Multibagger Stock: సంవత్సరంలో రూ.లక్షను రూ.36 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
స్టాక్ మార్కెట్ లో మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తున్న అనేక స్టాక్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి మృగేష్ ట్రేడింగ్ లిమిటెడ్. ఈ స్టాక్ షేర్లు 2026 నవంబర్ 9 నుంచి వరుసగా 14 సెషన్ల పాటు ఈ షేరుకు విక్రేతలు ఎవరూ లేకపోవడంతో, ఇది ప్రతిరోజూ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకుతోంది. BSEలో మృగేష్ ట్రేడింగ్ లిమిటెడ్ షేరు ధర రూ.5.73 నుంచి రూ.140.54కి పెరిగింది. తద్వారా ఈ ఏడాది ఇప్పటివరకు (YTD) వాటాదారులకు 2,350 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. గత ఆరు నెలల్లో ఈ మల్టీబ్యాగర్ షేరు 280 శాతానికి పైగా పెరిగింది. కేవలం గత నెల రోజుల్లోనే 95 శాతం వృద్ధితో పెట్టుబడిదారుల డబ్బును దాదాపు రెట్టింపు చేసింది.
గత శుక్రవారం మృగేష్ ట్రేడింగ్ లిమిటెడ్ అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ.140.54 వద్ద ముగిసింది. ఇది ఈ షేరుకు సంబంధించి ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరగా పేర్కొంటున్నారు. అంటే, ఈ మల్టీబ్యాగర్ షేరు నిరంతరం రికార్డు స్థాయిలను తాకుతోంది. అదే సమయంలో ట్రేడింగ్ సెషన్లలో దీనిని విక్రయించే వారు ఎవరూ కనిపించడం లేదు. ఈ కమోడిటీ ట్రేడింగ్ కంపెనీ షేరు ధరలో కనిపిస్తున్న ఈ పెరుగుదల, దాని ఆర్థిక పనితీరు మెరుగుపడటంతో సమాంతరంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 2026తో ముగిసిన త్రైమాసికంలో మృగేష్ ట్రేడింగ్ మొత్తం ఆదాయం రూ.2.19 కోట్లుగా నమోదైంది. ఇది అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ.98.3 లక్షలతో పోలిస్తే దాదాపు 123 శాతం పెరుగుదల నమోదు చేసింది.

అలాగే, గత ఏడాది ఇదే కాలంలో రూ.2.90 లక్షల నికర నష్టాన్ని నమోదు చేయగా, ఈసారి రూ.14.2 లక్షల నికర లాభాన్ని ఆర్జించింది. ఈ త్రైమాసికంలో లాభదాయకత మెరుగుపడింది. నిర్వహణ లాభ మార్జిన్ -2.95% నుంచి 14 శాతానికి చేరింది. నికర లాభ మార్జిన్ -2.95% నుంచి 8.28 శాతానికి చేరుకుంది. శుక్రవారం నాటికి ఈ మల్టీబ్యాగర్ షేరు మృగేష్ ట్రేడింగ్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,150 కోట్లుగా ఉంది. శుక్రవారం రోజున BSEలో ఈ షేరుకు సంబంధించి 2.03 లక్షలకు పైగా ట్రేడింగ్ వాల్యూమ్ నమోదైంది. మృగేష్ ట్రేడింగ్, వ్యవసాయ ఉత్పత్తులు, బల్క్ గూడ్స్ పై పని చేస్తోంది.
సరఫరాదారు, భాగస్వామ్య నెట్‌వర్క్‌ల ద్వారా సోర్సింగ్, పంపిణీ చేయడం, ఉత్పత్తిదారులను దేశీయ మార్కెట్లతో అనుసంధానించడం వంటివి దీని కార్యకలాపాలలో ఉన్నాయి. ఈ కంపెనీ ట్రేడింగ్, కమీషన్ ఆధారిత లావాదేవీల ద్వారా కూడా ఆదాయాన్ని ఆర్జిస్తుంది. డిసెంబర్ 1, 2025లో ఈ స్టాక్ రూ.3.86 వద్ద ఉండేది. అప్పుడు ఈ స్టాక్ లో రూ.లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ రూ.36 లక్షలకు పెరిగి ఉండేది. అంటే దాదాపు సంవత్సర కాలంలో రూ.35 లక్షల లాభం అందించింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications