ఐపీఓలో మరో సంచలనం..రూ. 10 వేల కోట్లను టార్గెట్ చేసిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ..

ICICI Prudential AMC IPO: భారత స్టాక్ మార్కెట్లోకి మరో పెద్ద ఐపీఓ రానుంది. దేశంలోనే రెండవ అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ త్వరలో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ రెడీ చేసుకుంటోంది. ఈ దిగ్గజం త్వరలో IPO (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) కోసం సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.ICICI ప్రుడెన్షియల్ AMC మొత్తం రూ. 10 వేల కోట్ల నిధుల సమీకరణకు రెడీ అవుతోంది.

పరిశ్రమ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ త్వరలో రూ. 10 వేల కోట్ల నిధుల సమీకరణకు ఐపీఓ దాఖలు చేయనుంది. కాగా ఈ IPO పూర్తిగా OFS (ఆఫర్ ఫర్ సేల్)రూపంలోనే ఉండనుంది. కంపెనీలో కీలక భాగస్వామిగా ఉన్న బ్రిటన్‌కు చెందిన Prudential Plc తన షేర్లలో భాగాన్ని విక్రయానికి పెట్టనుంది. ICICI Prudential AMC లో ఇద్దరు భాగస్వామ్యంగా ఉన్నారు. వారిలో ఒకరు ఐసీఐసీఐ బ్యాంక్ కాగా మరొకరు ప్రుడెన్షియల్ పీఎల్‌సీ. 1998 నుండి అంటే గత 26 ఏళ్లుగా.. వీరు ఇద్దరూ ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థలో 51:49తో భాగస్వామ్యం కలిగి ఉన్నారు.

ICICI Prudential AMC ICICI Pru AMC to Launch IPO Soon British JV Partner ICICI Prudential AMC Plans Mega Rs 10 000 Cr IPO Rs 10 000 Cr IPO Incoming ICICI Pru AMC ICICI Group ICICI Prudential AMC IPO ICICI Pru IPO news 10000 crore IPO India British JV partner exit ICICI AMC offer for sale OFS IPO 2025 ICICI mutual fund IPO ICICI Prudential IPO details Indian IPO market 2025 upcoming IPOs India large IPOs 2025 UK partner stake sale ICICI AMC stock market debut 10 000 2025 IPO IPO ICICI AMC Offer For Sale

తాజాగా Prudential Plc ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రుడెన్షియల్ వాటాలలో 10 శాతం వాటాలను విక్రయించాలని చూస్తోంది. ఈ సేల్ ద్వారా కంపెనీ దాదాపు రూ.10 వేల కోట్లు నిధులను సమీకరించుకోనుంది.ఈ భారీ లిస్టింగ్ కోసం ప్రుడెన్షియల్ పీఎల్‌సీ ఇప్పటికే 17 ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులను నియమించింది. మనీకంట్రోల్ కథనం ప్రకారం.. ఇది భారత ఐపిఒ చరిత్రలో ఒక రికార్డు కానుంది. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ను ఈ వారంలో సెబీకి దాఖలు చేయనుందని తెలుస్తోంది. ఇక ఐపిఒను 2025-26 మూడవ త్రైమాసికంలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు మనీ కంట్రోల్ తన కథనంలో పేర్కొంది.

ఐపీఓలో జాబితా చేసిన తర్వాత ఇది ఐసీఐసీఐ గ్రూప్‌లో ఐదవ లిస్టింగ్ గా అవతరిస్తుంది. ఇప్పటికే.. ICICI బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ICICI లోంబార్డ్ జనరల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బీఎస్ఈ-ఎన్ఎస్ఈలో లిస్ట్ అయ్యాయి. దీంతో పాటు దేశంలో 5వ మ్యూచువల్ ఫండ్ కంపెనీగా స్టాక్ మార్కెట్లో నిలవనుంది. ఇప్పటికే హెచ్‌డీ‌ఎఫ్‌సీ ఏఎంసీ, నిప్పాన్ ఏఎంసీ, యూటీఐ ఏఎంసీ, ఆదిత్యా బిర్లా సన్ లైఫ్ స్టాక్ మార్కెట్లో నమోదై ఉన్నాయి.

ప్రస్తుతం కంపెనీ రూ. 9.14 లక్షల కోట్ల AUM (Assets Under Management) కలిగి ఉంది. అలాగే 1.1 కోట్ల ఇన్వెస్టర్లతో పాటుగా 133కి పైగా స్కీములు ఈ కంపెనీలో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ MD & CEOగా నిమేష్ షా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బలంగా నిలిచింది ఈ కంపెనీ. ఇక మార్చి 2025లో, ICICI ప్రుడెన్షియల్ AMC, ఐసీఐసీఐ వెంచర్ ఫండ్స్ ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్, రియల్ ఎస్టేట్ ఫండ్ మేనేజ్‌మెంట్ వ్యాపారాన్ని AMCలో విలీనం చేయడానికి ఆమోదం తెలిపాయని ఐసీఐసీఐ బ్యాంక్‌కు సమాచారం అందింది

ఇటీవల ICICI బ్యాంక్ తన వాటాను మెజారిటీగా కొనసాగించేందుకు ఇంకా 2% షేర్ల కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో Prudential Plc తన షేర్ విక్రయం ద్వారా వచ్చే మొత్తాన్ని షేర్‌హోల్డర్లకు తిరిగి చెల్లించనుంది. ఈ విషయాన్ని కంపెనీ గత ఫిబ్రవరిలోనే ప్రకటించింది.ఈ ఐపిఒ సక్సెస్ అయితే భారత ఆర్థిక రంగంలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+