IDFC First Bank: దేశీయంగా రెండవ త్రైమాసికంలో అనేక ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థల లాభాలు భారీగా క్షీణతను చూస్తున్నాయి. మార్కెట్ అంచనాలను అధిగమించటంలో ఈ కంపెనీల షేర్లు వెనుకపడ్డాయి. తాజాగా ఇండస్ఇండ్ బ్యాంక్ తర్వాత ఐడీఎఫ్‌సీ బ్యాంక్ కంపెనీ షేర్లు మార్కెట్లో క్రాష్ అవుతున్నాయి. సోమవారం ప్రైవేటు బ్యాంకింగ్ కంపెనీ షేర్లు ఫోకస్‌లో ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో వేగంగా వృద్ధిని సాధిస్తున్న ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ కంపెనీ షేర్ల గురించే. తాజాగా బ్యాంక్ తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ జూలై-సెప్టెంబర్ మధ్య రెండవ త్రైమాసికంలో లాభం ఏడాది ప్రాతిపదికన 73 శాతం క్షీణతను చూసింది. గత ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.751 కోట్ల నుంచి ప్రస్తుతం రూ.200 కోట్లకు పడిపోయింది. ఇదే క్రమంలో గత ఏడాది ఇదే సమయంలో రూ.8786 కోట్లుగా ఉన్న లాభం ప్రస్తుత ఏడాది అదే కాలంలో రూ.10,684 కోట్లకు పెరిగింది. అలాగే వడ్డీ ఆదాయం గత ఏడాది రెండవ త్రైమాసికంలో రూ.7,356 కోట్ల నుంచి రూ.8,957కి పెరిగింది. లాభాల తగ్గుదల అలకేషన్స్ పెరగటం వల్ల వచ్చినట్లు బ్యాంక్ వెల్లడించింది.

నికర వడ్డీ ఆదాయం గతేడాది రెండో త్రైమాసికంలో రూ.3,950 కోట్ల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,788 కోట్లకు పెరిగింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు సెప్టెంబర్, 2024 నాటికి స్థూల రుణాలు ఏడాది కిందట 2.11 శాతం నుంచి 1.92 శాతానికి తగ్గాయి. అలాగే నికర మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం ముగింపులో 0.68 శాతం నుంచి 0.48 శాతానికి తగ్గాయి. శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్ల ధర 3.75 శాతం క్షీణించి ఎన్ఎస్ఈలో రూ.65.50 వద్ద స్థిరపడ్డాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.47,921 కోట్లుగా ఉంది. కంపెనీ 52 వారాల గరిష్ఠ ధర రూ.92.45గా ఉండగా, 52 వారాల కనిష్ఠ ధర రూ.65.11గా ఉన్నాయి.
బ్యాంక్ షేర్లపై బ్రోకరేజ్ మాటేంటి..
బ్యాంక్ తాజా క్వార్టర్ ఫలితాలపై SS వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకురాలు సుగంధ సచ్‌దేవా మాట్లాడుతూ కంపెనీ షేర్లకు తక్షణ సపోర్ట్ జోన్ రూ.61 వద్ద ఉందన్నారు. అలాగే రెసిస్టెన్స్ రూ.76 వద్ద ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. దీని వల్ల సమీప భవిష్యత్తుతో స్టాక్ ధర రూ.52కి తగ్గవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంక్ షేర్‌హోల్డర్‌లు ఒక్కో షేరుకు రూ.61 చొప్పున స్టాప్ లాస్‌ను కొనసాగిస్తూనే షేర్‌లను హోల్డ్ చేయవచ్చని సుగంధ సూచించారు. కొత్త పెట్టుబడిదారులు ముగింపు ప్రాతిపదికన రూ.76 కంటే ఎక్కువ బ్రేక్అవుట్ ధర కోసం వేచి చూడటం ఉత్తమంగా పేర్కొన్నారు.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications