పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.ఇరాన్ రాజధాని ట్రెహాన్ టార్గెట్‌గా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. దీంతో టెహ్రాన్ సైతం ఇజ్రాయెల్‌పై డ్రోన్లతో విరుచుకుపడుతూ.. ప్రతీకార దాడులకు దిగింది.ఈ యుద్ధం ఎటు దారితీస్తుందోనన్న భయాందోళనలు ప్రపంచమంతటా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్టాక్ మార్కెట్లు భారీగా క్రాష్ అయ్యాయి.
పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ట్రెండ్ వంటి కారణాలతో దేశీయ స్టాక్ మార్కెట్ భారీ కుదుపులకు లోనైంది. ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లను పెట్టుబడిదారులు అమ్మకానికి పెట్టడంతో..సెన్సెక్స్ ఒక దశలో 992 పాయింట్ల వరకు పడిపోయింది.

ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమనడంతో ముడిచమురు ధరలతో పాటు బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 12 శాతం పైగా పెరగగా..బంగారం ధర ఏకంగా లక్ష మార్కును దాటింది. ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ప్రతిష్టంభనకు గురైనట్లు కనిపిస్తున్నందున పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
ఇరాన్ వద్ద ప్రమాదకరమైన అణ్వాయుధాలు ఉన్నాయని, అవి ప్రపంచానికి పెను ప్రమాదమని అమెరికా చెబుతోంది. ఈ పరిస్థితిలో, ఇరాన్ అణు కార్యక్రమాలను బహిరంగంగా ప్రకటించాలని అమెరికాతో సహా దేశాలు పట్టుబడుతున్నాయి. ఈ విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు కూడా జరిగాయి.ఈ చర్చలలో ఇప్పటివరకు ఎటువంటి ఒప్పందం కుదరలేదు.ఇప్పటికే అమెరికా ప్రభుత్వం ఐదు రౌండ్ల చర్చలు జరిపినా ఫలితం మాత్రం రాలేదు.
కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా సంస్థలు హెచ్చరించాయి. వెంటనే పశ్చిమాసియాలో ఉన్న అమెరికన్లు దేశానికి తిరిగి రావాలని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.ఈ ప్రకటన విడుదలైన తర్వాత, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 12 శాతం వరకు పెరిగాయి. ప్రధాన US మార్కెట్ అయిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో, బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ 12.6 శాతం పెరిగి $76.61కి మరియు బ్రెంట్ నార్త్ సీ ముడి చమురు 12 శాతం పెరిగి $77.77కి ట్రేడవుతున్నాయి.
ఈ యుద్ధ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరుగుతుంది. దీని ప్రభావంతో భారతదేశంతో సహా పలు దేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర కూడా పెరిగే అవకాశం కూడా ఏర్పడుతుంది.ఇప్పటికే లక్ష మార్కును దాటింది బంగారం.
ఇదిలా ఉంటేబ ఇరాన్ తో యుద్దం కొనసాగుతుందని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ దాడులతో హర్మోజ్ జలసంధి ద్వారా జరిగే గ్లోబల్ ఆయిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడొచ్చనే ఆందోళనలు పెరిగాయి.ఈ నేపథ్యంలో చమురు రంగ షేర్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ షేర్లు 6.1 శాతం తగ్గి రూ.299.20 వద్ద ట్రేడవుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్లు 3.9 శాతం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ షేర్లు 5.3 శాతం నష్టపోయాయి.
ఒమన్-ఇరాన్ సముద్రమార్గంలో హర్మోజ్ జలసంధి చమురు ఎగుమతికి ప్రధాన కేంద్రంగా ఉంది. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి వివిధ దేశాలకు ఈ జలసంధి నుంచే చమురు ఎగుమతులు జరుగుతుంటాయి. తాజా దాడులతో ఈ జలసంధిని మూసివేశారు.
ఇక ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన తర్వాత ముడి చమురు ధరలు పెరగాయి. అలాగే భారత విమానయాన కంపెనీల షేర్లు శుక్రవారం నష్టాలను చవిచూశాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు 5.62 శాతం తగ్గి రూ.5,175 కు చేరుకోగా, స్పైస్ జెట్ కౌంటర్ 5.64 శాతం తగ్గి రూ.42.16 కు చేరుకుంది. రెండు విమానయాన సంస్థల షేర్లు వరుసగా రెండవ రోజు క్షీణించాయి, ఇండిగో ఏప్రిల్ 25 తర్వాత భారీగా పతనం కాగా స్పైస్‌జెట్ కూడా మే 6 తర్వాత అత్యధిక పతనాన్ని చవిచూసింది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Iran war: యుద్ధం ఎప్పుడు ఆపాలో మేమే తేలుస్తాం.. ఇరాన్ అమెరికా మధ్య ముదురుతున్న మాటల యుద్ధం!

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

యుద్దం ఆపడం మా చేతుల్లో ఉంది.. నీ చేతుల్లో కాదు.. ట్రంప్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ విసిరిన ఇరాన్..

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన.. అంతర్జాతీయంగా 110 డాలర్లు దాటిన ముడి చమురు ధరలు..

మోదీ ఒక్క ఫోన్ చేస్తే చాలు.. ఇరాన్ యుద్దం క్షణాల్లో ఆగిపోతుంది.. యూఏఈ రాయబారి కీలక వ్యాఖ్యలు..

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..

ముంచుకొస్దున్న గ్యాస్ ముప్పు.. హార్ముజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన భారత నౌకలు.. నష్టం రూ. 10 వేల కోట్ల పై మాటే.

భారీగా పెరిగిన ఎరువుల ధరలు.. సంక్షోభం దిశగా వ్యయసాయ రంగం.. రైతన్న విలవిల..

ఇరాన్ తర్వాత ఈక్వెడార్ మీద గురిపెట్టిన అమెరికా... నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులను ఏరిపారేస్తున్న ట్రంప్ సైన్యం..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్



Click it and Unblock the Notifications