Muhurat Trading 2026: ముహూరత్ ట్రేడింగ్ లాభాల్లో స్టార్ట్ అవుతుందా.. ఈ స్టాక్స్ కొనుగోలు చేయాలా..!

మార్కెట్‌లో విస్తృతమైన ర్యాలీని చూసిన తర్వాత భారత స్టాక్ మార్కెట్ ఆదివారం నవంబర్ 8, 2026న జరగనున్న ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్సెషన్ కోసం సిద్ధమైంది. 70 నిమిషాల నిడివి గల ఈ ప్రత్యేక సెషన్ నేడు మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 3:30 గంటలకు ముగుస్తుంది. గడిచిన దశాబ్ద కాలంలో, భారతీయ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 వరుసగా ఎనిమిది సార్లు లాభాలతో ముగిశాయని గమనించాలి. కేవలం 2016, 2017 సంవత్సరాల్లో మాత్రమే ఇవి నష్టాలతో ముగిశాయి. హెచ్ డీఎఫ్సీ స్కై వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2006 నుంచి 2025 వరకు, నిఫ్టీ 50 సూచీ కేవలం ఐదు సందర్భాల్లో అంటే 2007, 2009, 2012, 2016, 2017 సంవత్సరాల్లోమునుపటి ముగింపు కంటే తక్కువ స్థాయిలో ముగిసింది.

2018 నుంచి ఈ 50-స్టాక్ సూచీ నిరంతరం లాభాలతోనే ముగుస్తూ వస్తోంది. ఇక 30-స్టాక్ సూచీ అయిన సెన్సెక్స్, 2007, 2012, 2016, 2017 సంవత్సరాల్లో మాత్రమే నష్టాలతో ముగిసింది. అంటే, గత పదేళ్లలో సెన్సెక్స్, నిఫ్టీ 50 రెండూ వరుసగా ఎనిమిది సార్లు లాభాలతో ముగిశాయి. గత 10 ఏళ్లలో జరిగిన ముహూరత్ ట్రేడింగ్ సెషన్లలో ఈ ప్రధాన సూచీలు 8 సార్లు లాభాలను నమోదు చేశాయి. దీని అర్థం, గత దశాబ్ద కాలంలో సెన్సెక్స్, నిఫ్టీ రెండింటికీ 80% సక్సెస్ రేటు (స్ట్రైక్ రేట్) ఉంది. మార్కెట్ విశ్లేషకులు ఇది 90%కి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Muhurat Trading

నేటి ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ సెషన్‌లో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభాలతో ముగిసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులు మార్కెట్ 'గ్యాప్-అప్' (పెద్ద లాభంతో ప్రారంభం)తో మొదలయ్యే సంకేతాలను చూపుతున్నాయని ఓ నిపుణుడు పేర్కొన్నారు. కేసీ సెక్యూరిటీస్ నిపుణుడు ఈ 50-స్టాక్ సూచీకి 24,800 వద్ద తక్షణ మద్దతు ఉండగా 25,200 వద్ద నిరోధం కనిపిస్తోందని అన్నారు. ఆదివారం నాడు దలాల్ స్ట్రీట్‌లో జరిగే ఉత్సవ సెషన్‌లో సంవత్ 2083 ప్రారంభం కానున్న నేపథ్యంలో కేసీ సెక్యూరిటీస్ పరిశోధన నివేదిక 12 స్టాక్స్ కొనుగోలు చేయాలని సిఫార్సు చేసింది:.

ఇందులో అదానీ పోర్ట్స్ టార్గెట్ రూ.2200, లార్సెన్ & టూబ్రో టార్గెట్ ప్రైస్ రూ. 4850, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రూ.980, ఐసిఐసిఐ బ్యాంక్ టార్గెట్ ప్రైస్ రూ.1680, సంసేరా ఇంజనీరింగ్ టార్గెట్ రూ.5600,
జియో ప్లాట్‌ఫామ్స్ టార్గెట్ ప్రైస్ 1800, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ టార్గెట్ ప్రైస్ రూ. 3600, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ టార్గెట్ ప్రైస్ రూ. 650, డిసిబి బ్యాంక్ టార్గెట్ ప్రైస్ రూ.266, యునైటెడ్ స్పిరిట్స్ టార్గెట్ ప్రైస్ రూ.1650, మోల్బియో డయాగ్నోస్టిక్ టార్గెట్ ప్రైస్ రూ.1650, ఐసిఐసిఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ టార్గెట్ ప్రైస్ రూ.1900 గా నిర్ణయించింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+