భారతదేశ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో వరుసగా ఏడో రోజు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దు అవుతుండగా, ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నడుమ, ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు సోమవారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే కుప్పకూలాయి. ఉదయం 11:25 గంటల సమయానికి BSEలో షేర్లు 7.35 శాతం పడిపోయి రూ.394.90 నష్టంతో రూ.4,976.40 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఉదయం రూ.5,100.05 వద్ద ప్రారంభమైన షేరు, రూ.5,205.05 గరిష్టాన్ని తాకిన తర్వాత పెద్దఎత్తున అమ్మకాల ఒత్తిడితో వేగంగా కిందికి జారింది. ఐదు రోజుల వ్యవధిలో మొత్తం పతనం 7 శాతం దాటింది.
సోమవారం ఒక్కరోజే 350కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. నూతన సంవత్సర ప్రయాణ సీజన్ కారణంగా విమానాశ్రయాలు అత్యంత రద్దీగా ఉన్న సమయంలో ఏర్పడిన ఈ అంతరాయం ప్రయాణికులకు తీవ్రమైన ఇబ్బంది కలిగించింది. ఢిల్లీ విమానాశ్రయంలోనే 134 విమానాలు (75 బయలుదేరేవి, 59 చేరేవి) రద్దు కాగా, బెంగళూరులో 117 నుంచి 127 విమానాలు రద్దయ్యాయని వివిధ వర్గాలు తెలియజేశాయి. అకస్మాత్తుగా రద్దయిన విమానాల వల్ల రీఫండ్‌లు, రీషెడ్యూలింగ్, గేట్ మార్పులు, బ్యాగేజ్ సమస్యలతో ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్ట్‌లలో ఇరుక్కున్నారు. సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శల వెల్లువ వెల్లువెత్తి, సంస్థపై ప్రయాణికుల ఆగ్రహం మరింత పెరిగింది.

ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా కొత్తగా అమలులోకి వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్ (FDTL) నిబంధనలేనని ఇండిగో స్పష్టం చేసింది. పైలట్ల విశ్రాంతి సమయాలను పెంచడం, రాత్రి డ్యూటీ పరిమితిని కఠినతరం చేయడం, వరుసగా రెండు రాత్రులకంటే ఎక్కువ ల్యాండింగ్‌లకు అనుమతి లేకపోవడం వంటి నియమాలు అకస్మాత్తుగా పైలట్ షెడ్యూల్స్‌లో భారీ మార్పులను కల్పించాయి. ఈ నిబంధనలను మొదట ఇండిగో, ఎయిర్ ఇండియా వ్యతిరేకించినప్పటికీ, ఢిల్లీ హైకోర్టు ఆదేశాల కారణంగా అమలు తప్పనిసరి అయింది. అయితే ఇండిగో ఫిబ్రవరి 10 వరకు రెండో దశ నిబంధనలలో తాత్కాలిక ఉపశమనం పొందింది.
ఈ పరిణామాల మధ్య, విమానయాన నియంత్రణ సంస్థ DGCA ఇండిగో ప్రధానాధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భారీ స్థాయిలో జరిగిన కార్యాచరణ వైఫల్యాలు సంస్థలో ప్రణాళిక లోపాలను సూచిస్తున్నాయనే అభిప్రాయాన్ని DGCA వ్యక్తం చేసింది. CEO పీటర్ ఎల్బర్స్, COO ఇసిడ్రో పోర్క్వెరాస్ సోమవారం సాయంత్రం 6 గంటలలోపు వివరణ సమర్పించాలని ఆదేశించారు.
స్టాక్ మార్కెట్లో పతనం ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తుండగా, మరోవైపు ప్రయాణికులకు సరైన సమాచారం అందకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. పీక్ ట్రావెల్ సీజన్ కావడంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాలు దొరకటం కష్టతరమవుతోంది. నిపుణుల అంచనా ప్రకారం..ఆపరేషన్లు పూర్తిగా సాధారణ స్థితికి చేరడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. అంత వరకు ధరలు పెరగడం, బుకింగ్ ఒత్తిడి, ప్రయాణ అసౌకర్యం కొనసాగవచ్చని అంటున్నారు.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications