ట్రంప్ భారత్ మీద విధించిన 25 శాతం సుంకాలు ఆంక్షలతో భారత్ రొయ్యల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. భారతీయ రొయ్యల ఎగుమతిదారులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతోంది. జూలై 31 గురువారం జరిగిన మార్కెట్ ట్రేడింగ్‌లో ఆక్వా షేర్లు కుప్పకూలాయి. దేశీయ ఆక్వా ఆహార దిగ్గజాలైన అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్, అవంతి ఫీడ్స్, కోస్టల్ కార్పొరేషన్, వాటర్‌బేస్ లిమిటెడ్ కంపెనీలు షేర్లు గంటల వ్యవధిలోనే ఆరు శాతానికి పైగా కుప్పకూలాయి.
ఉదయం 10.37కి కోస్టల్ కార్పొరేషన్ షేరు రూ.35.75కి తగ్గాయి. ఇక అవంతి ఫీడ్స్ షేరు రూ.667.6 వద్ద ట్రేడయ్యింది. అపెక్స్ ఫ్రోజెన్ షేరు రూ.238.5కి పడిపోయింది. ఇది సాధారణ పెట్టుబడిదారులకే కాకుండా, ఎగుమతిదారులకు కూడా భారీ నష్టాలను అందించింది. అవంతి ఫీడ్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో తన ఆదాయంలో అధిక శాతం అమెరికా నుంచే అందుకుంది. ఉత్తర అమెరికా మార్కెట్ నుంచే దాదాపు 75 శాతం లాభాలను ఆర్జించింది. ఇక అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ కూడా అమెరికా మార్కెట్ నుండే 53 శాతం మేర ఆదాయాన్ని ఆర్జించింది.

తాజాగా ట్రంప్ తీసుకున్న టారిఫ్ పెరుగుదల ఈ ఆక్వా కంపెనీల ఆదాయంపై నేరుగా ప్రభావం చూపనుందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఇప్పటికే భారతదేశ రొయ్యల ఎగుమతిపై 17.7 శాతం కలిపిన సుంకాలు (5.7% కౌంటర్‌వెయిలింగ్ డ్యూటీ + 1.8% యాంటీ డంపింగ్ డ్యూటీ) విధిస్తోంది. ఇప్పుడు ఈ మొత్తం 25 శాతం కు పెరగనుంది. ఈ పెంపుతో భారత రొయ్యల ధర అమెరికాలో పోటీతనం కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచ రొయ్యల మార్కెట్‌లో భారతదేశం వాటా దాదాపు 20 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి 1.2 మిలియన్ మెట్రిక్ టన్నుల వద్ద స్థిరంగా ఉంటుందని భావిస్తున్నారు. భారత్ నుండి ఏటా ఎగుమతయ్యే 5.6 డాలర్ల బిలియన్ల విలువైన రొయ్యలలో 2.4 బిలియన్ డాలర్లు విలువైన మార్కెట్ అమెరికాలోనే జరుగుతుంది. అమెరికాకు వెళుతున్న భారతీయ రొయ్యలలో ఎక్కువభాగం లాటిన్ అమెరికా దేశాల్లో ప్రాసెసింగ్ జరగడం గమనార్హంగా చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం భారతదేశంలో లక్షకు పైగా రొయ్యల గుంటల సాగులో ఉండగా..వాటిలో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. 2022-23లో భారత్ రూ.63,969 కోట్లు విలువైన 17.35 లక్షల టన్నుల సముద్ర ఆహారాన్ని ఎగుమతి చేసింది. వాటిలో ప్రధాన భాగం రొయ్యలే ఉన్నాయి. అమెరికా-చైనా రెండు ప్రధాన మార్కెట్లుగా మారడంతో ఇటువంటి సుంక పెంపులు పరిశ్రమ భవిష్యత్తును ఈ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం త్వరగా అమెరికాతో చర్చలు జరిపి పరిష్కార మార్గాలు వెతకాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. లేకుంటే లక్షలాది మంది రైతులు, కార్మికులు తీవ్ర ప్రభావం బారీన పడే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications