IT News: గెలిచిన ట్రంప్.. భారతీయ ఐటీ పరిశ్రమ- ఆన్‍సైట్ టెక్కీల పరిస్థితి ఇదే..!! ఐటీ స్టాక్స్..
Indian IT News: అమెరికా ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ ప్రభంజనం కొనసాగుతున్న వేళ.. భారతీయ ఐటీ పరిశ్రమ భవిష్యత్తు ఎలా ఉండనుందనే ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. దీనికి తోడు టెక్ జాబ్ కొట్టాలి అమెరికాలో గ్రీన్ కార్డ్ పట్టాలి అని ఆశల్లో ఉన్న భారతీయ ఐటీ నిపుణుల పరిస్థితిపై కూడా అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి.
ట్రంప్ గెలుపు దాదాపుగా ఫిక్స్ అయిన వేళ భారతీయ స్టాక్ మార్కెట్లలోని లిస్టెడ్ ఐటీ కంపెనీల షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. ఇంట్రాడేలో ప్రధానంగా ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ షేర్లలో ర్యాలీ నమోదైంది. ఈ క్రమంలో టెక్ మహీంద్రా, పెర్సిస్టెంట్, ఎల్ అండ్ టీ మైండ్‌ట్రీ, హెచ్‌సిఎల్, కొఫోర్జీ, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ సహా మరిన్ని టెక్ కంపెనీల షేర్లు ఏకంగా 2-4 శాతం మధ్య వృద్ధితో కొనసాగుతున్నాయి. ట్రంప్ రాకతో అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవటం వల్ల చాలా కాలంగా మందగించిన ఐటీ పరిశ్రమ వ్యాపారం వేగంగా పెరుగుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. తాజాగా ట్రంప్ ఫలితాలపై మాట్లాడుతూ అమెరికాలో తిరిగి స్వర్ణయుగం తన పరిపాలనలో వస్తుందని చెప్పారు. మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ అంటూ నినదించారు.

అయితే ట్రంప్ ఎన్నికతో భారతీయ ఐటీ సంస్థలు భారీ ప్రభావాన్ని చూడనున్నాయని విశ్లేషకులు ఇప్పటికే వెల్లడించారు. H-1B వీసా పాలసీల నుండి అవుట్‌సోర్సింగ్ నిబంధనల వరకు భారతీయ టెక్ దిగ్గజాలను ప్రభావితం చేసే అనేక నిర్ణయాలను రానున్న రోజుల్లో కనిపించనున్నాయి. ప్రతిభావంతులైన వర్కర్లు, భారతీయ ఐటీ సంస్థలపై ఊహించిన స్థాయిలో ప్రభావం కనిపించకపోవచ్చని కొందరు భావిస్తున్నారు. వాస్తవానికి ట్రంప్ అమెరికన్లకు స్థానిక ఉద్యోగాలను అందిస్తారని చాలా మంది భావిస్తున్నారు.
ఇప్పుడు అందరి చూపు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఐటీ వంటి రంగాల్లో పనిచేయటానికి వచ్చే విదేశీ వ్యక్తులకు అందించే H-1B వీసాలపైనే ఉంది. ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ సంస్థలు తమ అమెరికన్ క్లయింట్ల కోసం కొందరు ఉద్యోగులను ఆన్ సైట్ పాత్రల కోసం పంపించేందుకు ఈ రకం వీసాలపైనే ఎక్కువగా ఆధారపడుతుంటాయని మనందరికీ తెలిసిందేగా. అయితే దీనిపై ఇటీవలి కాలంలో అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం గురించి ఆందోళనలను రేకెత్తించాయి.
నిపుణులు దీనిపై ఏమంటున్నారనే విషయాన్ని పరిశీలిస్తే.. ట్రంప్ గెలిచిన తర్వాత కూడా హెచ్1 బీ వీసాల విషయంలో పెద్దగా ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని భావిస్తున్నట్లు యూఎస్ ఆధారిత కొట్చెన్ & లో ఎల్ఎల్‌పీ వెల్లడించింది. స్కిల్డ్ వర్కర్ల సమస్యతో ఇప్పటికే కంపెనీలు తక్కువ సంఖ్యలో ఉన్నట్లు బోరున ఏడుస్తున్నందున ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు ఉంటాయని భావిస్తున్నట్లు యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ ఫార్టనర్స్ ఫోరమ్ వెల్లడించింది. అయితే ఈ విషయంలో కొన్ని మార్పులు ఉండొచ్చని ఇతరులు అంచనావేస్తున్నారు.


Click it and Unblock the Notifications