IPOs This Week: పెట్టుబడి దారులకు అలర్ట్.. భారత స్టాక్ మార్కెట్లో ఈ వారం ఐపీఓల జోరు కొనసాగనుంది. ఈ వారంలో ఆరు పెద్ద కంపెనీలతో పాటుగా 11 చిన్న కంపెనీలు ఐపీఓలోకి రానున్నాయి. పెట్టుబడి దారులు ఎవరైనా ఐపీఓలలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది ఓ మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ కంపెనీల ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ వీక్ ఐపీఓలోకి రానన్న వాటిల్లో ప్రధానంగా HDFC బ్యాంక్ అనుబంధ సంస్థ HDB ఫైనాన్షియల్, కల్పతరు, ఎల్లెన్‌బారీ ఇండస్ట్రియల్ గ్యాస్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి.
ఈ వారంలో ఆరు మెయిన్ కంపెనీలు IPOలు ప్రారంభించడానికి రెడీ అవుతుండగా SME కేటగిరీలో చాలా కంపెనీలు ఐపీఓలో ఖాతా ఓపెన్ చేయనున్నాయి. ఇప్పటికే మూడు కంపెనీలు రేపు తమ ఇష్యూలను ఒకేసారి ప్రారంభిస్తామని ప్రకటించాయి. ఇక చిన్న పెట్టుబడిదారుల కోసం రెండు మెయిన్‌బోర్డ్ IPOలు జూన్ 25న, జూన్ 26న ప్రారంభం కానున్నాయి. రేపు రూ.119 కోట్లతో గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ IPOలోకి రానుండగా.. జూన్ 26 వరకు పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడి దారులకు అవకాశం ఉంది. దీని ఒక ఐపీఓ షేరు ధర రూ. 67 నుంచి 71 ఉండగా.. మొత్తం 211 షేర్లలో పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టవచ్చు. జూలై 1, 2025న లిస్టింగ్ జరిగే అవకాశం ఉంది. పెట్టుబడిదారుడు కనీసం ఇందులో రూ. 14,981 పెట్టుబడిగా పెట్టాలి.

రేపు మరో దిగ్గజం ఎల్లెన్‌బారీ ఇండస్ట్రియల్ గ్యాస్ కూడా జూన్ 23న ఐపీఓలోకి రానుంది. రూ. 852 కోట్లు సమీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. రూ. 400 కోట్ల విలువైన కొత్త షేర్లు అందుబాటులో ఉంటాయి. కంపెనీ షేరు ఐపీఓ ధరను రూ.380-400గా నిర్ణయించింది. పెట్టుబడిదారులు కనీసం రూ. 14,800 పెట్టుబడి పెట్టాలి. జూలై 1న లిస్టింగ్ జరగనుంది. 37 షేర్లు కనీస సంఖ్యగా నిర్ణయించారు. ఇక జూన్ 23న కల్పతరు లిమిటెడ్ 1590 కోట్ల రూపాయల సమీకరణ లక్ష్యంగా IPOలోకి రానుంది. జూన్ 26 వరకు పెట్టుబడి దారులు బిడ్డింగ్ చేయవచ్చు. మొత్తం 3,84,05,797 షేర్లు ఉండగా ఒక్కో షేరుకు రూ. 387-414గా నిర్ణయించింది కంపెనీ. కనీస షేర్ల సంఖ్య 36గా ఉంది. ఈ కంపెనీలో షేర్లు కొనుగోలు చేసే పెట్టుబడిదారులు కనీసం రూ. 14,904 పెట్టుబడి పెట్టాలి.
ఇక జూన్ 25న HDFC బ్యాంక్ అనుబంధ సంస్థ HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ IPOతో పాటుగా సంభవ్ స్టీల్ ట్యూబ్స్ IPO కూడా మార్కెట్లోకి రానుంది. రూ. 12,500 కోట్లు సమీకరణతో HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓలోకి వస్తోంది. జూన్ 27 వరకు ఆసక్తి ఉన్న వారు పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 10000 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనుంది.దీంతో పాటుగా రూ. 2500 కోట్ల విలువైన కొత్త షేర్ల జారీ కూడా ఉంటుంది. కనీస ధర రూ. 700-740 మధ్య ఉండగా.. మొత్తం 20 షేర్లు కనీసం పెట్టుబడి దారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటి విలువ రూ. 14,800 గా ఉండనుంది. జూలై 2న మార్కెట్లో లిస్ట్ కానుంది.
మరో ఐపీఓ సంభవ్ స్టీల్ ట్యూబ్స్ మార్కెట్లోకి జూలై 2న రానుండగా జూన్ 27 వరకు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. రూ.440 కోట్ల విలువైన తాజా షేర్లతో రూ.540 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరో రూ.100 కోట్ల విలువైన షేర్లను OFS ద్వారా విక్రయించనున్నారు. దీని కనీస ధర రూ.77-82 మధ్య ఉండగా పెట్టుబడిదారులు కనీసం 182 షేర్లు కొనుగోలు చేయాలి. రూ.14,924 పెట్టుబడిగా పెట్టాలి. ఇక జూన్ 26న ఇండోగల్ఫ్ క్రాప్‌సైన్సెస్ రూ. 160 కోట్ల నిధుల సమీకరణతో ఐపీఓలోకి రానుంది.జూన్ 30 వరకు పెట్టుబడులకు అవకాశం ఉంది. అయితే కనీస ధరను కంపెనీ ఇంకా నిర్ణయించలేదు. 36,03,603 షేర్లను ఆఫర్ సేల్ ద్వారా కంపెనీ అమ్మకానికి ఉంచింది. ఈ ఇష్యూ జూలై 3న BSE-NSEలో జాబితాలోకి చేర్చనున్నారు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications