IPO News: చరిత్రలో అతిపెద్ద ఐపీవో.. హ్యుందాయ్ గ్రేమార్కెట్ ప్రీమియం హడావిడి..!!
Hyundai IPO: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎల్ఐసీ కంటే అతిపెద్ద ఐపీవో నేడు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. హ్యుందాయ్ మోటార్స్ ఐపీవో యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఒకరోజు ముందుగానే నేడు అంటే అక్టోబర్ 14, 2024న ఓపెన్ అవుతోంది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా రూ.28,870.16 కోట్లు సమీకరించేందుకు లక్ష్యంతో మార్కెట్ల ముందుకు వస్తోంది.
యాంకర్ ఇన్వెస్టర్ల కోసం నేడు ప్రారంభమైన ఐపీవో వారి నుంచి రూ.8215.28 కోట్లు సమీకరించాలని ప్రయత్నిస్తోంది. భారీ మెుత్తంలో పెట్టుబడులు పెట్టే యాంకర్ ఇన్వెస్టర్లు సగటున తమ వాటాలకు 30 రోజుల నుంచి 6 నెలల వరకు లాక్ ఇన్ పిరియడ్ ఉంటుంది. ఇదే క్రమంలో కంపెనీ ఐపీవో సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లకు రేపటి నుంచి అంటే అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 17 వరకు దరఖాస్తులు వేసేందుకు తెరచి ఉంటుంది. ఇష్యూ కోసం ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.1865 నుంచి రూ.1960గా ప్రకటించింది. దీంతో లాట్ పరిమాణాన్ని 7 షేర్లుగా ఉంచింది. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కొనుగోలు చేయటానికి కనీసం రూ.13,720 వెచ్చించాల్సి ఉంటుంది.

ఇదే క్రమంలో హ్యుందాయ్ మోటార్స్ తన ఉద్యోగులకు ఐపీవో షేర్లను డిస్కౌంటెడ్ రేట్లకు విక్రయించాలని నిర్ణయించింది. ఈ కారణంగా ఉద్యోగులు ఐపీవోలో పాల్గొని బెట్టింగ్ వేసినట్లయితే వారికి ఇష్యూ ధర కంటే ఒక్కో షేరును రూ.186 తక్కువ రేటుకే అందుబాటులో ఉంచింది. ఉద్యోగులకు కంపెనీ మెుత్తంగా 778,400 షేర్లను రిజర్వు చేసింది. కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఏకకాలంలో లిస్టింగ్ కానున్నాయి. కంపెనీ రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 35 శాతం, హెచ్ఎన్ఐలకు 15 శాతం, క్యూఐబీలకు 50 శాతం వాటాలను
గ్రేమార్కెట్లో బేజారు..
వాస్తవానికి ఐపీవోలు లిస్టింగ్ కాకముందు దాని డిమాండ్ ఆదారంగా గ్రేమార్కెట్లో ప్రీమియం ధర నిర్ణయించబడుతుంది. అయితే ప్రస్తుతం గ్రేమార్కెట్లో హ్యుందాయ్ ఐపీవో అనుకున్న స్థాయిలో పనితీరును కనబరచటం లేదు. ఈ క్రమంలో జీఎంపీ కేవలం ఒక్కో షేరుకు రూ.65గా ఉంది.
ఇక కంపెనీ వ్యాపారం గురించి పరిశీలిస్తే మే 1996లో స్థాపించబడిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ హ్యుందాయ్ మోటార్ గ్రూప్‌లో ఒక భాగం. ప్రయాణీకుల వాహన విక్రయాల ఆధారంగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆటో ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారుగా ఉంది. కంపెనీ నాలుగు చక్రాల ప్యాసింజర్ వాహనాల తయారీతో పాటు ట్రాన్స్‌మిషన్‌లు, ఇంజిన్‌ల వంటి భాగాల తయారీ వ్యాపారంలో కొనసాగుతోంది.
ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 1,366 సేల్స్ పాయింట్లు, 1,550 సర్వీస్ పాయింట్ల నెట్‌వర్క్ కలిగి ఉంది. మార్చి 31 నాటికి కంపెనీ దేశంలో, ఎగుమతుల రూపంలో 1.2 కోట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. ప్రస్తుతం సెడాన్లు, హ్యాచ్‌బ్యాక్‌లు, ఎస్‌యూవీలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను సైతం కంపెనీ విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications