Hyundai IPO: దేశంలో ఐపీవోల మార్కెట్ పెద్ద బూమ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో వచ్చిన ఐపీవోల్లో 95 శాతం లాభాల్లోనే లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చిన ఆటో దిగ్గజ సంస్థ ఐపీవో నేడు దలాల్ స్ట్రీట్ సూచీల్లో జాబితా చేయబడింది. మెుదటి నుంచే పెద్దగా ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ కొరవడిన ఐపీవో చివరికి నిరాశాజనకమైన ప్రయాణాన్ని మెుదలు పెట్టింది.
దేశంలోనే కాక ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఐపీవోగా వచ్చిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీవో నేడు భారతీయ స్టాక్ మార్కెట్లలో అడుగుపెట్టింది. అయితే ఇది బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లకు మాత్రం అరంగేట్రంలో నిరాశనే మిగిల్చింది. లిస్టింగ్ ముందు గ్రే మార్కెట్లో ప్రీమియం చాలా తక్కువగా ఉండటం ఇన్వెస్టర్లలో అనుమానాలను కలిగించిన సంగతి తెలిసిందే. దీంతో నేడు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో కంపెనీ షేర్లు 1 శాతానికి పైగా డిస్కౌంటెడ్ ధర వద్ద జాబితా అయ్యాయి. మ్యూటెడ్ లిస్టింగ్ చాలా మంది ట్రేడర్లను నిరాశకు గురిచేసింది.

వాస్తవానికి కంపెనీ ఇష్యూ సమయంలో ఒక్కో షేరును గరిష్ఠంగా రూ.1960కి విక్రయించిన సంగతి తెలిసిందే. అయితే లిస్టింగ్ సమయంలో ఎన్ఎస్ఈలో ఒక్కో స్టాక్ 1,934 ధర వద్ద జాబితా అవగా, బీఎస్ఈలో ఒక్కో షేరు రూ.1931 రేటుకు అడుగుపెట్టాయి. దీంతో ఇన్వెస్టర్లకు లాభాల మాట పక్కన పెడితే 1 శాతానికి పైగా లిస్టింగ్ నష్టం మిగిలింది.
ఇక కంపెనీ వ్యాపారం గురించి పరిశీలిస్తే మే 1996లో స్థాపించబడిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ హ్యుందాయ్ మోటార్ గ్రూప్‌లో ఒక భాగం. ప్రయాణీకుల వాహన విక్రయాల ఆధారంగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆటో ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారుగా ఉంది. కంపెనీ నాలుగు చక్రాల ప్యాసింజర్ వాహనాల తయారీతో పాటు ట్రాన్స్‌మిషన్‌లు, ఇంజిన్‌ల వంటి భాగాల తయారీ వ్యాపారంలో కొనసాగుతోంది.

ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 1,366 సేల్స్ పాయింట్లు, 1,550 సర్వీస్ పాయింట్ల నెట్‌వర్క్ కలిగి ఉంది. మార్చి 31 నాటికి కంపెనీ దేశంలో, ఎగుమతుల రూపంలో 1.2 కోట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. ప్రస్తుతం సెడాన్లు, హ్యాచ్‌బ్యాక్‌లు, ఎస్‌యూవీలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను సైతం కంపెనీ విక్రయిస్తోంది.
షేర్లపై బ్రోకరేజ్ మాట..
నేడు మార్కెట్లో లిస్ట్ అయిన హ్యుందాయ్ కంపెనీ షేర్లపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎంకే గ్లోబల్ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. బ్రోకరేజ్ హ్యుందాయ్ మోటార్ ఇండియాపై రెడ్యూస్ రేటింగ్‌తో కవరేజీని ప్రారంభించింది. ఈ క్రమంలో నేడు లిస్ట్ అయిన కంపెనీ షేర్లకు రూ.1,750 టార్గెట్ ధరగా పేర్కొంది. ఆటో దిగ్గజ సంస్థకు ఇండియాలో బలమైన ఫ్రాంచైజీ ఉందని పేర్కొంది. కానీ మ్యూట్ చేయబడిన వృద్ధి ఔట్‌లుక్ మధ్య కార్‌మేకర్ అధిక వాల్యుయేషన్‌లో ఉన్నట్లు బ్రోకరేజ్ వెల్లడించింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications