పెట్టుబడిదారులకు పండగే పండగ.. వచ్చే వారం మార్కెట్‌ని ముంచెత్తబోతున్న టాప్ కంపెనీల IPO లు ఇవే..

IPO Alert: స్టాక్ మార్కెట్ ని వచ్చేవారం ఐపీఓలు ముంచెత్తబోతున్నాయి. కీలక కంపెనీలు ఐపీఓలు ప్రారంభించనున్నాయి. ఇటీవల భారత మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI పలు కంపెనీలకు పర్మిషన్ ఇచ్చింది. వీటిలో Pine Labs, Hero Motors, Orkla India, Manipal Payment & Identity Solutions, MV Photovoltaic Power, Kenara Robeco AMC వంటి ఆరు పెద్ద కంపెనీలు తమ IPO (Initial Public Offering) ప్రారంభించడానికి సెబీ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా కంపెనీలు నేరుగా ఇన్వెస్టర్లకు షేర్లను అమ్మకాలు జరపడం ద్వారా నిధులు సమకూర్చుకోరున్నాయి. ఈ ఆరు కంపెనీలు కలిపి రూ. 9 వేల కోట్ల వరకు నిధులు సేకరించనున్నట్లు అంచనా.

Kenara Robeco AMC: ఈ కంపెనీ OFS (Offer for Sale) ద్వారా 4.98 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్ముతోంది. ఇందులో కెనరా బ్యాంక్ 2.59 కోట్ల షేర్లను, ORIX Corporation 2.39 కోట్ల షేర్లను అమ్మకాలు జరపబోతోంది. IPO ద్వారా ఎలాంటి నూతన నిధులు కంపెనీకి రావడం లేదు. ఎందుకంటే ఈ షేర్లు ప్రస్తుత వాటాదారులచే విక్రయించనున్నారు.

Pine Labs IPO Hero Motors IPO Orkla India IPO SEBI IPO approval upcoming IPOs India public offer launch stock market news IPO investment Indian IPOs 2025 new IPO announcements IPO listing investment opportunities SEBI 2025

Hero Motors: Hero Motors రూ. 1,200 కోట్ల IPO ఆఫర్ చేయనుంది. ఇందులో రూ. 800 కోట్ల కొత్త షేర్లతో పాటు రూ. 400 కోట్ల OFS ఉంది. ఇది ప్రధానంగా రుణ చెల్లింపులు, యంత్ర సామర్థ్యాన్ని విస్తరించడానికి ఉపయోగించనుంది కంపెనీ.

MV Photovoltaic Power: సౌరశక్తి పరికరాల తయారీ కంపెనీ, రూ. 3 వేల కోట్ల IPO లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ. 2,143.86 కోట్ల తాజా ఈష్యూ, రూ. 856.14 కోట్ల OFS ఉన్నాయి. ఈ మొత్తం ప్రధానంగా రుణ చెల్లింపు, సాంకేతిక అభివృద్ధి, క్లౌడ్ మౌలిక సదుపాయాలకు వినియోగించబడుతుందని కంపెనీ తెలిపింది.

Pine Labs: Fintech దిగ్గజ Pine Labs రూ. 2,600 కోట్ల ఈక్విటీ షేర్ల జారీతో పాటు పెద్ద OFS ని కలిగి ఉంది. తాజా నిధులు రూ. 870 కోట్లను రుణ చెల్లింపులకు, రూ. 760 కోట్లను ఐటీ, క్లౌడ్, డిజిటల్ అభివృద్ధికి కేటాయించనుంది.

Manipal Payment & Identity Solutions: సుమారు రూ 1,200 కోట్ల IPO లక్ష్యంగా పెట్టుకుంది. SEBIకి రహస్య విధానంలో ముసాయిదా పత్రాలు సమర్పించింది.

Orkla India: సుగంధ ద్రవ్యాలు, మసాలా బ్రాండ్లలో ప్రముఖమైన ఓర్క్లా ఇండియా పూర్తిగా OFS మార్గంలో IPOను చేపడుతోంది. 2.28 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రస్తుత ప్రమోటర్లు, వాటాదారులు విక్రయించనున్నారు.

ఈ కొత్త IPOల ద్వారా.. ఈ కంపెనీలు తమ వ్యాపార విస్తరణకు, రుణ భారం తగ్గించుకోవడానికి, కొత్త సాంకేతికతకు పెట్టుబడులు చేయడానికి, మార్కెట్‌లో తమ స్థితిని బలపరచుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఇవి పెట్టుబడిదారులకు మంచి అవకాశాలుగా మారి, స్టాక్ మార్కెట్‌లో ఆసక్తికరమైన వృద్ధిని అందించనున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+