ఇన్ఫోసిస్ షేర్ బైబ్యాక్ నేటి నుంచే ప్రారంభం.. పాల్గొనే ముందు పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు ఇవే

ఇన్ఫోసిస్ ఈరోజు (నవంబర్ 20) అధికారికంగా రూ. 18 వేల కోట్ల భారీ షేర్ బైబ్యాక్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ అంశం పెట్టుబడిదారులలో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఇది కంపెనీ ఇప్పటి వరకు చేపట్టిన అతిపెద్ద బైబ్యాక్. అలాగే షేర్‌హోల్డర్లకు ప్రస్తుత మార్కెట్ ధరపై గణనీయమైన ప్రీమియం లభించే అవకాశం ఉంది. నవంబర్ 20న మధ్యాహ్నం 2 గంటలకు ఇన్ఫోసిస్ షేర్ రూ. 1,537 వద్ద ట్రేడవుతుండగా.. బైబ్యాక్ ధరను కంపెనీ రూ. 1,800 గా నిర్ణయించింది. అయితే ఈ ఆఫర్‌లో పాల్గొనేముందు పన్నులు, అంగీకార నిష్పత్తి, మార్కెట్ ప్రత్యామ్నాయాలు వంటి అంశాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు Infosys బైబ్యాక్‌లో పాల్గొనదలచిన పెట్టుబడిదారులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 6 ముఖ్య అంశాలు ఓ సారి చూద్దాం.

మీకు బైబ్యాక్‌లో పాల్గొనే అర్హత ఉందా?: బైబ్యాక్ కోసం కంపెనీ నిర్ణయించిన రికార్డ్ తేదీ నవంబర్ 14, 2025. ఆ రోజున డీమ్యాట్ ఖాతాలో ఇన్ఫోసిస్ షేర్లు ఉన్నవారికే పాల్గొనే అర్హత ఉంటుంది. ఆ తర్వాత కొనుగోలు చేసిన షేర్లు అర్హులు కావు.ఈ బైబ్యాక్‌లో కంపెనీ దాదాపు 2.4 శాతం షేర్లను తిరిగి కొనుగోలు చేస్తోంది. అందువల్ల అంగీకార నిష్పత్తి (Acceptance Ratio) ఎంత పెరుగుతుందన్నది మార్కెట్ పాల్గొనుదారుల సంఖ్యపై ఆధారపడుతుంది.

Infosys share buyback Infosys buyback 2025 Infosys buyback details Infosys investor guide Infosys tender offer Infosys buyback price Infosys share market news Infosys stock buyback process Infosys buyback eligibility Infosys shareholder information Infosys corporate action Infosys BSE NSE update 2025 NSE BSE

పన్ను నియమాలు : ఇది పెట్టుబడిదారులకు అత్యంత కీలకమైన మార్పు అని చెప్పవచ్చు. కొత్త చట్టాల ప్రకారం బైబ్యాక్ ద్వారా పొందే లాభాలు ఇకపై ఇతర వనరుల ఆదాయం గా పరిగణిస్తారు.అలాగే పెట్టుబడిదారుడి వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధించబడుతుంది. ఎవరైనా 30 శాతం స్లాబ్‌లో ఉంటే, వారి లాభంపై అంతే శాతం పన్ను వర్తిస్తుంది. పాత విధానంలో కంపెనీ 20 శాతం పన్ను చెల్లించేది. కొత్త నియమాల వల్ల హై-ఇంకమ్ స్లాబ్ పెట్టుబడిదారులకు బైబ్యాక్ అంతగా లాభదాయకం కాకపోవచ్చు.

ఓపెన్ మార్కెట్లో అమ్మడం మంచిదేనా?: బైబ్యాక్‌కి ఇవ్వడం కాకుండా మార్కెట్‌లోనే షేరు అమ్మి అధిక లాభం పొందే అవకాశం కూడా ఉంది. పన్ను రేట్లు ఓ సారి చూసినట్లయితే.. 1 సంవత్సరానికి పైగా షేర్ అంటి పెట్టుకుని ఉంటే 12.5% (LTCG), ఇక 1 సంవత్సరంలోపు అమ్మితే 20% (STCG), ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.25 లక్షల LTCG పన్ను రహితంగా ఉంటుంది. అందువల్ల దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఓపెన్ మార్కెట్లో అమ్మడం మరింత లాభదాయకం కావచ్చు.

TDS - నగదు ప్రవాహంపై ప్రత్యక్ష ప్రభావం: బైబ్యాక్ ద్వారా లాభం పొందిన ప్రతి పెట్టుబడిదారుపైనా.. రూ. 1,000 కంటే ఎక్కువ లాభంపై 10 శాతం TDS కట్ అవుతుంది. తక్కువ పన్ను స్లాబ్ ఉన్నవారు తర్వాత రిఫండ్ పొందినా, తాత్కాలికంగా కాష్‌ఫ్లో తగ్గుతుంది. ఇది చిన్న పెట్టుబడిదారులపై కొంత భారంగా మారవచ్చు.

ప్రమోటర్లు బైబ్యాక్‌లో పాల్గొనడం లేదు: ఇన్ఫోసిస్ ప్రమోటర్లు ఈ బైబ్యాక్‌లో పాల్గొనబోమని ప్రకటించారు.దీంతో పబ్లిక్ పెట్టుబడిదారులకు అంగీకార నిష్పత్తి పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, 100 శాతం అంగీకారం ఖాయం కాదు. ముఖ్యంగా పెద్ద పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులకు ఇది తెలుసుకోవాల్సిన అంశం.

చిన్న పెట్టుబడిదారులకు అదనపు ప్రయోజనం: రూ. 2 లక్షల లోపు విలువ గల షేర్లు కలిగినవారు Small Shareholder వర్గంలోకి వస్తారు. వారికి బైబ్యాక్‌లో ప్రత్యేక కేటాయింపు (Reserved Quota) ఉంటుంది. దీంతో వారి షేర్లు అంగీకరించబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

క్లుప్తంగా చెప్పాలంటే ఇన్ఫోసిస్ బైబ్యాక్ ధర ఆకర్షణీయమే అయినా..కొత్త పన్ను నియమాలు ఈసారి లాభాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. మీ పన్ను స్లాబ్, బైబ్యాక్‌తో వచ్చే నికర లాభం, మార్కెట్‌లో అమ్మితే వచ్చే లాభం.. ఇవి మూడు అంశాలను పరిగణలోకి తీసుకుని బై బ్యాక్ కు వెళ్లడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+