Mutual Fund Investments: భారతీయ స్టాక్ మార్కెట్లలో కొన్ని నెలులుగా రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ విపరీతంగా పెరుగుతోంది. కొందరు నేరుగా ఈక్విటీలు, డెరివేటివ్స్ ట్రేడింగ్ నేరుగా చేపడుతుండగా.. మరికొందరు మాత్రం రిస్క్ తక్కువగా ఉండే మార్గమైన మ్యూచువల్ ఫండ్లను ఎంచుకుంటున్నారు. కానీ ఇప్పుడు మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనిని చాలా మంది తెలివిగా లాభపడటానికి వినియోగించుకుంటున్నట్లు బయటపడింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల గురించే. వాస్తవానికి గడచిన కొన్ని త్రైమాసికాలుగా దేశీయంగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ భారీగా వృద్ధి చెందింది. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్లు చిన్న మెుత్తాల్లో డబ్బును సిప్ రూపంలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్ల నష్టాల్లోకి జారుకుంటున్న వేళ చాలా మంది తక్కువ ధరల వద్ద ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారు. బై ఎట్ డిప్స్ అనే స్ట్రాటజీని అమలు చేయటంతో అక్టోబరులో తొలిసారిగా SIP పెట్టుబడుల విలువ ఏకంగా రూ.25,000 కోట్లను క్రాస్ చేసింది. భారతీయ ఇన్వెస్టర్లు ఒకప్పటి మాదిరిగా కాకుండా మార్కెట్లను అర్థం చేసుకోవటం వాటి పనితీరు గురించి ఎడ్యుకేట్ కావటమే దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్తగా సిప్ స్టార్ట్ చేస్తున్న వారి సంఖ్య మాత్రం నెమ్మదించిందని గణాంకాలు చెబుతున్నాయి.

వాస్తవానికి గడచిన నెలలో విదేశీ సంస్థాగత మదుపరులు భారతీయ మార్కెట్ల నుంచి రూ.లక్ష కోట్ల కంటే ఎక్కువగా డబ్బును ఉపసంహరించుకోవటంతో బుల్ జోరుకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇన్వెస్టర్లు తమ డబ్బును మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లోకి పంప్ చేయటంతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రికార్డు స్థాయిలో రూ.41,887 కోట్ల ఇన్ ఫ్లో చూశాయి. దీంతో గత నెలలో దేశీయ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కింద ఉన్న అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఏకంగా రూ.67.25 లక్షల కోట్లకు చేరుకుంది. వరుసగా 44వ నెలలో ఈక్విటీ ఫండ్లలో డబ్బులు రాక పెరుగుదలను చూసింది. అక్టోబర్ నెలలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు అసాధారణ స్థాయిలకు చేరుకున్నాయని నిపుణులు చెబుతున్నారు.
దీంతో నెలవారి సిప్ పెట్టుబడులు అక్టోబరు నెలలో రూ.25,323 కోట్లకు చేరుకుంది. దీనికి ముందు నెలలో సిప్ పెట్టుబడులు రూ.24,509 కోట్లుగా ఉన్నాయి. అమెరికా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు నుంచి భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ ఓలటాలిటీని చూస్తున్నాయి. ఈక్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్, నిఫ్టీలు 5-6 శాతం పదునైన పతనాన్ని చూస్తున్నాయని జెర్మినేట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సంతోష్ జోసెఫ్ తెలిపారు. అయితే భారీగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్లను స్థిరీకరించటానికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సైతం చిన్న పెట్టుబడిదారులకు ఇందులో అవకాశం కల్పించేందుకు వీలుగా సిప్ పరిమితిని రూ.100కి తగ్గించాయి. గతంలో కనీస పెట్టుబడి సిప్ కింద కొన్ని ఫండ్లలో రూ.500 ఉండగా చాలా వాటిలో కనీస మెుత్తం రూ.1000 వద్ద ఉండేదని మనందరికీ తెలిసిందే. ఇది కూడా రిటైలర్ల పార్టిసిపేషన్ పెంచటానికి దోహదపడుతోంది.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications