ICICI ప్రుడెన్షియల్ సరికొత్త లాంచ్! మార్కెట్ పడినా.. లాభాలు అందించేలా లాంగ్-షార్ట్ ఫండ్స్!

షేర్ మార్కెట్‌లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, ఏ సెక్టార్ ఎప్పుడు పడిపోతుందో ఊహించడం చాలా కష్టం. ఇలాంటి వేగంగా మారుతున్న మార్కెట్ పరిస్థితులను తట్టుకుని, ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించడానికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఒక సరికొత్త అడుగు వేసింది. తమ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (SIF) ప్లాట్‌ఫారమ్ కింద రెండు కొత్త ఫండ్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

అవే.. 'iSIF యాక్టివ్ అసెట్ అలోకేటర్ లాంగ్-షార్ట్ ఫండ్', , 'iSIF ఈక్విటీ లాంగ్-షార్ట్ ఫండ్'. ఈ రెండు సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లకు సంబంధించిన NFO (న్యూ ఫండ్ ఆఫర్) ఈరోజు (మే 19) నుంచే ప్రారంభమైంది. ఇన్వెస్టర్లు జూన్ 2, 2026 వరకు ఇందులో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది.

ICICI Prudential launches two new iSIF long short funds check NFO dates and strategy

లాంగ్-షార్ట్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఇవి ఎందుకు స్పెషల్?

సాధారణ మ్యూచువల్ ఫండ్స్ అనేవి కేవలం షేర్ మార్కెట్ పెరిగినప్పుడు మాత్రమే లాభాలను ఇస్తాయి. కానీ, ఈ లాంగ్-షార్ట్ ఫండ్స్ అలా కాదు. ఇవి డెరివేటివ్స్ (డెరివేటివ్ మార్కెట్) ఆధారంగా పనిచేస్తాయి. అంటే మార్కెట్ పెరిగేటప్పుడు లాంగ్ పొజిషన్స్ ద్వారా, అలాగే మార్కెట్ పడిపోయేటప్పుడు షార్ట్ పొజిషన్స్ ద్వారా.. రెండు వైపులా లాభాలను వెతుక్కునే వెసులుబాటు ఈ ఫండ్స్ ద్వారా లభిస్తుంది.

మార్కెట్ ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, రిస్క్‌ను తగ్గించడానికి ఈ స్ట్రాటజీ బాగా ఉపయోగపడుతుందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (CIO) శంకరన్ నరేన్ తెలిపారు.

ఈ రెండు ఫండ్స్ ఎలా పనిచేస్తాయి?

  1. iSIF యాక్టివ్ అసెట్ అలోకేటర్ లాంగ్-షార్ట్ ఫండ్: ఈ ఫండ్ కేవలం షేర్లకే పరిమితం కాకుండా.. ఈక్విటీ, డెట్ (బాండ్లు), కమోడిటీ డెరివేటివ్స్ (బంగారం, వెండి వంటివి), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లలో (InvITs) డైనమిక్‌గా పెట్టుబడులు పెడుతుంది. ఈక్విటీలో 35% నుండి 80% వరకు పెట్టుబడి పెడతారు. మార్కెట్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ కొని, మార్కెట్ బాగా పెరిగిపోయినప్పుడు అమ్మి లాభాలు బుక్ చేసుకుంటారు. ఇందులో అవసరాన్ని బట్టి 25% వరకు అన్‌హెడ్జ్డ్ షార్ట్ పొజిషన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంది.
  1. iSIF ఈక్విటీ లాంగ్-షార్ట్ ఫండ్: ఇది పూర్తిగా ఈక్విటీ మార్కెట్ పైనే ఫోకస్ చేస్తుంది. మార్కెట్లోని దాదాపు 650 కి పైగా కంపెనీల బిజినెస్ ఫండమెంటల్స్, మేనేజ్‌మెంట్ క్వాలిటీని పరిశీలించి పెట్టుబడులు పెడతారు. అంతేకాదు, అవసరమైతే గ్లోబల్ మార్కెట్‌లో ఉండే అవకాశాలను అందుకోవడానికి 35% వరకు విదేశీ షేర్లలో (Overseas equity) కూడా ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఈ ఫండ్‌కు ఉంది.

ఈ ఫండ్స్ ఎవరికి సూట్ అవుతాయి?

ముఖ్య గమనిక: ఇవి సాధారణ లేదా కొత్త ఇన్వెస్టర్ల కోసం డిజైన్ చేసినవి కావు. మార్కెట్ ట్రెండ్స్, డెరివేటివ్స్ , కాంప్లెక్స్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీలపై అవగాహన ఉన్న కాస్త సీనియర్ ఇన్వెస్టర్లకు ఇవి బెస్ట్ ఛాయిస్. ఈ iSIF ఫండ్స్‌లో మొదటిసారి ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి కనీస పెట్టుబడి పరిమితి రూ. 10 లక్షలుగా నిర్ణయించారు.

భారతదేశ మ్యూచువల్ ఫండ్ రంగం ఎంతగానో ఎదుగుతోంది అనడానికి ఈ కొత్త లాంచ్‌లే ఉదాహరణ. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, క్లిష్టమైన మార్కెట్ సమయాల్లో కూడా స్థిరమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవాలి అనుకునే బడా ఇన్వెస్టర్లకు ఈ NFO ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+