Stock Market Crash: భారతీయ స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం కొనసాగుతూనే ఉంది. వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లో నేడు దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ క్రమంలో నేడు ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ స్టాక్ భారీగా పతనాన్ని చూశాయి.
లార్జ్ క్యాప్ కేటగిరీలోని కంపెనీల్లోకి ఇన్‌ఫ్లోలు పెరగడం, స్మాల్ క్యాప్ కంపెనీల షేర్లలో పెట్టుబడిపై ఇన్వెస్టర్ల నుంచి ఉత్సాహం తగ్గటంతో స్మాల్ క్యాప్ ర్యాలీ పోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అనిశ్చితుల మధ్య బ్లూచిప్ కంపెనీలపై ఇన్వెస్టర్ల మక్కువ పెరిగి అవి పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయి. గడచిన నెల రోజుల కాలంలో లార్జ్ క్యాప్ కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెరగటం కనిపిస్తోంది. దీనిని చూస్తుంటే ఇన్వెస్టర్లు ప్రధానంగా సేఫ్టీ, వాల్యుయేషన్, స్థితిస్థాపకత కోసం వీటిని తమ పోర్ట్ ఫోలియోలో చేర్చుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

స్టాక్ మార్కెట్ల క్లోజింగ్ సమయానికి కొద్ది సేపటి ముందు అంటే సాయంత్రం 3.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 825 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా, మరో కీలక సూచీ నీఫ్టీ 272 పాయింట్ల పతనాన్ని చూసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 718 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 637 పాయింట్ల మేర పతనమయ్యాయి. అయితే మార్కెట్లు నిరతరం పడిపోతూ బేర్స్ చితిలో చిక్కటానికి ఉన్న కారణాల గురించి ఇప్పుడు ఇన్వెస్టర్లు వెతుకున్నారు.
భారతీయ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు గ్లోబల్ సెల్లాఫ్ కారణంగా ప్రభావితం అవుతున్నాయి. ఈ క్రమంలో డాలర్ ఇండెక్స్ పెరుగుదల, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ డబ్బును వెనక్కి తీసుకోవటం వంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇదే క్రమంలో దేశీయంగా రెండవ త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీలు ఆదాయాలు పేలవంగా ఉండటం కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ దూకుడు భవిష్యత్తులో వాణిజ్య విధానాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో డాలర్ బలపడటంతో రూపాయి ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో కనిష్ఠాలకు పడిపోయింది. పైగా ఇది మరింత విదేశీ ప్రవాహాల భయాలను ప్రేరేపించింది.
ఇదే క్రమంలో ఇతర మార్కెట్ల పనితీరును పరిశీలిస్తే.. యూరోపియన్ మార్కెట్లు సైతం మధ్యాహ్నం నష్టాల్లో కొనసాగుతున్నాయి. అలాగే ఆసియా మార్కెట్లు సైతం నష్టాలను చవిచూశాయి. ట్రంప్ రాకతో రూపాయి విలువ మరింతగా పతనం ఉంటుందని విశ్లేషకలు అంచనా వేస్తున్నారు. అలాగే ఫారెన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు తరలిపోవటం మార్కెట్లలో పెద్ద కరెక్షన్ కి దారితీసిందని JM ఫైనాన్షియల్ పేర్కొంది. ఎఫ్‌పిఐల కనికరంలేని విక్రయాలు మార్కెట్లో బేర్స్ పంజాను పెంచిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ అన్నారు. ఇదే క్రమంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం భారీగా అమ్మకాలు చేపడుతూ తమ డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు. చరిత్రలో ఇదొక పెద్ద తరలింపుగా నిలిచిపోనుందని నిపుణులు అంటున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications