Sensex-Nifty Cracks: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ప్రారంభంలో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధానంగా మార్కెట్లు ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లను ఫాలో అవుతున్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపుపై చేసిన ప్రకటనతో యూఎస్ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్న తర్వాత ప్రపంచ మార్కెట్లు సైతం అదే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి.
వాస్తవానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ చైర్ జెరోమ్ పావెల్ తాజాగా మానిటరీ పాలసీ నిర్ణయాలను ప్రకటిస్తూ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను తగ్గించినందున మెుత్తం 100 బేసిస్ పాయింట్ల మేర రేట్ల కోత జరిగింది. ఇదే క్రమంలో 2025 కోసం ద్రవ్య విధాన సడలింపుల విషయంలో హాకిష్ వ్యూ కలిగి ఉన్నట్లు వెల్లడించింది. అయితే అమెరికా సెంట్రల్ బ్యాంక్ నిర్ణయంతో గ్లోబల్ మార్కెట్లు సంతోషంగా లేవని తెలుస్తోంది. ఈ క్రమంలో భారతీయ స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ ఇంట్రాడేలో ఏకంగా 1000 పాయింట్ల మేర పతనాన్ని నమోదు చేసింది. నిఫ్టీ సూచీ సైతం 24,000 పాయింట్ల కింద ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

ఉదయం 9.58 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 810 పాయింట్ల మేర పతనంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 240 పాయింట్లకు పైగా నష్టంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 580 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 430 పాయింట్లకు పైగా పతనంతో ఉన్నాయి. ఈ క్రమంలో నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఆటో, బ్యాంక్ నిఫ్టీ సూచీలు అత్యధికంగా అమ్మకాల ఒత్తిడిని చూస్తున్నాయి. విప్రో, హిందాల్కొ, ఇన్ఫోసిస్ స్టాక్స్ పతనంలో సూచీలను నష్టాల్లోకి లాగుతున్నాయి. పెరిగిన భయాందోళనలతో ఐటీ స్టాక్స్ విక్రయించేందుకు ఇన్వెస్టర్లు ప్రధానంగా మెుగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం నిపుణుల అంచనా ప్రకారం అమెరికా సెంట్రల్ బ్యాంక్ 2025లో మరో 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
క్రిప్టోలపై అమెరికా సెంట్రల్ బ్యాంక్ చైర్ జెరోమ్ పావెల్ కీలక ప్రకటన చేశారు. వాస్తవానికి ట్రంప్ రాకతో క్రిప్టోలకు మంచిరోజులు వస్తాయనే ఊహాగానాలతో ఇటీవల బిట్ కాయిన్ మెగా ర్యాలీని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటికి పావెల్ చెక్ పెట్టారని తెలుస్తోంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ బిట్ కాయిన్లను హోల్డ్ చేసేందుకు అనుమతించబడదని వెల్లడించారు. అయితే దీనిపై నిర్ణయాన్ని కాంగ్రెస్ కు విడిచిపెడుతున్నట్లు తెలిపారు. బంగారం మాదిరిగానే బిట్ కాయిన్లను హోల్డ్ చేసేందుకు ఫెడ్ కి వీలు ఉంటుందా అని అడిగిన ప్రశ్నలకు పావెల్ బదులిస్తూ క్లారిటీ ఇవ్వటంతో క్రిప్టో ధరలు ప్రభావితం అవుతున్నాయి.
మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాలు..
- నేడు ఇంట్రాడేలో ఐటీ స్టాక్స్ విక్రయిస్తుండటంతో ఇండియా విక్స్ సూచీ 14.37 మార్కుకు పెరిగింది.
- డాలర్ ఇండెక్స్ 108 కంటే ఎక్కువగా పెరిగింది
- 10 సంవత్సరాల యూఎస్ బాండ్ ఈల్డ్స్ 4.52 శాతానికి పెరుగుదల
- భారతీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు డబ్బును విక్రయాలతో వెనక్కి తీసుకోవటం
- డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు బెదిరింపులు
- 2025లో ట్రంప్ సుంకాలు పెంచటంతో ద్రవ్యోల్బణం తిరిగి పెరగటం వల్ల వడ్డీ రేట్ల తగ్గింపు నెమ్మదించే అవకాశాలు
More From GoodReturns

Stock market: వర్షం పడితేనే స్టాక్ మార్కెట్లో లాభాల పంట! మాన్సూన్ ఎఫెక్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!



Click it and Unblock the Notifications