HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో ఏం జరుగుతోంది.. 8 నెలల్లో 28 శాతం పడిపోయిన స్టాక్..!
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్ల ధరలు విస్తృత మార్కెట్‌లో బలహీనత మధ్య బుధవారం ఇంట్రాడే ట్రేడ్‌లో తాజా 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. HDFC బ్యాంక్ రూ.690.65 కనిష్ట స్థాయికి చేరుకుంది. ఈ రోజు దాదాపు 2 శాతం తగ్గింది. HDFC బ్యాంక్ 2026లో ఇప్పటివరకు 28.5 శాతం నష్టపోయింది. ఇప్పుడు జూన్ 2024 నుంచి అత్యల్ప స్థాయిలో ట్రేడవుతోంది. ఈ బ్యాంక్ షేరు ప్రైస్ ఒక సంవత్సరంలో ఇప్పటివరకు 31.3 శాతం పడిపోయింది. గత నెల రోజుల్లోనే 5.01%, 6 నెలల కాలంలో 17.41% మేర పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది.
ఎన్‌ఎస్‌ఇలో దాదాపు 14.12 మిలియన్ షేర్ల ట్రేడింగ్ జరిగింది. స్వల్పకాలిక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ముఖ్యంగా బలహీనంగా ఉండవచ్చని ఈక్వినామిక్స్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు హెడ్ జి చొక్కలింగం అభిప్రాయపడ్డారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు కీలకమైన ఆందోళనగా భావిస్తున్నారు. HDFC బ్యాంక్ వ్యాపార వృద్ధి పరంగా సహచర బ్యాంకుల పోటీని తట్టుకోవడం కష్టంగా ఉందన్నారు. చమురుతో $100-మార్క్‌కు రేటు పెంపు భయం పెరిగింది. ఇది బ్యాంకింగ్ పరిశ్రమకు ఇబ్బందిగా మారనంది. ఈ స్టాక్ వరుసగా పడిపోవటానికి ప్రధానంగా బ్యాంక్ లీడర్‌షిప్ మార్పులకు సంబంధించిన అనిశ్చితే ముఖ్య కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత ఎండీ, సీఈఓ శశిధర్ జగదీషన్ తన పదవీ కాలం 2026 అక్టోబర్ 26తో ముగియనున్న నేపథ్యంలో.. పదవీ కాలాన్ని మళ్లీ పొడిగించుకోవడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది. ఈ కీలక పరిణామం బ్యాంక్ తదుపరి నాయకత్వంపై పెట్టుబడిదారుల్లో తీవ్ర సందేహాలను, ఆందోళనలను రేకెత్తించిందని చెబుతున్నారు. HDFC బ్యాంక్ జూన్ (Q1FY27)తో ముగిసిన త్రైమాసికంలో స్టాండ్‌లోన్ నికర లాభంలో 5 శాతం వార్షిక వృద్ధి (YoY) ₹19,060 కోట్లుగా నివేదించింది. బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ (NIM) Q4FY26లో 3.38 శాతం నుంచి Q1FY27లో 3.26 శాతానికి తగ్గింది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లో కార్పొరేట్ గవర్నెన్స్ ఆందోళనలు కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని విశ్లేషిస్తున్నారు. మార్చి 2026లో బ్యాంక్ మాజీ పార్ట్-టైమ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి అకస్మాత్తుగా రాజీనామా చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనికితోడు అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో పాటు ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లపై దాఖలైన 'సెక్యూరిటీస్ క్లాస్-యాక్షన్ లాసూట్' కూడా బ్యాంక్ ప్రతిష్టను దెబ్బతీసిందని అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
