్వాత ఎన్ఎస్ఈ షేర్లు గురువారం సెప్టెంబర్ 24న బీఎస్ఈలో లిస్ట్ అవుతాయి. సెప్టెంబర్ 21న సబ్‌స్క్రిప్షన్ ముగిసిన ఈ IPO.. మరుసటి రోజున రీఫండ్, షేర్ల కేటాయింపు ఉంటుంది. షేర్లు పొందని పెట్టుబడిదారులకు రీఫండ్ ప్రక్రియ బుధవారం కానుంది. అదే రోజు, షేర్లు పొందిన వారి డీమాట్ ఖాతాల్లో షేర్లు జమ చేయనున్నారు.

2026లో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు బిడ్డింగ్ చివరి రోజైన సోమవారం నాడు 5.71 రెట్లు సబ్‌స్క్రిప్షన్ లభించింది. సంస్థాగత, అధిక నికర విలువ కలిగిన పెట్టుబడిదారుల (HNI) నుంచి వచ్చిన డిమాండ్‌తో అమ్మకానికి ఉంచిన 88.6 మిలియన్ల షేర్లకు గాను 505.81 మిలియన్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ప్రైస్ బ్యాండ్ (ధరల శ్రేణి)లో గరిష్ట ధర వద్ద, బిడ్ల మొత్తం విలువ రూ.90,000 కోట్లను దాటింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) విభాగం 12.68 రెట్లు సబ్‌స్క్రయిబ్ కాగా, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ (NII) విభాగం 6.55 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. రిటైల్ ఇన్వెస్టర్ కోటా 1.39 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది.

NSE IPO

NSE షేర్లు ప్రస్తుతం అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో ₹65 ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి. సెబీ ఈ పబ్లిక్ ఇష్యూకు ఆమోదం తెలిపిన తర్వాత ఉన్న ₹285 GMP (గ్రే మార్కెట్ ప్రీమియం)తో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉంది. ఎన్ఎస్ఈ ఐపీఓ బిడ్డింగ్ ప్రారంభమైనప్పుడు గ్రే మార్కెట్ రూ.155 వద్ద ఉండేది. ఈ ఐపీఓకు సెబీఆమోదం తర్వాత ప్రీమియం రూ.285 నుంచి దాదాపు రూ.48-50కి భారీగా పడిపోయింది. గ్రే మార్కెట్ ఆధారంగా ఎన్ఎస్ఈ షేర్లు రూ.1850 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. షేర్లు వచ్చిన వారు కేటాయింపు స్థితిని BSE లేదా NSE అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఎన్ఎస్ఈ ఐపీఓ కోసం బిడ్డింగ్ విండో సెప్టెంబర్ 17, 2026న ప్రారంభమై, సెప్టెంబర్ 21, 2026న ముగిసింది.

ఐపీఓ ధరల శ్రేణి ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.1,700 నుంచి రూ. 1,785 వరకు ఉంది. లాట్ పరిమాణం 8 ఈక్విటీ షేర్లుగా నిర్ణయించారు. ఈ ఐపీఓ పూర్తిగా ఇప్పటికే ఉన్న షేర్ల విక్రయం (Offer for Sale - OFS) రూపంలో ఉంటుంది. ఇందులో కొత్త ఈక్విటీ జారీ లేదు. కోటక్ మహీంద్రా క్యాపిటల్ కో. లిమిటెడ్ ఈ ఇష్యూకు బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తుండగా, ఎంయూఎఫ్‌జి ఇంటైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+