Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 7వ ట్రేడింగ్ సెషన్లోనూ తన నష్టాలను కొనసాగించింది. దీంతో భారతీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు కలిగి ఉన్న ఇన్వెస్టర్లు భారీగా నష్టాలను చూస్తున్నారు. మరోపక్క అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపుతో క్రిప్టో కరెన్సీలు భారీగా లాభాల్లో మునిగి తేలుతున్నాయి. ప్రధాన క్రిప్టో కరెన్సీగా ఉన్న బిట్ కాయిన్ తన బుల్ జోరును కొనసాగిస్తూ ఆల్‌టైం గరిష్ఠాల దిశగా దూసుకుపోతోంది. రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి నుంచి కోలుకుని 6 పైసలు పెరిగి రూ.84.40 వద్ద స్థిరపడింది
భారతీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్స్ గడచిన 35 ట్రేడింగ్ సెషన్లలో ఏకంగా రూ.50 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ప్రస్తుతం బేర్ జోరు కొనసాగుతున్న వేళ అమ్మకాల ఒత్తిడి భారీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 27న దేశీయ స్టాక్ మార్కెట్లో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 85978.25 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన తర్వాత ప్రస్తుతం సూచీ 77,339.01కి దిగజారింది. మార్కెట్ల ముగింపు సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 241 పాయింట్ల నష్టాన్ని కలిగి ఉంది. ఇదిలా ఉండగా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దాదాపు రూ.1.15 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్నారు. అలాగే మరోపక్క అమెరికా అధ్యక్షపదవికి ట్రంప్ ఎంపిక కావటంతో డాలర్ దూకుడు కొనసాగిస్తుండటంతో రూపాయి సైతం పతనాన్ని చూస్తూ సరికొత్త కనిష్ఠాలకు విలువను కోల్పోతోంది.

అయితే ఇప్పుడు క్రమంగా ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్స్, బ్లూ చిప్ కంపెనీల షేర్ల కొనుగోలుకు ఎక్కువగా మక్కువ చూపుతున్నారని యెస్ బ్యాంక్ సెక్యూరిటీస్‌కి చెందిన అమర్ అంబానీ వెల్లడించారు. గడచిన మూడేళ్లు పెట్టుబడిదారులకు మార్కెట్లో ఆట సులువుగా ఉందని, అప్పట్లో ప్రతి రంగంలోనూ అనేక స్టాక్స్ బుల్ ర్యాలీలో పాల్గొన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రముఖ బ్రోకర్లు, వెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, ఇన్సూరెన్స్ ప్లేయర్‌లు భారతీయ పెట్టుబడిదారులను ఆర్థిక ఆస్తుల వైపు భారీ మళ్లించేలా ఉన్నాయని ఆయన అన్నారు. ఏంజెల్ వన్, ఆనంద్ రాఠీ వెల్త్, మాక్స్ ఫైనాన్షియల్స్‌పై మార్కెట్ బుల్లిష్‌గా ఉన్నారు. ఇదే క్రమంలో అమర్ శ్రీరామ్ ఫైనాన్స్, కెన్ ఫిన్ హోమ్స్ కూడా ఇష్టాన్ని వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ట్రంప్ గెలుపుతో అమెరికా స్టాక్ మార్కెట్లు విజయోత్సవ ర్యాలీని కొనసాగిస్తూనే ఉన్నాయి. ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో సంధి కుదర్చగలికితే భౌగోళిక రాజకీయ ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. మరింత చమురును పంపింగ్ చేయాలనే ట్రంప్ విధానం కూడా ముడి ధరలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. వీటిలో ట్రంప్ విజయం సాధిస్తే అది భారత ఈక్విటీలకు మేలు చేస్తుందని అమర్ అంబానీ అన్నారు. అలాగే రూపాయి విలువ పతనం ఎఫ్ఐఐలను మార్కెట్లకు దూరం చేస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కరెన్సీల పతనం ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం కలిగిస్తుందని వెల్లడించారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విధానాలపై దిశ ఎఫ్ఐఐల పెట్టుబడులకు మార్గనిర్థేశం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications