Vodafone Idea News: బిర్లా గ్రూప్ భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్న భారతీయ టెలికాం దిగ్గజ ప్రైవేటు సంస్థ వొడఫోన్ ఐడియా కంపెనీ షేర్లకు మళ్లీ మంచి కాలం తిరిగి వచ్చింది. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో దేశీయంగా పెట్టుబడిదారులు ఈ పెన్నీ స్టాక్ కొనుగోలు చేసేందుకు భారీగా ఆసక్తి చూపించటం షేర్ ధరను అమాంతం పెంచేసింది.
అయితే ఇక్కడ కంపెనీ షేర్ల ధర నేడు అమాంతంగా పెరగటానికి దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే.. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంగా ఉంది. టెలికాం ఆపరేటర్లు 2022కి ముందు కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్ పై బ్యాంక్ గ్యారెంటీలను రద్దు చేస్తూ మోదీ కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న వొడఫోన్ ఐడియా వంటి టెలికాం కంపెనీకి భారీగా ఊరటను అందించే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ విఐకి వచ్చే ప్రయోజనాన్ని పరిశీలిస్తే.. వొడఫోన్ ఐడియా సంస్థ ప్రస్తుతం ప్రభుత్వానికి దాదాపు రూ.24,700 కోట్ల మేర బకాయిపడి ఉన్న సంగతి తెలిసిందే. వీటికి బ్యాంక్ గ్యారెంటీలు ఉన్నప్పటికీ తాజా పరిణామాలతో బ్యాంక్ గ్యారెంటీ అవసరం లేకుండా వెసులుబాటు దొరికింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారతదేశంలోని ప్రైవేటు టెలికాం ఆపరేటర్లుగా ఉన్న ఎయిర్ టెల్, వొడఫోన్ ఐడియాలు సంయుక్తంగా రూ.30,000 కోట్ల వరకు బ్యాంక్ గ్యారెంటీలను కలిగి ఉన్నాయి. ఈ నిర్ణయం 2021 క్యాబినెట్ సంస్కరణలను అనుసరించి వచ్చింది. పైగా ఇది భవిష్యత్తులో పొందిన స్పెక్ట్రమ్‌పై బ్యాంక్ గ్యారెంటీల అవసరాన్ని తొలగించింది. ఇదే క్రమంలో పాత స్పెక్ట్రమ్ చెల్లింపుల విషయంలో కూడా ఈ ఉపశమనాన్ని కేంద్రం విస్తరించడం టెలికాం రంగంలో ఆర్థిక ఒత్తిడిని తగ్గింటానికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే రంగంలో స్థిరత్వానికి దారితీస్తుందని, క్యాపిటల్ అవసరాల విషయంలో ఒత్తిడిని తగ్గిస్తుందని అంటున్నారు.
ఇంట్రాడేలో వొడఫోన్ ఐడియా కంపెనీ షేర్లు ఒకానొక సమయంలో ఎన్ఎస్ఈలో 18.79 శాతం పెరుగుదలతో రూ.8.28 రేటుకు చేరుకున్నాయి. ఇదే క్రమంలో మిగిలిన టెలికాం స్టాక్స్ కూడా స్వల్పంగా లాభపడ్డాయి. కేంద్ర కేబినెట్ బ్యాంక్ గ్యారెంటీల అవసరాన్ని తొలగించటంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విఐ కంపెనీకి బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి మరింతగా రుణాలు పొందటంలో దోహదపడుతుందని కంపెనీ విశ్వసిస్తోంది. దీనికి ముందు ఆగస్టులో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా 2022కి ముందు జరిగిన వేలం కోసం బ్యాంక్ గ్యారెంటీల అవసరాలను తొలగించాలని వాదిస్తూ DoTని సంప్రదించిన సంగతి తెలిసిందే.
మళ్లీ టారిఫ్స్ మోత తప్పదా..?
ఇప్పటికే కొన్ని నెలల కిందట దేశంలోని ప్రైవేటు టెలికాం సంస్థలు ఒకదాని తర్వాత మరొకటి జియో రేట్ల పెంపు తర్వాత టారిఫ్ హైక్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రానున్న 15 నెలల కాలంలో వొడఫోన్ ఐడియా మరోసారి టారిఫ్లను పెంచవచ్చని భావిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇది ఈసారి 15-20 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం కంపెనీ తన 4జీ సేవలను మెరుగుపరచటం కస్టమర్లను నిలుపుకోవటంలో దోహదపడిందని బ్రోకరేజ్ పేర్కొంది. మెుత్తానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం రానున్న కాలంలో కంపెనీకి మేలుచేసేదిగా ఉందని నిపుణులు భావిస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications