IFCI: భారీగా పెరిగిన ఐఎఫ్సీఐ షేర్లు.. మూడు సెషన్లలో 13.7 శాతం పెరిగిన స్టాక్..!
కొద్ది రోజులుగా ఐఎఫ్సీఐ షేర్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ స్టాక్ కేవలం మూడు వరుస సెషన్లలోనే దాదాపు 14 శాతం పెరిగింది. సోమవారం అక్టోబర్ 12న బీఎస్ఈలో ఉదయం ట్రేడింగ్‌లో ఐఎఫ్సీఐ షేర్లు 8 శాతం పెరిగి రూ.72.78 వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకాయి. ఈ ధరతో స్టాక్ కేవలం మూడు వరుస సెషన్లలో 13.7% పెరిగింది. ఈక్విటీ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 15 శాతం పడిపోయినప్పటికీ ఈ స్టాక్ ఏడాది ప్రారంభం నుంతి ఇప్పటివరకు దాదాపు 35 శాతం పెరిగింది. గత ఏడాది డిసెంబర్ 9న రూ.46.20 వద్ద ఉన్న 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయిన తర్వాత, ఈ ఏడాది సెప్టెంబర్ 4న రూ.107.45 వద్ద 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది.
నెలవారీ ప్రాతిపదికన చూస్తే గత నెలలో 23 శాతానికి పైగా పడిపోయిన తర్వాత, అక్టోబర్‌లో ఇప్పటివరకు ఈ స్టాక్ దాదాపు 4 శాతం పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో (FY26) కంపెనీ కార్యకలాపాల నుంచి మొత్తం ఆదాయం ఏడాది ప్రాతిపదికన (YoY) 7% పెరిగి రూ.897.71 కోట్లకు చేరుకోగా, వార్షిక లాభం 18 శాతం పెరిగి రూ.51.71 కోట్లకు చేరింది. స్టాక్ ధర రూ.74 నుంచి రూ.80 మధ్య కొత్త 'రెసిస్టెన్స్ జోన్' (అడ్డంకి స్థాయి)ను ఏర్పరచిందని నిపుణులు చెబుతున్నారు. స్టాక్ ధరలు రెసిస్టెన్స్ జోన్ వైపు ఏమాత్రం పెరిగినా, అది బయటకు రావడానికి (ఎగ్జిట్ అవ్వడానికి) ఒక అవకాశంగా వివరిస్తున్నారు.

స్టాక్ ధరలు కొన్ని రోజుల పాటు 80 పైన కొనసాగితేనే ధోరణి మారవచ్చని అంచనా వేస్తున్నారు. రోజువారీ, వారపు చార్టులలో సాంకేతిక బలాన్ని మెరుగుపరుచుకుంటున్న సంకేతాలను చూపిస్తోందని ఛాయిస్ బ్రోకింగ్‌లో టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ అయిన హితేష్ టైలర్ పేర్కొన్నారు. రూ.68-రూ.69.50 సపోర్ట్ జోన్ వద్ద ఉన్న దాని 200-రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ (EMA) పైన నిలకడగా ఉందని వివరించారు. రూ.68.50 పైన నిలదొక్కుకోవడం సానుకూల సాంకేతిక ధోరణిని కొనసాగించడంలో సహాయపడవచ్చని తెలిపారు. ఇలాంటి స్టాక్ లో పెట్టుబడి పెట్టే ముందు అన్ని చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications