Indo-MIM: లిస్టింగ్ రోజే భారీ లాభాలను అందించిన స్టాక్.. 45 శాతం ప్రీమియంలో లిస్ట్ అయిన ఇండో ఎంఐఎం షేర్లు..
ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్ మెంట్ ఐపీఓపై భారీ అంచనాలు ఉండే.. కానీ ఈ ఐపీఓ పెట్టుబడిదారులను నిరాశ పరిచింది. కానీ తాజాగా వచ్చిన ఓ ఐపీఓ మాత్రం పెట్టుబడిదారులపై కాసుల వర్షం కురిపించింది. గురువారం ఇండో ఎంఐఎం షేర్లు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి. ఐపీఓ ప్రైస్ కంటే ప్రీమియంలో షేర్లు జాబితాలోకి వచ్చాయి. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇండో- ఎంఐఎం షేర్లు ఎన్ఎస్ఈలో ఒక్కో షేరుకు రూ. 700 చొప్పున లిస్ట్ అయ్యాయింది. ఇది 44.33 శాతం ప్రీమియంతో లిస్ట్ అయింది. కాగా ఈ ఐపీఓ ప్రైస్ రూ.485 కాగా.. రూ.700 లకు లిస్టయింది. అంటే ఒక్కో షేరు రూ.215 పెరిగింది.
ఇండో ఎంఐఎం ఐపీఓ జూలై 23-27 మధ్య ఐపీఓగా వచ్చింది. ఈ ఐపీఓ 72.34 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. బీఎస్ఈలో ఈ ప్రిసిషన్ ఇంజనీరింగ్ విడిభాగాల తయారీ సంస్థ షేర్లు ఒక్కో షేరుకు రూ. 703 చొప్పున, అంటే 44.95 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. షేర్ల లిస్టింగ్ తర్వాత కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 34,762.01 కోట్లుకు చేరింది. గ్రే మార్కెట్‌లో సుమారు 38 శాతం లిస్టింగ్ లాభం ఉంటుందని అంచనా వేయగా.. దాదాపు 45 శాతం ప్రీమియంలో లిస్ట్ అయింది. ఇండో ఎంఐఎం లిమిటెడ్ 'మెటల్ ఇంజెక్షన్ మౌల్డింగ్' (MIM) రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగిన కంపెనీగా ఉంది.

అనేక అంతర్జాతీయ OEMలకు (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులకు) ప్రాధాన్య సరఫరాదారుగా వ్యవహరిస్తోంది. ప్రపంచ ఎంఐఎం మార్కెట్ 2026 నాటికి 3.2 బిలియన్ డాలర్ల నుండి 2035 నాటికి 4.7 బిలియన్ డాలర్లకు (4.4% CAGR) పెరుగుతుందని అంచనా. అదే సమయంలో 'చైనా+1' తయారీ విధాన మార్పు, భారతదేశ అనుకూల విధానాలు, PLI ప్రోత్సాహకాలు, బలమైన తయారీ రంగ వృద్ధి వంటి అంశాల ద్వారా ప్రయోజనం పొందేందుకు ఇండో ఎంఐఎంకు అనుకూల స్థితిలో ఉందని నిపుణులు చెబుతున్నారు.
148 రెట్ల కంటే ఎక్కువ P/E నిష్పత్తితో ట్రేడ్ అవుతున్న తన సమీప అంతర్జాతీయ పోటీ సంస్థతో పోలిస్తే ఇెండో-ఎంఐఎం విలువ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉందని , కాంతిలాల్ ఛగన్‌లాల్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రీసెర్చ్ & బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఓజా పేర్కొన్నారు. అంతకుముందు ఈ కంపెనీ యాంకర్ పెట్టుబడిదారుల నుంచి దాదాపు రూ. 1,141 కోట్లను సమీకరించింది. తాజా ఇష్యూ ద్వారా వచ్చిన నిధుల నుంచి రూ. 400 కోట్లను కొన్ని బకాయి రుణాల ముందస్తు చెల్లింపు లేదా తిరిగి చెల్లింపు కోసం వినియోగించాలని కంపెనీ యోచిస్తోంది. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించనుంది. ఇండో MIM కంపెనీని 1996లో స్థాపించారు. మెటల్ ఇంజెక్షన్ మోల్డింగ్ (MIM) టెక్నాలజీని ఉపయోగించి ప్రెసిషన్ ఇంజనీరింగ్ భాగాలను తయారు చేస్తుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications