Nvidia షేర్లపై షార్ట్ బెట్స్‌తో భారీ నష్టాలు.. సెకన్లలోనే 92% సంపద ఆవిరి.. అసలేం జరిగింది..
How Nvidia Shorts Lost 92% in Seconds: అమెరికన్ సెమీకండక్టర్ దిగ్గజం ఎన్విడియా (Nvidia) షేర్లు ఒక్కరోజులో రికార్డు స్థాయిలో దూసుకెళ్లడంతో.. ఆ షేర్ల పతనాన్ని ఆశించి వ్యతిరేక పందెం కాసిన (Short Sellers) మదుపర్లు భారీ నష్టాల్లో కూరుకుపోయారు. ఈ పరిణామంపై ప్రముఖ మదుపరి, హీలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు సమీర్ అరోరా 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' (WSJ) నివేదికను ఉటంకిస్తూ సోషల్ మీడియా వేదిక 'X' లో ఆసక్తికర వివరాలను పంచుకున్నారు.
నవంబర్ 23, సోమవారం నాడు యూఎస్ స్టాక్ మార్కెట్ ప్రారంభమైన కొన్ని క్షణాల్లోనే.. ఎన్విడియాపై ట్రిపుల్-లెవరేజ్డ్ షార్ట్ ఎక్స్‌పోజర్‌ను అందించే యూకే-లిస్టెడ్ రెండు ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) సుమారు 92 శాతం మేర కుప్పకూలాయని.. ఫలితంగా వాటిలో ట్రేడింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చిందని ఆ నివేదిక వెల్లడించింది.

ఎన్విడియాకు వ్యతిరేకంగా పెట్టిన పందాలు విఫలం కావడానికి ప్రధాన కారణం ఆ ఫండ్ల ట్రిపుల్-లెవరేజ్డ్ (3x Leveraged) నిర్మాణమే. ఫైనాన్షియల్ డెరివేటివ్‌లను ఉపయోగించే ఈ ఉత్పత్తులు, ఎన్విడియా రోజువారీ షేర్ ధర పనితీరుకు విలోమంగా మూడు రెట్లు రాబడిని ఇచ్చేలా రూపొందించబడ్డాయి. అంటే ఎన్విడియా షేర్ 10 శాతం పడిపోతే ఈ ఫండ్లలో 30 శాతం లాభం వస్తుంది. కానీ స్టాక్ 30 శాతం పెరిగితే దాదాపు 90 శాతం నష్టం వాటిల్లుతుంది.
సోమవారం నాడు ఎన్విడియా షేర్లు ఏకంగా 31.5 శాతం ఎగబాకి 165.05 డాలర్ల వద్ద ముగియడంతో.. కంపెనీ మార్కెట్ విలువ ఒక్కరోజే సుమారు 950 బిలియన్ డాలర్లు పెరిగింది. అమెరికా మార్కెట్ చరిత్రలో ఒక కంపెనీకి ఒక్కరోజులో నమోదైన అతిపెద్ద మార్కెట్ క్యాప్ వృద్ధి ఇదే. ఈ ర్యాలీతో నాస్‌డాక్ కాంపోజిట్ 6.51 శాతం, ఎస్&పి 500 సూచీ 4.73 శాతం, డౌ జోన్స్ 3.01 శాతం చొప్పున లాభపడ్డాయి.
ఈ ఊహించని ర్యాలీ కేవలం రెండు యూకే ఈటీఎఫ్‌లకే పరిమితం కాకుండా విస్తృత స్థాయిలో షార్ట్ సెల్లర్లను దెబ్బతీసింది. ఫైనాన్షియల్ అనలిటిక్స్ సంస్థ ఓర్టెక్స్ (ORTEX) గణాంకాల ప్రకారం, సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో ఎన్విడియా షార్ట్ సెల్లర్లు సుమారు 12.2 బిలియన్ డాలర్ల కాగితపు నష్టాలను ఎదుర్కొన్నారు. 2019 తర్వాత ఒక్కరోజులో వారికి ఇదే అతిపెద్ద ఎదురుదెబ్బ చెప్పవచ్చు. షేర్ ధర 168.50 డాలర్ల వద్ద ఉన్నప్పుడు లెక్కించిన ఈ నష్టాలు.. అంతకుముందు వారంలో వారు ఆర్జించిన 10.5 బిలియన్ డాలర్ల లాభాలను పూర్తిగా తుడిచిపెట్టాయి.
కాగా, వివాహేతర సంబంధాల ఆరోపణల (అందులో ఒక చైనా గూఢచారితో సంబంధం ఉన్నట్లు వచ్చిన వార్తల) నేపథ్యంలో ఈ నెల మొదట్లో రాజీనామా చేసిన జెన్సన్ హువాంగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపు మేరకు నవంబర్ 22 నుండి తిరిగి ఎన్విడియా ప్రెసిడెంట్, సీఈఓ, బోర్డు సభ్యుడిగా బాధ్యతలు చేపట్టడంతో కంపెనీ షేర్లలో ఈ భారీ ఉత్సాహం నెలకొంది. తాత్కాలిక సీఈఓగా వ్యవహరించిన కొలెట్ క్రెస్ తిరిగి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా (CFO) తన సాధారణ బాధ్యతల్లోకి వెళ్లారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
