Stock Markets: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పడిపోయిన ఇన్ఫోసిస్ ఏడీఆర్ షేర్లు..!

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఏడీఆర్ షేర్లు భారీగా పడిపోయాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో గురువారం ఇన్ఫోసిస్ ఏడీఆర్ స్టాక్ 5.76 శాతం తగ్గి క్షీణించి 10.30డాలర్లకు చేరింది. ఇది 2.01 శాతం నష్టంతో ఒక్కో షేరు 10.71 డాలర్ల వద్ద ముగిసింది. ఏడీఆర్ అనేది ఒక విదేశీ కంపెనీ షేర్లకు ప్రాతినిధ్యం వహిస్తూ, యూఎస్ బ్యాంకు జారీ చేసే ఒక బదిలీ చేయదగిన సర్టిఫికేట్. ఇది న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్, నాస్‌డాక్ వంటి యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో కంపెనీ షేర్లను ట్రేడ్ చేయడానికి అనుమతిస్తుంది.
ఇన్ఫోసిస్ మొదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2027 ఆర్థిక సంవత్సరపు ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించడంతో యూఎస్ ట్రేడింగ్‌లో దాని అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ 5 శాతానికి పైగా పడిపోయాయి.

2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నికర లాభం వరుసగా తగ్గిందని, 2027 ఆర్థిక సంవత్సరపు ఆదాయ వృద్ధి అంచనాల గరిష్ట పరిమితిని తగ్గించినట్లు కంపెనీ ప్రకటించింది. ఇన్ఫోసిస్ జూన్ 2026తో ముగిసిన త్రైమాసికంలో రూ.7,769 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇది మార్చి త్రైమాసికంలోని రూ.8,501 కోట్ల లాభంతో పోలిస్తే 8.6% తగ్గుదలను నమోదు చేసింది. ఈ ఐటీ దిగ్గజం ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 3.9% వృద్ధితో రూ.48,211 కోట్లకు చేరగా, డాలర్లలో ఆదాయం 0.8 శాతం పెరిగి రూ.5.08 బిలియన్లకు చేరింది. స్థిర కరెన్సీ ఆదాయ వృద్ధి త్రైమాసిక ప్రాతిపదికన 1 శాతంగా ఉంది.

stock market

ఇన్ఫోసిస్ తన FY27 స్థిర కరెన్సీ ఆదాయ వృద్ధి అంచనాను 1.5 శాతం తగ్గించింది.3.5 శాతం నుంచి 1.5శాతం-3 శాతానికి తగ్గించింది. అయితే తన ఎబిట్డా మార్జిన్ అంచనాను 20 శాతం-22 శాతం వద్ద కొనసాగించింది.శుక్రవారం భారత మార్కెట్లలో కూడా ఇన్ఫోసిస్ స్టాక్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటుంది. ఉదయం 09 గంటల 31 నిమిషాలకు ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ 0.98 శాతం తగ్గి రూ.1,038 వద్ద ట్రేడవుతోంది. కంపెనీకి కాబోయే సీఈఓగా అశిస్ కుమార్ డాష్‌ను తమ డైరెక్టర్ల బోర్డు నియమించినట్లు ఐటీ దిగ్గజం తెలిపింది. ఆయన 2027 ఏప్రిల్ 1న ఐదేళ్ల కాలానికి ఇన్ఫోసిస్ సీఈఓ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేయనున్నారు.

కాగా ఈ రోజు కూడా భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతోన్నాయి. ఉదయం 9 గంటల 43 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 703 పాయింట్లు పడిపోయి 75688 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 198 పాయింట్లు తగ్గి 23,654 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో భారత మార్కెట్లపై ఒత్తిడి పెరుగుతోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+