Innovision IPO: మరో రెండు వారాల్లో 2024 ముగింపుకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లో ఐపీవోల కోలాహలం మాత్రం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. దీంతో దేశంలోని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఇప్పటికీ రాబోయే ఐపీవోలపైనే కొనసాగిస్తున్నారు. వాస్తవానికి దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో ఉండటంతో ఈక్విటీ ఇన్వెస్టర్లు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఇన్నోవిజన్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. తాజాగా కంపెనీ తన ఐపీవో కోసం సెబీ వద్ద డీఆర్హెచ్పీ దాఖలు చేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా పేపర్లను సెప్టెంబర్ 30న దాఖలు చేసింది. కంపెనీ ఇటీవలి కాలంలో తన ఐపీవో పరిమాణాన్ని రూ.315 కోట్ల నుంచి రూ.255 కోట్లకు తగ్గించింది. ఈ క్రమంలో కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ కింద 17.71 లక్షల షేర్లను విక్రయించింది. వాస్తవానికి దీనికి ముందు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో 11.81 లక్షల షేర్లను విక్రయించాలని కంపెనీ యోచించింది. రణదీప్ హుందాల్, ఉదయ్ పాల్ సింగ్ కంపెనీ ప్రమోటర్లుగా ఉన్నారు.

కంపెనీకి భారతదేశంలోని 22 రాష్ట్రాలుష 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ వివిధ రంగాలకు చెందిన 200 కంటే ఎక్కువ క్లయింట్‌లకు సేవలను అందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో మానవశక్తి సేవల వ్యాపారం ఆదాయానికి 40 శాతం, టోల్ ప్లాజా నిర్వహణలో 56 శాతం దోహదపడింది. గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ తాజా ఇష్యూ ద్వారా సమీకరించే ఆదాయంలో రూ.43 కోట్లను రుణాల చెల్లింపుకు వినియోగించాలని నిర్ణయించింది. అలాగే రూ.127 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించాలని నిర్ణయించింది. కంపెనీ పుస్తకాల ప్రకారం నవంబర్ నాటికి రూ.72.4 కోట్లు మేర అప్పులను కలిగి ఉందని వెల్లడైంది.
ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూని నిర్వహించడానికి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‍గా నియమించబడింది. కంపెనీ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.10.3 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.8.9 కోట్ల నుండి 15.6 శాతం పెరిగగా.. ఆదాయం దాదాపు రెండింతలు పెరిగి రూ.510.3 కోట్లకు చేరుకుంది. కంపెనీ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారులు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారులు, రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్లు లక్ష్యంగా చేసుకుంటూ ప్రస్తుతం ఐపీవో కోసం సెబీ నుంచి అనుమతులు పొందటానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications