అమెరికా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోతారు జాగ్రత్త!

గత 10, 15 ఏళ్లుగా అమెరికా స్టాక్ మార్కెట్ (US Equities) అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చింది. కొన్ని సందర్భాల్లో మన ఇండియన్ మార్కెట్ కంటే కూడా ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో సోషల్ మీడియాలో ఇన్వెస్ట్‌మెంట్ గురువులు చెప్పే మాటలు విని, చాలా మంది తమ ఎస్ఐపి (SIP) డబ్బులను భారీగా అమెరికా ఫండ్స్ వైపు మళ్లిస్తున్నారు. అయితే, ఇలా గుడ్డిగా వెళ్లడం చాలా ప్రమాదకరమని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్, 'సహజ్ మనీ' వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ హెచ్చరిస్తున్నారు.

ఆయన ఒక లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో వివరిస్తూ.. "ఈ వారం ముగ్గురు క్లయింట్లు నన్ను తమ ఎస్ఐపిల్లో 40 శాతం డబ్బును యూఎస్ ఫండ్స్‌కు మార్చాలా అని అడిగారు. వారి హోమ్ లోన్ EMIలు, పిల్లల స్కూల్ ఫీజులు, రిటైర్మెంట్ గోల్స్ అన్నీ రూపాయిల్లోనే ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో వచ్చే హైప్ చూసి, అమెరికా మార్కెట్లో పెట్టకపోతే తాము వెనుకబడిపోతామని వారు భయపడుతున్నారు" అని పేర్కొన్నారు. ఇది ఇన్వెస్ట్‌మెంట్ డైవర్సిఫికేషన్ కాదు, కేవలం ఒక ప్రొడక్ట్ అమ్మడానికి క్రియేట్ చేసిన 'కృత్రిమ భయం' అని ఆయన తేల్చి చెప్పారు. విదేశీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే ముందు ఎవరూ చెప్పని నిజాలు ఏంటంటే..

How Much Should You Invest In US Equities Expert Warns Against Going Overboard In Stock Market

1. 20% టీసీఎస్ (TCS) షాక్!

మీరు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ విలువైన యూఎస్ ఈటీఎఫ్‌లు (ETFs) లేదా స్టాక్స్ కొంటే.. ఆ పరిమితి దాటిన మొత్తంపై మీ బ్యాంక్ ముందే 20% టిసిఎస్ (Tax Collected at Source) కట్ చేస్తుంది. మీరు ఐటీఆర్ (ITR) ఫైల్ చేసి ఆ డబ్బును వెనక్కి తెచ్చుకోవచ్చు, కానీ అప్పటివరకు ఆ క్యాష్ ప్రభుత్వానికి ఇచ్చిన వడ్డీ లేని అప్పులాగా లాక్ అయిపోతుంది.

2. క్రూరమైన పన్ను విధానం (Tax Math)

ఏప్రిల్ 2023 తర్వాత వచ్చిన నిబంధనల ప్రకారం.. ఇంటర్నేషనల్ ఫండ్స్ నుండి వచ్చే లాభాలను మీ సాధారణ ఆదాయానికి కలిపి, మీ టాక్స్ స్లాబ్ (30% వరకు) ప్రకారం పన్ను విధిస్తారు. ఇందులో ఎలాంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) బెనిఫిట్ ఉండదు. మన దేశీయ ఈక్విటీలపై కేవలం 12.5% టాక్స్ పడితే, యూఎస్ ఫండ్స్ లాభాలపై 30% వరకు కట్టాల్సి రావడం పెద్ద మైనస్.

3. 40% ఎస్టేట్ టాక్స్ ట్రాప్!

మీరు నేరుగా యూఎస్ స్టాక్స్‌లో 60,000 డాలర్ల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఉండి, దురదృష్టవశాత్తూ మీకు ఏదైనా జరిగితే.. మీ నామినీ ఆ డబ్బును క్లెయిమ్ చేసుకునేటప్పుడు అమెరికా ప్రభుత్వానికి ఏకంగా 40% వరకు ఎస్టేట్ టాక్స్ కట్టాల్సి ఉంటుంది.

గుర్తుంచుకోవాల్సిన లాజిక్

మీ భవిష్యత్తు ఖర్చులు, బాధ్యతలు 95 శాతం ఇండియాలోనే ఉన్నప్పుడు, రూపాయిల్లోనే పేమెంట్లు చేయాల్సి వచ్చినప్పుడు.. మీ పోర్ట్‌ఫోలియోలో సగం డాలర్లలో ఉంచడం అస్సలు కరెక్ట్ కాదు. రూపాయి పడిపోతుందనే భయం కూడా చాలా అపోహ మాత్రమే. గత 20 ఏళ్లలో రూపాయి ఏడాదికి సగటున 3% మాత్రమే క్షీణించింది, కానీ అదే సమయంలో మన నిఫ్టీ 50 దాదాపు 12% సగటు వార్షిక వృద్ధిని (CAGR) ఇచ్చింది.

ఏ అసెట్ క్లాస్ ఎంత రిటర్న్స్ ఇచ్చింది?

  • యూఎస్ ఈక్విటీలు (US Equities): గత 20 ఏళ్ల కాలంలో ఇవి అత్యధికంగా 15.2% రిటర్న్స్ ఇచ్చాయి. అలాగే 15 ఏళ్లలో 19.8%, గత 10 ఏళ్లలో అత్యద్భుతంగా 19.4% వార్షిక లాభాలను అందించి అన్నిటికంటే టాప్‌లో నిలిచాయి.
  • గోల్డ్ (బంగారం): గత 20 ఏళ్ల కాలంలో బంగారం ఏకంగా 14.6% వార్షిక రిటర్న్స్ ఇచ్చింది. స్టాక్ మార్కెట్ కాకుండా సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌లలో బంగారం పెట్టుబడిదారులకు భారీ లాభాలనే తెచ్చిపెట్టింది.
  • ఇండియన్ ఈక్విటీలు (Indian Equities): మన దేశీయ స్టాక్ మార్కెట్ గత 20 ఏళ్లలో 11.4%, 15 ఏళ్లలో 11.3% , గత 10 ఏళ్లలో స్థిరంగా 13.2% వార్షిక లాభాలను అందించింది.
  • రియల్ ఎస్టేట్ (Real Estate): భూములు , ఇళ్లపై పెట్టుబడులు గత 20 ఏళ్లలో సగటున 7.9%, అలాగే 15 ఏళ్ల కాలంలో 5.6% వార్షిక రిటర్న్స్‌ను మాత్రమే నమోదు చేశాయి.
  • డెట్ ఫండ్స్ (Debt Instruments): సురక్షితమైన బాండ్లు , ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాలు గత 20 ఏళ్లలో 7.6% , 15 ఏళ్ల కాలంలో 7.5% మేర స్థిరమైన వార్షిక లాభాలను ఇచ్చాయి.

ఐడియల్ అలోకేషన్ స్ట్రాటజీ ఏంటి?

మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం, లాంగ్ టర్మ్ గోల్స్ ఆధారంగా మీ మొత్తం పోర్ట్‌ఫోలియోలో కేవలం 5% నుండి 15% వరకు మాత్రమే ఇంటర్నేషనల్ ఈక్విటీలకు కేటాయించడం సరైన పద్ధతి. అంతకు మించి ఇన్వెస్ట్ చేస్తే అది డైవర్సిఫికేషన్ అవ్వదు, కేవలం ఇటీవలి లాభాలను చూసి ఆశపడి కరెన్సీపై జూదం ఆడినట్లే అవుతుంది. మీ లక్ష్యాలు రూపాయిల్లో ఉన్నప్పుడు, మీ ప్రధాన పెట్టుబడి ఎప్పుడూ ఇండియన్ మార్కెట్ లోనే ఉండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+