వచ్చే వారం స్టాక్ మార్కెట్ పుల్ జోష్ లో ఉండనుంది. మొత్తం 13 ఐపీవోలు ప్రారంభం కానున్నాయి. ఇందులో 5 మెయిన్‌బోర్డ్ ఐపీవోలు కాగా, మిగతా 8 SME విభాగానికి చెందినవి. ఈ ఇష్యూలు పెట్టుబడిదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని గ్రే మార్కెట్‌లో ఇప్పటికే భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ప్రతి ఐపీవోకు సంబంధించిన ధర శ్రేణి (ప్రైస్ బ్యాండ్), ఇష్యూ పరిమాణం, ప్రారంభ, ముగింపు తేదీలు తదితర ముఖ్యమైన వివరాలు అందుబాటులో ఉన్నాయి. మెయిన్‌బోర్డ్ విభాగంలో 5 ప్రధాన కంపెనీలు బహిరంగంగా మార్కెట్‌లో ప్రవేశించబోతుండగా, SME విభాగంలో మరో 8 సంస్థలు తమ ఇష్యూలను ప్రారంభించనున్నాయి.
ఈ నేపథ్యంలోనే వచ్చే వారం పెట్టుబడిదారుల కోసం మార్కెట్ ఆసక్తికరంగా మారబోతోంది. మరికొన్ని ఐపీవోలు ఇప్పటికే గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) పరంగా మంచి స్పందనను అందుకున్నాయి. ఈ నేపధ్యంలో వాటి ప్రదర్శనపై మార్కెట్ నిపుణుల దృష్టి సైతం నిలిచింది. జూలై 28 నుండి ఆగస్టు 3 మధ్యకాలంలో మొత్తం 13 IPOలు మార్కెట్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో భారతదేశపు అతిపెద్ద డిపాజిటరీ అయిన NSDL కూడా ఉంది.

మెయిన్‌బోర్డ్ IPOల హైలైట్
1. NSDL IPO - కేంద్ర దృష్టిలో ఉన్న జెమె్:
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) జూలై 30న తన భారీ IPOను ప్రారంభిస్తోంది. రూ.4,011.60 కోట్ల మొత్తం OFSలో 5.01 కోట్ల షేర్లు ఉన్నాయి. ధర శ్రేణి రూ.760-800 మధ్య ఉండగా, జూలై 29న యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ ప్రారంభమవుతుంది. GMP రూ. 161 వద్ద ఉంది, ఇది రూ. 946 లిస్టింగ్ ప్రైస్‌ను సూచిస్తుంది. ఎగువ బ్యాండ్ కన్నా 18 శాతం ఎక్కువ.
2. లక్ష్మీ ఇండియా ఫైనాన్స్:
ఈ NBFC కంపెనీ ఐపీఓ ద్వారా రూ. 254.26 కోట్లను సేకరించనుంది. ఇది జూలై 29 నుండి 31 వరకు తెరిచి ఉంటుంది. ధర శ్రేణి రూ. 150-158. GMP ూ. 18 ఉండగా, లిస్టింగ్ ధర రూ.176గా అంచనా వేస్తున్నారు.
3. ఆదిత్య ఇన్ఫోటెక్:
జూలై 29-31 వరకు బిడ్డింగ్‌కు ఓపెన్ లో ఉంటుంది. రూ.1300 కోట్ల విలువైన ఈ IPOలో రూ. 500 కోట్ల ఫ్రెష్ ఇష్యూ కాగా రూ.800 కోట్ల OFS ఉన్నాయి. ధర శ్రేణి రూ. 640-675. GMP రూ. 225గా ఉంది, దీని అర్థం రూ. 900కి లిస్టింగ్ ఉండబోతోంది.
4. శ్రీ లోటస్ డెవలపర్స్:
రూ. 792 కోట్ల ఫ్రెష్ ఇష్యూ, జూలై 30 నుండి ఆగస్టు 1 వరకు బిడ్డింగ్ ఉండనుంది. ధర శ్రేణి రూ. 140-150. GMP రూ. 34, లిస్టింగ్ అంచనా రూ. 184గా ఉండనుంది.
5. ఎం అండ్ బి ఇంజనీరింగ్:
రూ.650 కోట్ల IPO, ఇందులో రూ. 275 కోట్లు తాజా ఇష్యూ, రూ. 375 కోట్ల OFS రూపంలో ఉండనుంది. జూలై 30-ఆగస్టు 1 వరకు తెరిచి ఉంటుంది. ధర రూ. 366-385. GMP రూ. 40, లిస్టింగ్ అంచనా రూ.425గా ఉంది.
SME IPOల హైలైట్ విషయానికి వస్తే.. SME విభాగం కూడా ఎనిమిది కంపెనీల IPOలతో పటిష్టంగా నిలుస్తోంది.
1. రెపోనో - రూ. 26.68 కోట్లు, జూలై 28-30, ధర రూ. 91-96.
2. ఉమియా మొబైల్ - రూ. 24.88 కోట్లు, జూలై 28-30, ధర రూ. 66.
3. కేటెక్స్ ఫాబ్రిక్స్ - రూ. 69.81 కోట్లు, జూలై 29-31, ధర రూ. 171-180.
4. బిడి ఇండస్ట్రీస్ - రూ. 45.36 కోట్లు, జూలై 30-ఆగస్టు 1, ధర రూ. 102-108.
5. మెహుల్ కలర్స్ - రూ. 21.66 కోట్లు, జూలై 30-ఆగస్టు 1, ధర రూ. 68-72.
6. టక్యోన్ నెట్‌వర్క్స్ - రూ. 20.48 కోట్లు, జూలై 30-ఆగస్టు 1, ధర రూ. 51-54.
7. క్యాష్ ఉర్ డ్రైవ్ మార్కెటింగ్ - రూ. 60.79 కోట్లు, జూలై 31-ఆగస్టు 4, ధర రూ. 123-130.
8. రెనోల్ పాలీకెమ్ - రూ. 25.77 కోట్లు, జూలై 31-ఆగస్టు 4, ధర రూ. 100-105.
ఇక ఈ వారం మార్కెట్‌లో అడుగుపెట్టే కంపెనీలు ఇవే..
జూలై 28 - సావీ ఇన్‌ఫ్రా (SME), స్వస్తిక కాస్టల్ (SME)
జూలై 29 - మోనార్క్ సర్వేయర్స్ (SME)
జూలై 30 - GNG ఎలక్ట్రానిక్స్, ఇండిక్యూబ్ స్పేసెస్, TSC ఇండియా
జూలై 31 - బ్రిగేడ్ హోటల్ వెంచర్స్
ఆగస్టు 1 - పటేల్ కెమ్ స్పెషాలిటీస్, శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్, సెల్లోవ్రాప్ ఇండస్ట్రీస్, శ్రీ రిఫ్రిజిరేషన్స్
ఏదేమైనా వచ్చే వారం IPO క్యాలెండర్ పుల్ జోష్ లో ఉండబోతోంది. మెయిన్‌బోర్డ్ దిగ్గజాలతో పాటు SME IPOలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించనున్నాయి. NSDL IPO మార్కెట్ ఫోకస్‌గా నిలిచినప్పటికీ, చిన్న IPOలలో కూడా ఆకర్షణీయమైన GMP లాభాలు కనిపిస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. Jio IPO రెడీ అవుతోంది.. 250 మిలియన్లకు పైగా షేర్లు మార్కెట్లోకి..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market: ఇన్వెస్టర్ల కొంప ముంచిన మార్కెట్! ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలివే!

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్‌లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications