Gemini Edibles & Fats India IPO: ఐపీఓగా రానున్న ఫ్రీడమ్ ఎడిబుల్ ఆయిల్ కంపెనీ..!
హైదరాబాద్‌కు చెందిన జెమిని ఎడిబుల్స్ & ఫ్యాట్స్ ఇండియా (GEF) త్వరలో ఐపీఓగా రానుంది. ఆ కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా నిధులు సమీకరించేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఆగస్టు 21న దాఖలు చేసిన ముసాయిదా రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ప్రకారం.. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) పూర్తిగా ప్రమోటర్లు,పెట్టుబడిదారుల ద్వారా 4.11 కోట్ల వరకు ఈక్విటీ షేర్ల ఆఫర్-ఫర్-సేల్ రూపంలో ఉండనుంది. ఈ OFS కింద ప్రమోటర్లైన అల్కా చౌదరి, గోల్డెన్ అగ్రి ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు, పెట్టుబడిదారులైన బ్లాక్ రివర్ ఫుడ్ 2 ప్రైవేట్ లిమిటెడ్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ కమర్షియల్ ఎంటర్‌ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ తమ షేర్లను విక్రయించనున్నాయి.
ప్రతిపాదిత IPOలో ఫ్రెష్ ఇష్యూ లేనందున ఈ ఐపీఓ ద్వారా కంపెనీకి ఎలాంటి సొమ్ము రాదు. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సమీకరించిన నిధులు షేర్లను విక్రయించిన వాటాదారులకే వెళ్తాయి. గోల్డెన్ అగ్రి ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద సమీకృత పామాయిల్ వ్యవసాయ వ్యాపార సంస్థలలో ఒకటైన గోల్డెన్ అగ్రి-రిసోర్సెస్ (GAR) అనుబంధ సంస్థ. బ్లాక్ రివర్ ఫుడ్ 2 ప్రైవేట్ లిమిటెడ్ అనేది ప్రోటెర్రా ఇన్వెస్ట్‌మెంట్ పార్ట్‌నర్స్, బ్లాక్ రివర్ అసెట్ మేనేజ్‌మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒక వ్యవసాయ నిధి. కాగా ఇన్వెస్ట్‌మెంట్ అండ్ కమర్షియల్ ఎంటర్‌ప్రైజ్ అనేది సింగపూర్‌కు చెందిన ఒక బూటిక్ పెట్టుబడి, కన్సల్టెన్సీ సంస్థ.

జెమిని ఎడిబుల్స్ & ఫ్యాట్స్ ఇండియా వంట నూనెలు, ప్రత్యేక కొవ్వుల వ్యాపారం, ప్రాసెసింగ్, తయారీ చేస్తోంది అలాగే సుగంధ ద్రవ్యాలు మరియు నిత్యావసర ఆహార ఉత్పత్తుల రంగంలోకి కూడా విస్తరిస్తోంది. ఈ కంపెనీ ప్రధాన బ్రాండ్‌లలో ఫ్రీడమ్, బీ-రైట్, ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. ఈ సంస్థ దక్షిణ భారతదేశం, తూర్పు భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది.
భారత మార్కెట్లో అతిపెద్ద ప్రాంతీయ బ్రాండెడ్ వంట నూనెల సంస్థలలో ఒకటిగా ఉంది. జెమిని ఎడిబుల్స్ & ఫ్యాట్స్ ఇండియా 2026 ఆర్థిక సంవత్సరంలో 18 శాతం మార్కెట్ వాటాతో, ఆదాయం పరంగా బ్రాండెడ్ మార్కెట్లో అతిపెద్ద పొద్దుతిరుగుడు నూనె విక్రయ సంస్థగా కూడా ఉంది. దీనికి 1,600 కంటే ఎక్కువ డిస్ట్రిబ్యూటర్లు, 3 లక్షల రిటైల్ అవుట్‌లెట్‌లు, కీలక మార్కెట్లలో 60కి పైగా దోదాములు ఉన్నాయి.
FY20, FY25 మధ్య, మొత్తం బ్రాండెడ్ తినదగిన నూనె మార్కెట్ 10.1 శాతం వృద్ధిని నమోదు చేయగా, TKC బ్రాండెడ్ ఆదాయం 20.5 శాతం సమ్మేళన వార్షిక వృద్ధి రేటు (CAGR)తో పెరిగింది. ఆర్థిక పరంగా చూస్తే, కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం FY25లో రూ. 10,755.95 కోట్ల నుంచి FY26లో రూ. 12,650 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేయాలని ప్రతిపాదించారు. ఈ IPOకు మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, IIFL క్యాపిటల్ సర్వీసెస్ సంస్థలు 'బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లు'గా వ్యవహరిస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications