NPTC Green Energy IPO: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు ప్రజలు సమాజాలు గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లుతున్నాయి. ఈ క్రమంలో చాలా కాలంగా నాన్-రెన్యూవబుల్ ఎనర్జీ వినియోగంతో పెరిగిన కర్భన ఉద్ఘారాలను తగ్గించాలని లక్ష్యంతో ఈ షిఫ్ట్ స్టార్ట్ అయ్యింది. దీంతో ఈ రంగంలో వస్తున్న కంపెనీల ఐపీవోలు భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడతాయనే ఆలోచనలతో చాలా మంది ఇన్వెస్టర్లు ఉన్నారు.
ఇప్పుడు మాట్లాడుకోబోతున్నది ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఐపీవో గురించే. వాస్తవానికి ఇది పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్టీపీసీ లిమిటెడ్ సబ్సిడరీ సంస్థ కావటం గమనార్హం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కంపెనీ ఐపీవో నవంబర్ మూడవ వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల ముందుకు రాబోతోందని వెళ్లడైంది. అజ్ఞాత వ్యక్తులు అందించిన సమాచారం ప్రకారం నవంబర్ 18న సోమవారం రోజున పెట్టుబడిదారుల సబ్‌స్క్రిప్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించబడనుంది.

ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఏకంగా రూ.10,000 కోట్లను సమీకరించాలని లక్ష్యంతో వస్తోంది. మెయిన్ కేటగిరీ కింద వస్తున్న ఐపీవో విక్రయిస్తున్న షేర్లు పూర్తిగా ఫ్రెష్ షేర్లని వెల్లడైంది. కంపెనీ షేర్లు ఏకకాలంలో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్ట్ అవుతాయి. ఈ ఏడాది ఐపీవోలో రూ.10,000 కోట్ల కంటే ఎక్కువ మూలధనాన్ని సమీకరించిన మూడో అతిపెద్ద ఐపీవోగా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అవతరించనుంది. ఇప్పటికే ఇన్వెస్టర్ల నుంచి ఈ ఐపీవోకు భారీ స్పందన లభిస్తుండగా కంపెనీ త్వరలోనే తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది మార్కెట్ల నుంచి భారీగా డబ్బు సమీకరించిన ఐపీవోల జాబితాలో రూ.27,856 కోట్లతో హ్యుందాయ్ మోటార్స్ తొలిస్థానంలో నిలవగా.. స్విగ్గీ లిమిటెడ్ రూ.11,327 కోట్లను సమీకరిస్తూ ప్రస్తుతం రెండవ స్థానాన్ని దక్కించుకుంది.
2022 ఏప్రిల్‌లో స్థాపించబడిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆగస్టు చివరి నాటికి 3,071 MW సోలార్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇదే క్రమంలో విండ్ ఎనర్జీ కేటగిరీ కింద 100 MW కార్యాచరణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 14,696 మెగావాట్లు ఉండగా.. ఇందులో 2,925 మెగావాట్ల కార్యాచరణ ప్రాజెక్టులు, 11,771 మెగావాట్ల కాంట్రాక్ట్‌తో పాటు కొన్ని పూర్తయిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ఏడాది జూన్ 30 నాటికి కంపెనీ దేశంలోని 7 రాష్ట్రాల్లో 31 రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులను నిర్మిస్తూ ఉంది. అయితే ఇన్వెస్టర్లు రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో కంపెనీలపై ఎంత దృష్టి సారించారనే విషయాన్ని గత నెల చివర్లో లిస్టింగ్ అయిన వారీ ఎనర్జీస్ కంపెనీ షేర్ల పనితీరును పరిశీలిస్తే అర్థం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications