Stock Market Closing: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఐటీ కంపెనీల్లో అమ్మకాల ఒత్తిడి..
చమురు ధరల పెరుగుదల, అమెరికా-ఇరాన్ చర్చలు నిలిచిపోవడం, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం వంటి అంశాల ఒత్తిడితో శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ 3 పాయింట్లు పెరిగి 77,540.83 వద్ద ముగియగా, నిఫ్టీ 50 సూచీ 20 పాయింట్లు పెరిగి 24,252 వద్ద స్థిరపడింది. ఇదే సమయంలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 సూచీ 0.08 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 సూచీ 0.41 శాతం మేర పెరిగాయి. ఈ వారంలో 30 షేర్ల సెన్సెక్స్ సూచీ 0.60% మేర పడిపోగా, నిఫ్టీ 50 సూచీ 0.50% మేర క్షీణించింది. అమెరికా-ఇరాన్ చర్చలు నిలిచిపోవడం, భారతదేశ ఆర్థిక ఆరోగ్యం మరియు వృద్ధి-ద్రవ్యోల్బణ గతిశీలతపై అధిక చమురు ధరల ప్రభావం గురించిన ఆందోళనల నేపథ్యంలో, సెన్సెక్స్, నిఫ్టీ 50 ఈ నెలలో అర శాతానికి పైగా పడిపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ లో పవర్ గ్రిడ్, బీఈఎల్, కోటక్ మహింద్రా బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఏసియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్ టీ, టైటాన్, టీసీఎస్, అదానీ పోర్ట్స్, భారతి ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎటర్నల్ లాభాల్లో ముగిశాయి. సన్ ఫార్మా, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐఎన్, యాక్సెస్ బ్యాంక్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, టెక్ మహింద్రా, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలివర్, హెచ్ సీఎల్ టెక్, ఇండోగో, మారుతి, ట్రెంట్ నష్టాల్లో ముగిశాయి.

నిఫ్టీలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, నెస్లే, కొటక్ మహీంద్రా బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభాల్లో ముగియగా.. మారుతి సుజుకీ, ట్రెంట్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, సిప్లా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ షేర్లు నష్టల్లో ముగిశాయి. లోహ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఐటీ, ఆటో, మీడియా, ఫార్మా రంగాల షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 3 పైసలు పెరిగి 95.71 వద్ద ముగిసింది. శుక్రవారం కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి.24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1210 పెరిగి రూ.1,60,480 వద్ద కొనసాగుతుండగా.. తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ.1110 పెరిగి రూ.1,47,100 వద్ద ట్రేడవుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల పుత్తడి ధర రూ.900 పెరిగి రూ.1,20,360కి చేరింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications