Gaja Capital IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోలు అలుపెరగని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద ఐపీవోల నుంచి ఎస్ఎమ్ఈల వరకు గ్యాప్ లేకుండా నిరంతరం ఐపీవోల రాకను ఇన్వెస్టర్లు ఆస్వాధిస్తున్నారు. వేల కోట్లు ఇష్యూలపై కుమ్మరిస్తూ.. వాటి లిస్టింగ్ నుంచి లాభాలు పొందేందుకు బెట్టింగ్ వేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలో మెజారిటీ ఐపీవోలు మార్కెట్ల ప్రతికూలతల మధ్య సైతం ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది గజ క్యాపిటల్ కంపెనీ ఐపీవో గురించే. కంపెనీ తన ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఎంట్రీ ఇవ్వాలని చాలా కాలంగా వేచి చూస్తోంది. ప్రస్తుతం మార్కెట్లు అనుకూలంగా ఉండటంతో తన ఐపీవోను ఫ్లోట్ చేసేందుకు సెబీ వద్ద దరఖాస్తు చేసుకుంది. RBL బ్యాంక్‌లో ఇది మొదటి ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారు కావటం గమనార్హం. ఈ క్రమంలో కంపెనీ మర్చంట్ బ్యాంకర్ గా ఐపీవోను ముందుకు తీసుకెళ్లటానికి సలహాలు, సూచనలు పొందటానికి ఐఐఎఫ్ఎల్ కంపెనీని ఎంచుకున్నట్లు తేలింది. రానున్న డిసెంబరు మాసంలో తన ఐపీవో కోసం కంపెనీ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. చాలా మంది ఈ కంపెనీ ఐపీవోపై ప్రస్తుతం దృష్టిసారించారు. ఈ కంపెనీకి అనేక ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు ఉండటమే అందుకు కారణంగా తెలుస్తోంది.

వాస్తవానికి కంపెనీ 2004లో స్థాపించబడింది. దీనిని ఐఐటీ దిల్లీ పూర్వపు విద్యార్థి గోపాల్ జైన్ ప్రారంభించారు. అప్పటి నుంచి కంపెనీ నాలుగు ఫండ్స్ ద్వారా దాదాపు 500 మిలియన్ డాలర్లను సమీకరించింది. ఆ మెుత్తాన్ని దాదాపు 24 వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. కంపెనీ పెట్టుబడులు పెట్టిన కొన్ని కంపెనీల జాబితాను పరిశీలిస్తే.. సిఎల్ ఎడ్యుకేట్, టీమ్‌లీజ్, RBL బ్యాంక్, జాన్ డిస్టిలరీస్ ఉన్నాయి. 2010లో టీమ్‌లీజ్‌లో కంపెనీ చేసిన రూ.75 కోట్ల పెట్టుబడిపై దాదాపు 10 రెట్లు రాబడిని అందుకుంది. 2010-2020 మధ్య కాలంలో దాదాపు మూడుసార్లు ఆర్బీఎల్ బ్యాంకులో వాటాలను గజ క్యాపిటల్ కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. అలాగే జాన్ డిస్టిలరీస్ లో వాటాలను సంస్థ అమెరికాలోని 4వ అతిపెద్ద ఆల్కహాల్ బెవరేజెస్ తయారీదారు సజెరాక్‌కు విక్రయించిందని తేలింది. దీని నుంచి కూడా భారాగానే లాభాలను ఆర్జించినట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో సైతం కంపెనీ అనేక కొత్త తరం కంపెనీల్లో భారీగానే తన పెట్టుబడులను చేసింది. ముందుగా హోమ్ ఫైనాన్స్ కంపెనీ వీవర్‌లో రూ.800 కోట్లు పెట్టుబడి పెట్టగా.. స్టార్టప్ అంబర్‌లో రూ.175 కోట్లను ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడైంది. అలాగే ఈకామర్స్ లాజిస్టిక్స్ సంస్థ ఎక్స్‌ప్రెస్‌బీస్‌లో మరో రూ.800 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు వెల్లడైంది. మంచి సంస్థలను ముందుగానే గుర్తించి వాటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా సంస్థ మంచి రాబడులను అందుకోవటంతో మార్కెట్లో చాలా మంది ఈ కంపెనీ ఐపీవో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కంపెనీ మెయిన్ కేటగిరీలో లిస్టింగ్ కోసం ప్రయత్నించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications