భారతదేశ ఆర్థిక రంగంలో అత్యంత ఆసక్తికరమైన పరిణామంగా నిలవనున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) ఐపీఓ (IPO) ప్రక్రియ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. దాదాపు రూ. 20 వేల కోట్లకు పైగా నిధుల సమీకరణే లక్ష్యంగా రాబోతున్న ఈ పబ్లిక్ ఇష్యూ.. దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా రికార్డు సృష్టించబోతోంది. తాజా సమాచారం ప్రకారం, ఎన్‌ఎస్‌ఈ తన ముసాయిదా పత్రాలను (DRHP) జూన్ నెలలో సెబీకి సమర్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ ఐపీఓ సాధారణ కంపెనీల ఐపీఓల మాదిరిగా ఉండదు. దీనికి సంబంధించిన నిబంధనలు, అర్హతలు, నిర్మాణంలో అనేక వైవిధ్యాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఈ ఐపీఓ పూర్తిగా 'ఆఫర్-ఫర్-సేల్' (OFS) పద్ధతిలో జరగనుంది. అంటే, ప్రస్తుతమున్న వాటాదారులు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయిస్తారు తప్ప.. కంపెనీ కొత్తగా షేర్లను జారీ చేసి నిధులను సేకరించదు. ఈ విక్రయం ద్వారా వచ్చే డబ్బు నేరుగా షేర్లు అమ్మిన వాటాదారులకే చెందుతుంది. ఈ ప్రక్రియలో పాల్గొనాలనుకునే ప్రస్తుత వాటాదారులకు కొన్ని కఠినమైన నిబంధనలు విధించారు. జూన్ 15, 2025 నుండి నిరంతరాయంగా ఎన్‌ఎస్‌ఈ షేర్లను కలిగి ఉన్నవారు మాత్రమే ఇందులో పాల్గొనడానికి అర్హులు. అంటే ఐపీఓలో లాభం పొందాలనే ఉద్దేశంతో ఇటీవలే అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో షేర్లు కొనుగోలు చేసిన వారికి ఈ అవకాశం ఉండదు. పైగా ఆ షేర్లపై ఎలాంటి తాకట్టులు లేదా లీన్‌లు ఉండకూడదు.

ఈ ఆఫర్-ఫర్-సేల్ ప్రక్రియలో పాల్గొనాలనుకునే అర్హులైన పెట్టుబడిదారులు తమ ఆసక్తిని తెలియజేస్తూ (EOI) ఏప్రిల్ 27, 2026 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ గడువు దాటితే పాల్గొనే అవకాశం ఉండదు.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఓఎఫ్‌ఎస్‌లో పాల్గొని తమ షేర్లను అమ్ముకునే వాటాదారులు, అదే ఐపీఓలో తిరిగి కొత్త షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఉండదు. ఎన్‌ఎస్‌ఈ తన మొత్తం ఈక్విటీలో సుమారు 4 శాతం నుండి 4.5 శాతం వరకు వాటాను ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా విక్రయించాలని భావిస్తోంది. ఈ భారీ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఎన్‌ఎస్‌ఈ ఏకంగా 20 మంది మర్చంట్ బ్యాంకర్లను నియమించింది. ఇది ఒక భారతీయ ఐపీఓ చరిత్రలో రికార్డుగా చెప్పవచ్చు.
పెట్టుబడిదారులు గమనించాల్సిన మరో ప్రధానాంశం 'లాక్-ఇన్ పీరియడ్'. ఐపీఓ ధర బుక్-బిల్డింగ్ ప్రక్రియ ద్వారా ఖరారవుతుంది, కాబట్టి విక్రయించే సమయంలో వాటాదారులకు ఖచ్చితమైన ధర తెలియదు. ఒకవేళ ఐపీఓ ఆశించిన స్థాయిలో సబ్‌స్క్రైబ్ కాకపోతే, అమ్ముడుపోని షేర్లు లిస్టింగ్ అయిన తర్వాత ఆరు నెలల పాటు లాక్-ఇన్‌లో ఉంటాయి. అంటే ఆ సమయంలో వాటిని విక్రయించడానికి వీలుండదు.
అలాగే, ఓఎఫ్‌ఎస్‌లో విక్రయించగా మిగిలిన షేర్లు కూడా కేటాయింపు జరిగిన నాటి నుండి ఆరు నెలల వరకు లాక్-ఇన్ నిబంధనలకు లోబడి ఉంటాయి. దీనివల్ల ప్రస్తుత వాటాదారులకు స్వల్పకాలికంగా నగదు లభ్యత (Liquidity) తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ దేశంలోని అతిపెద్ద ఎక్స్ఛేంజ్ మార్కెట్లోకి వస్తుండటంతో ఇన్వెస్టర్లలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఐపీఓ భారత స్టాక్ మార్కెట్ గమనాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్‌లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications
