IPO News: అడుగుపెట్టగానే ఐపీవో 76% లాభం.. షేర్ల వెంటపడుతున్న ఇన్వెస్టర్లు, స్టాక్ రాకెట్ దూకుడు
Identical Brains Studios IPO: డిసెంబర్ చివరి వారంలో కొత్తగా మార్కెట్లోకి లిస్టింగ్ కోసం వస్తున్న ఐపీవోల సంఖ్య ఒక్కసారిగా ఊపందుకుంది. 2024లోనే తమ అదృష్టం పరీక్షించుకోవాలని వచ్చిన అనేక ఐపీవోలపై ప్రస్తుతం దేశీయ పెట్టుబడిదారులు దృష్టి కొనసాగుతోంది. ఈ క్రమంలో చాలా మంది పెట్టుబడిదారులు ఒడిదొడుకుల్లో ఉన్న ఈక్విటీలను పక్కనపెట్టి ఐపీవోలపై భారీగా బెట్టింగ్ వేస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో జాబితాకోసం వచ్చిన ఐడెంటికల్ బ్రెయిన్స్ స్టూడియోస్ ఐపీవో గురించే. వాస్తవ ఇష్యూ ధర కంటే 75.93 శాతం ప్రీమియం ధర వద్ద నేడు స్టాక్ మార్కెట్లోకి రూ.95 రేటు వద్ద గ్రాండ్ ఎంట్రీని నమోదు చేసింది. అయితే లిస్టింగ్ తర్వాత లాభాల స్వీకరణకు పెట్టుబడిదారులు మెుగ్గుచూపటంతో కంపెనీ షేర్లు దాదాపు 4 శాతం మేర క్షీణతను చూశాయి. అయితే ఇంట్రాడేలో ఉదయం 11.26 గంటల సమయంలో కంపెనీ షేర్ల ధర ఎన్ఎస్ఈలో రూ.99.75 వద్ద ఉండగా దాదాపు 84.72 శాతం లాభంతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్లు నేడు ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో నేడు బలమైన లిస్టింగ్ నమోదు చేశాయి.

వాస్తవానికి దేశీయ మార్కెట్ల నుంచి మూలధన అవసరాల కోసం కంపెనీ రూ.19.95 కోట్లను సమీకరించే లక్ష్యంతో ఐపీవోను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం పూర్తిగా 36.94 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. సాధారణ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ తన ఐపీవోను డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 20 వరకు అందుబాటులో ఉంచింది. కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.51-54గా నిర్ణయించింది. కంపెనీ లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా నిర్ణయించింది. సాధారణ ఇన్వెస్టర్లు ఐపీవోలోపాల్గొనటం కోసం కనీసం రూ.1,08,000 పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.5.66 కోట్లను విజయవంతంగా సమీకరించింది.
ఐడెంటికల్ బ్రెయిన్స్ స్టూడియోస్ ఐపీవో మొత్తంగా 544.28 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఈ క్రమంలో నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీ 1020.2 రెట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ కేటగిరీ 187.36 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. కంపెనీ ప్రమోటర్లుగా రాఘవేంద్ర రాయ్, సమీరా రాయ్ వ్యవహరిస్తున్నారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ వీఎఫ్ఎక్స్ వ్యాపారంలో ప్రసిద్ధ సంస్థగా కొనసాగుతోంది. ఎంటర్టైన్మెంట్ రంగంలో హై క్వాలిటీ వర్క్ అందించటంలో కంపెనీ అగ్రగామిగా కొనసాగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ.5.34 కోట్లుగా నమోదు చేసింది.
కంపెనీ వ్యాపారం..
ఐడెంటికల్ బ్రెయిన్స్ స్టూడియోస్ 2019లో ప్రారంభించబడింది. కంపెనీ కంప్యూటర్‌లో రూపొందించిన విజువల్ ఎఫెక్ట్స్ సేవలను అందిస్తోంది. చలనచిత్రాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, వాణిజ్య ప్రకటనల కోసం కంపెనీ VFX సేవలను అందిస్తోంది. కంపెనీ తాజా ఐపీవో నుంచి సేకరించిన నిధులను అంధేరీలోని తన కార్యాలయం, స్టూడియోని పునరుద్ధరించడానికి, లక్నోలో కొత్త బ్రాంచ్ కార్యాలయాన్ని తెరవడానికి, కంప్యూటర్లు, స్టోరేజ్ సిస్టమ్‌లు, సాఫ్ట్‌వేర్‌లను కొనుగోలు చేయడానికి వినియోగించాలని నిర్ణయించింది.


Click it and Unblock the Notifications