PC Jeweller: దూసుకెళ్తున్న పీసీ జ్యువెలర్ షేర్లు.. ఏకంగా 9 శాతం పెరిగిన స్టాక్..!

సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో పీసీ జ్యువెలర్ షేరు ధర 9.46 శాతానికి పైగా పెరిగి ఎన్‌ఎస్‌ఈలో ఒక్కో షేరుకు రూ.17.84 ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. శుక్రవారం నాటి ముగింపు ధర రూ.16.28తో పోలిస్తే, ఈరోజు పీసీ జ్యువెలర్ షేరు ఒక్కో షేరుకు రూ.16.91 వద్ద ప్రారంభమైంది. ఇదిలా ఉండగా ప్రధాన ప్రైవేట్ రంగ బ్యాంకులైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్‌ల త్రైమాసిక ఫలితాలను పెట్టుబడిదారులు సమీక్షిస్తుండటంతో, సోమవారం భారత ఈక్విటీ సూచీలు దాదాపు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. మరోవైపు పెరిగిన ముడి చమురు ధరలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సోమవారం పీసీ జ్యువెలర్ షేరు ట్రేడింగ్ వాల్యూమ్‌లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఎన్‌ఎస్‌ఈలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అక్టోబర్ 19న ఇంట్రాడే సెషన్‌లో దాదాపు 5,336.92 షేర్లు చేతులు మారాయి.

తాము రుణరహిత స్థితిని సాధించినట్లు ప్రకటించిన కొద్ది రోజులకే పీసీ జ్యువెలర్ గణనీయమైన పెట్టుబడిదారుల ఆసక్తిని ఆకర్షిస్తోంది. ఇటీవల జరిగిన ఒక బల్క్ డీల్‌లో, క్యూపిడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య కుమార్ హల్వాసియా, ఈ జ్యువెలరీ కంపెనీకి చెందిన 5.10 కోట్ల షేర్లను దాదాపు రూ.73.59 కోట్లకు కొనుగోలు చేశారు. ఎన్‌ఎస్‌ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ బల్క్ డీల్ ద్వారా హల్వాసియా ఒక్కో షేరును సగటున రూ.14.43 ధరకు కొనుగోలు చేశారు. క్యూపిడ్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఆదిత్య హల్వాసియా మూడో తరం పారిశ్రామికవేత్త. ఆయన శాతం పరంగా భారతదేశంలో అత్యంత వేగవంతమైన సంపద సృష్టికర్తగా ఎదిగారు.

PC Jeweller

గత నెలలో పీసీ జ్యువెలర్ తన 14 కన్సార్టియం బ్యాంకులన్నింటికీ బకాయి ఉన్న మొత్తాన్ని తిరిగి చెల్లించినట్లు ప్రకటించింది. ఇది తన రుణ తగ్గింపు ప్రయత్నాలలో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. ఢిల్లీకి చెందిన ఈ ఆభరణాల తయారీ సంస్థ, సెప్టెంబర్ 2024లో తన బకాయిలు సుమారు రూ.3,000 కోట్లుగా ఉండేవి. ఆ తర్వాత అప్పులు చెల్లిస్తూ వచ్చింది. PC జ్యువెలర్ షేరు ధర స్వల్పకాలంలో భారీగా పెరిగింది. గత వారంలో 20.47 శాతం లాభపడింది. ఈ స్టాక్ గత నెలలో తన పెరుగుదల వేగాన్ని కొనసాగించి.. 42.06% రాబడిని అందించింది. ఇది ఈ కాలంలో గణనీయమైన కొనుగోలు ఆసక్తిని సూచిస్తుంది.

ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే పీసీ జ్యువెలర్ షేర్లు 94.30% పెరిగాయి. కాగా గత ఒక సంవత్సరంలో ఈ స్టాక్ 49.71% లాభపడింది. కంపెనీ రుణరహిత హోదాను సాధించడంతో స్టాక్ లో పాజిటివిటి కనిపిస్తోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+