Market Holiday: రేపు మహాశివరాత్రికి స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయా..? లేక NSE-BSE క్లోజ్ అవుతాయా..?

Maha Shivratri 2025: కొత్త సంవత్సరంలో మహాశివరాత్రి ఫిబ్రవరి 26న వచ్చింది. అయితే ఈ హిందువుల పండుగ రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయా లేక సెలవులో ఉంటాయా అనే అనుమానం చాలా మందిలో ఉంది. ప్రధానంగా స్కూళ్ల నుంచి ప్రభుత్వ ఆఫీసుల వరకు అందరికీ సెలవులు ఉండటంతో ట్రేడర్లలో కూడా సెలవుపై గందరగోళం కొనసాగుతోంది.

ఇక్కడ ఆశ్చర్యకరంగా మహాశివరాత్రికి దేశీయ స్టాక్ మార్కెట్లు తెరచుకోవు. దీంతో పెట్టుబడిదారులకు ఉన్న అనుమానం క్లియర్ అయ్యింది. ఈ రోజున స్టాక్ మార్కెట్లలోని ఎన్ఎస్ఈ, బీఎస్ఈ రెండూ ప్రజలకు అందుబాటులో ఉండవని గుర్తుంచుకోవాలి. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26, 2025న స్టాక్ మార్కెట్లకు సెలవుగా అధికారిక హాలిడే క్యాలెండర్ ప్రకారం వెల్లడైంది. దీని కారణంగా ఈక్విటీలతో పాటు డెరివేటివ్స్, కమోడిటీస్ సెగ్మెంట్లలో ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోనుంది.

Indian stock markets to Remain Closed on eve of Maha Shivratri tomorrow Know details

మహాశివరాత్రి రోజున దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవులు ఉన్నాయి. ఇదే క్రమంలో అనేక స్కూళ్లు, కాలేజీలకు సెలవు దినంగా ప్రకటించబడింది. అలాగే మహాశివరాత్రి రోజున దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు సైతం సెలవులో ఉండనున్నాయి. కానీ గ్లోబల్ స్టాక్ మార్కెట్లు మాత్రం రేపు పనిచేయనున్నాయి. ప్రధానంగా ఆసియా మార్కెట్లతో పాటు అమెరికా స్టాక్ మార్కెట్లు రేపు పనిచేస్తాయని వెల్లడైంది.

మెుదటి హోలిడే..
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ 2025లో తమ సెలవులకు సంబంధించిన వివరాలను తాజాగా ప్రకటించాయి. ఈ క్రమంలో మెుదటి సెలవు ఫిబ్రవరి 26, 2025న వస్తోంది. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ సెలవుల క్యాలెండర్ ప్రకారం 2025లో దాదాపు 14 రోజుల పాటు వివిధ కారణాల వల్ల స్టాక్ మార్కెట్లు అదనంగా సెలవులో ఉంటాయని తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాది దీపావళి రోజున ప్రత్యేకంగా ఒక గంట పాటు నిర్వహించే ముహురత్ ట్రేడింగ్ అక్టోబర్ 21, 2025న నిర్వహించనున్నట్లు వెల్లడించబడింది.

2025 స్టాక్ మార్కెట్ హాలిడేస్..

-ఫిబ్రవరి 26, 2025 (బుధవారం): మహాశివరాత్రి

-మార్చి 14, 2025 (శుక్రవారం): హోలీ

-మార్చి 31, 2025 (సోమవారం): రంజాన్

-ఏప్రిల్ 10, 2025 (గురువారం): శ్రీ మహావీర్ జయంతి

-ఏప్రిల్ 14, 2025 (సోమవారం): అంబేద్కర్ జయంతి

-ఏప్రిల్ 18, 2025 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే

-మే 01, 2025 (గురువారం): మహారాష్ట్ర దినోత్సవం

-ఆగస్టు 15, 2025 (శుక్రవారం): స్వాతంత్ర్య దినోత్సవం

-ఆగస్టు 27, 2025 (బుధవారం): గణేష్ చతుర్థి

-అక్టోబర్ 02, 2025 (గురువారం): మహాత్మా గాంధీ జయంతి/దసరా

-అక్టోబర్ 21, 2025 (మంగళవారం) దీపావళి లక్ష్మీ పూజ

-అక్టోబర్ 22, 2025 (బుధవారం): దీపావళి

-నవంబర్ 05, 2025 (బుధవారం): గురునానక్ జయంతి

-డిసెంబర్ 25, 2025 (గురువారం): క్రిస్మస్

2025లో ఫిబ్రవరి, మే, నవంబర్, డిసెంబర్ మాసాల్లో కేవలం ఒక్క రోజు చొప్పున సెలవులు ఉండగా.. మార్చి, ఆగస్టులలో రెండు స్టాక్ మార్కెట్ సెలవులు వచ్చాయి. ఇక అత్యధికంగా మూడు రోజుల పాటు స్టాక్ మార్కెట్ సెలవులు ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో ఉండటం గమనార్హం. ఇదే క్రమంలో గణతంత్ర దినోత్సవం, శ్రీరామ నవమి, బక్రీద్ వంటి పండగులు స్టాక్ మార్కెట్ల వారాంతపు సెలవు రోజుల్లోనే వచ్చినందున ప్రత్యేకంగా అదనపు సెలవులు ఈ పండుగలకు రాలేదు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+