స్టాక్ మార్కెట్లో ట్రంప్ ప్రకంపనలు.. ఒక్క రోజులో రూ.8.96 లక్షల కోట్లు ఆవిరి.. ఇన్వెస్టర్లు లబోదిబో..

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదిరిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లను వణికించాయి. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులకు దిగడంతో.. ఆ దేశంతో కుదిరిన మధ్యంతర శాంతి ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు.

ఈ పరిణామం ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనల నడుమ.. ప్రపంచ చమురు ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 6.18 శాతం పెరిగి బ్యారెల్‌కు 78.74 డాలర్లకు చేరుకుంది. ముడి చమురు ధరలు దాదాపు 7 శాతం మేర ఇలా అకస్మాత్తుగా దూసుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించాయని ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ విశ్లేషించారు.

Stock Market Sensex Nifty Iran War Iran Conflict Investors Wealth Rs 8 96 lakh crore loss Share Market Crash Geopolitical Tensions Indian Stock Market Market Fall Business News Equity Market Global Markets 8 96

చమురు ధరల మంట, యుద్ధ భయాల కారణంగా భారత ఈక్విటీ మార్కెట్లు బుధవారం భారీ అమ్మకాల ఒత్తిడికి గురై కుప్పకూలాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1,677.12 పాయింట్లు (2.15 శాతం) పతనమై 76,503.60 వద్ద స్థిరపడగా, 50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 516.65 పాయింట్లు (2.12 శాతం) నష్టపోయి 23,882.05 వద్ద ముగిసింది.

ఈ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే రూ. 8.96 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,71,23,612.10 కోట్లకు (4.95 ట్రిలియన్ డాలర్లు) పడిపోయింది.

మార్కెట్లో బేరిష్ ట్రెండ్ ఎంత తీవ్రంగా ఉందంటే.. సెన్సెక్స్ ప్యాక్‌లోని అన్ని కంపెనీలు నష్టాలతోనే ముగిశాయి. ముఖ్యంగా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, మారుతి, హిందుస్థాన్ యూనిలివర్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా & మహీంద్రా వంటి దిగ్గజ షేర్లు భారీగా వెనుకబడ్డాయి. రంగాల వారీగా చూస్తే అన్ని రంగాలు నష్టాల బాట పట్టాయి.

Also Read

సేవారంగం అత్యధికంగా 3.21 శాతం కుంగాగా, పీఎస్‌యూ బ్యాంకులు (2.76 శాతం), మిడ్‌స్మాల్ ప్రైవేట్ బ్యాంకులు (2.74 శాతం), ఎఫ్‌ఎంసీజీ (2.54 శాతం), ఫైనాన్షియల్ సర్వీసెస్ (2.49 శాతం), బ్యాంకెక్స్ (2.46 శాతం) మరియు టాప్ 10 బ్యాంకులు (2.34 శాతం) చొప్పున భారీగా పడిపోయాయి. బ్రాడర్ మార్కెట్లో బీఎస్ఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 2.14 శాతం, స్మాల్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 1.61 శాతం క్షీణించాయి. మొత్తంగా బీఎస్ఈలో ట్రేడైన షేర్లలో 3,211 స్టాక్‌లు నష్టాల్లో ముగియగా, కేవలం 1,070 స్టాక్‌లు మాత్రమే లాభపడ్డాయి, మరో 173 స్టాక్‌ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+