స్టాక్ మార్కెట్‌కు బిగ్ షాక్.. US-ఇరాన్ సంక్షోభంతో రెడ్ జోన్‌లోకి సూచీలు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక

స్టాక్ మార్కెట్ ఈ రోజు భారీ నష్టాలతో ప్రారంభమైంది. అమెరికా- ఇరాన్‌ల మధ్య అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరిగాయి. దీని ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడింది. దీంతో ఆరంభంలోనే బెంచ్‌మార్క్ సూచీలు అయిన సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ భారీ పతనాన్ని నమోదు చేశాయి.

ఉదయం 9:18 గంటల సమయానికి నిఫ్టీ 50 సూచీ 178 పాయింట్లు (0.73 శాతం) తగ్గి 24,029.75 వద్ద ట్రేడవుతుండగా.. బీఎస్ఈ సెన్సెక్స్ 637 పాయింట్లు (0.82 శాతం) నష్టపోయి 76,931.95కు పడిపోయింది. ఈ పతనం కేవలం లార్జ్‌క్యాప్ కంపెనీలకే పరిమితం కాకుండా.. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.58 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 0.56 శాతం చొప్పున నష్టపోవడంతో మార్కెట్లో భారీ అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది.

ప్రారంభ ట్రేడింగ్‌ సమయంలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో), టాటా స్టీల్, మారుతీ సుజుకి ఇండియా షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. వీటితో పాటు ఏషియన్ పెంయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్ వంటి కీలక స్టాక్‌లలో అమ్మకాలు జరగడం మార్కెట్‌ను మరింత కిందకు లాగాయి. అయితే మార్కెట్ ఇంత బలహీనంగా ఉన్నప్పటికీ, టీసీఎస్, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, పవర్ గ్రిడ్ వంటి ఎంపిక చేసిన ఐటీ, విద్యుత్ రంగ షేర్లు లాభాలతో ట్రేడవ్వడం పెట్టుబడిదారులకు కొంత ఊరటనిచ్చిందని చెప్పవచ్చు.

Stock Market Today Sensex Today Nifty Today US Iran Tensions Indian Stock Market Share Market BSE Sensex NSE Nifty Geopolitical Tensions Crude Oil Prices Global Markets Investors Business News Market Opening

యాక్సిస్ డైరెక్ట్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పాల్వియా విశ్లేషణ ప్రకారం.. అంతకుముందు ముగిసిన శుక్రవారం సెషన్‌లో ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో నిఫ్టీ 244 పాయింట్లు (1.02 శాతం) లాభపడి 24,206.90 వద్ద ముగిసింది. ఆ రోజు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) 2,604 కోట్ల రూపాయలు, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIలు) 2,020 కోట్ల రూపాయల నికర కొనుగోళ్లు జరిపారు. అలాగే ఇండియా విక్స్ 12.25కు తగ్గడం మార్కెట్లో అస్థిరత తగ్గుతోందనడానికి సంకేతంగా నిలిచింది.

Also Read

శుక్రవారం యూఎస్ మార్కెట్లలో ఎన్విడియా, మెటా వంటి టెక్ కంపెనీలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉత్సాహంతో కొనుగోళ్లు జరిగి లాభాలతో ముగిసినప్పటికీ.. సోమవారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. జపాన్ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొనగా.. హాంగ్ కాంగ్ స్వల్ప లాభాల్లో ఉంది. మరోవైపు హార్ముజ్ జలసంధి సరఫరా ఆందోళనల వల్ల బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు 79 డాలర్ల వద్ద నిలిచిపోవడం భారత మార్కెట్‌కు పెద్ద సవాలుగా మారింది.

సాంకేతికంగా చూస్తే నిఫ్టీకి స్వల్పకాలిక ట్రెండ్ ఇంకా సానుకూలంగానే ఉందని రాజేష్ పాల్వియా అభిప్రాయపడ్డారు. నిఫ్టీ గనుక 24,100 స్థాయికి పైన నిలదొక్కుకోగలిగితే, అది 24,350 నుండి 24,550 వైపుగా పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి 24,000 స్థాయి కీలకమైన తక్షణ మద్దతుగా (Support) ఉంది. ఒకవేళ నిఫ్టీ ఈ స్థాయి కంటే దిగువకు పడిపోతే.. మార్కెట్లో లాభాల స్వీకరణ (Profit Booking) మరింత పెరిగి సూచీ 23,800 స్థాయికి పతనం కావచ్చని ఆయన హెచ్చరించారు. రాబోయే రోజుల్లో పెట్టుబడిదారులు ప్రపంచ భౌగోళిక రాజకీయ రిస్క్‌లు, ముడి చమురు ధరలను నిశితంగా గమనించాల్సి ఉంటుందన్నారు.

ద్వితీయ శ్రేణి (ప్రైమరీ) మార్కెట్ విషయానికి వస్తే.. ఐపీఓ (IPO) విభాగంలో ఈరోజు కీలక కార్యకలాపాలు జరగనున్నాయి. లేజర్ పవర్ & ఇన్‌ఫ్రా కంపెనీకి చెందిన 742 కోట్ల రూపాయల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) సబ్‌స్క్రిప్షన్ నేటితో ముగియనుంది. దీనితో పాటుగా 42.32 కోట్ల రూపాయల విలువైన డెవ్‌సన్ క్యాటలిస్ట్ ఐపీఓ, 25 కోట్ల రూపాయల బుక్-బిల్ట్ ఇష్యూ విలువ కలిగిన హ్యాపీ స్టీల్స్ ఐపీఓలకు దరఖాస్తు చేసుకోవడానికి పెట్టుబడిదారులకు ఈరోజే చివరి అవకాశం కావడంతో మార్కెట్ వర్గాల దృష్టి వీటిపై కూడా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+