ఒకే ఒక్క ప్రకటన.. భారీ నష్టాలతో భోరుమన్న ఇన్వెస్టర్లు.. స్టాక్ మార్కెట్‌ను కుప్పకూల్చిన 5 కారణాలివే..

Indian Stock Market Crash: వరుసగా ఎనిమిది వారాల పాటు తీవ్ర నష్టాలను చవిచూసిన దేశీయ ఈక్విటీ మార్కెట్లలో అక్టోబర్ 5, సోమవారం నాటి ట్రేడింగ్‌లో భారీ రికవరీ కనిపించింది. ఉదయం సెషన్ ప్రారంభంలోనే ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా ఎగబాకి 72,600 మార్కును అధిగమించింది.

అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 150 పాయింట్లు పెరిగి 22,600 స్థాయిని దాటింది. అయితే మార్కెట్లో నెలకొన్న ఈ ఉత్సాహం ఎక్కువ సేపు నిలవలేదు. భారత్-అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలతో సూచీలు తమ ప్రారంభ లాభాలన్నింటినీ కోల్పోయి తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.

Stock Market Crash Share Market Crash Sensex Nifty Sensex Falls 700 Points Sensex Crash Stock Market Fall Indian Stock Market Market Crash Stock Market Today Why Sensex Is Falling Why Stock Market Is Falling 5 Reasons Market Sell-Off Sensex Today Nifty Today Stock Market Live Indian Equities Investor Sentiment Market News 700

న్యూఢిల్లీలో జరిగిన మ్యూనిచ్ నాయకుల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం కోసం కఠినమైన, తీవ్రమైన చర్చలు జరిగాయని, చర్చలు ఒక నిర్ణాయక దశకు చేరుకున్నాయని ఆమె తెలిపారు.

అయితే ఈ ప్రక్రియలో ఇరుపక్షాలు మరిన్ని అదనపు రాయితీలు ఇవ్వడం లేదా తీసుకోవడం చాలా కష్టమైన విషయమని స్పష్టం చేశారు. భారత్ నుండి అమెరికాకు జరిగే ఎగుమతులు ఎక్కువగా ఉన్నందున, వాణిజ్య సమతుల్యత భారత్‌కు అనుకూలంగా ఉందని, ఈ అంతరాన్ని తగ్గించాలని అమెరికా కోరుకుంటోందని వివరించారు. టారిఫ్‌లు గతంలో ఒప్పందాలకు మార్గంగా ఉండేవి కానీ, ప్రస్తుతం వాటిని ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

ఆర్థిక మంత్రి చేసిన ఈ ప్రకటన వెలువడిన వెంటనే సెన్సెక్స్ తన రోజువారీ గరిష్ట స్థాయి నుండి దాదాపు 500 పాయింట్లు పడిపోగా.. నిఫ్టీ 22,550 మార్కు దిగువకు చేరింది. ఉదయం ప్రారంభమైన ర్యాలీ ఒక్కసారిగా మందగించడానికి, సూచీలు పతనమవ్వడానికి ప్రధానంగా 5 కారణాలు కనిపిస్తున్నాయి:

1. వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి: ఆర్థిక మంత్రి ప్రకటనతో భారత్-అమెరికా మధ్య మరిన్ని రాయితీల మార్పిడి సాధ్యం కాదనే సంకేతాలు వెళ్లడం వల్ల మార్కెట్ వర్గాల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
2. త్వరిత ఒప్పందంపై నిరాశ: అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ కూడా చర్చలు సానుకూలంగా సాగుతున్నప్పటికీ, తక్షణమే ఒప్పందం కుదిరే అవకాశం లేదని స్పష్టం చేయడంతో ఇన్వెస్టర్లలో ఆశలు ఆవిరయ్యాయి.
3.విదేశీ ఇన్వెస్టర్ల (FII) నిరంతర అమ్మకాలు: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుండి భారీగా నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. ఇటీవల ఒక్కరోజే ఎఫ్‌ఐఐలు ₹9,484.22 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చింది.
4. మండే ముడి చమురు ధరలు: అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు ఏకంగా $102 వద్ద ట్రేడవుతుండటం వల్ల భారత దిగుమతి వ్యయం పెరిగి, ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ మొదలయ్యాయి.
5. అధిక స్థాయిలోనే యూఎస్ బాండ్ ఈల్డ్స్: అమెరికా ప్రభుత్వ బాండ్ దిగుబడులు అధికంగా ఉండటంతో, విదేశీ పెట్టుబడులు ఈక్విటీల నుంచి సురక్షితమైన బాండ్ వైపు మళ్లుతున్నాయి.

మొత్తంగా చూసినట్లయితే ఉదయం సెంటిమెంట్ అనుకూలంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ వాణిజ్య పరిణామాలు, ఆర్థిక సవాళ్లు స్టాక్ మార్కెట్‌ను మళ్లీ భారీ నష్టాల్లోకి నెట్టివేశాయి. మరి ముందు ముందు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందో చూడాలి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+