గతేడాది ఈ కంపెనీ స్టాక్ కొన్న వారి పంట పండింది.. ఏకంగా 136 శాతం ర్యాలీ.. కారణం ఏంటంటే..

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న రాగి (కాపర్) తీవ్ర సరఫరా కొరత.. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ (LME)లో కాంట్రాక్ట్ ధరల స్ప్రెడ్ గణనీయంగా విస్తరించడంతో రాగి ధరలు సర్వకాలీన గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ బలమైన పరిణామాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం నాటి ట్రేడింగ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ షేర్లు ఒక్కసారిగా 7.65 శాతం మేర జంప్ చేశాయి.

LMEలో కాపర్ స్పాట్ ప్రీమియం 2021 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకోవడం మార్కెట్ తీవ్రతకు అద్దం పడుతోంది. టన్నుకు 14,160 డాలర్ల వద్ద ఉన్న మూడు నెలల ఫ్యూచర్ కాంట్రాక్టుల కంటే స్పాట్ ధరలు సుమారు 400 డాలర్లు అధికంగా ట్రేడ్ కాగా.. స్పాట్ కాపర్ టన్నుకు 14,503 డాలర్ల మార్కును తాకింది. ఆనంద్ రాథీ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 2026 నాటికి ప్రపంచ నిల్వలు 2.8 లక్షల టన్నుల కంటే తక్కువకు పడిపోవడంతో భౌతిక మార్కెట్లలో తీవ్ర కొరత నెలకొంది. దీనివల్ల గత నెలలో అంతర్జాతీయంగా రాగి ధరలు 13,500 డాలర్ల స్థాయిల పైన బలంగా నిలదొక్కుకున్నాయి.

Hindustan Copper share price Hindustan Copper stock Hindustan Copper shares today Hindustan Copper share rise Hindustan Copper 136 return Hindustan Copper multibagger Hindustan Copper Q1 result

మరోవైపు, అమెరికాలోని COMEX ఎక్స్ఛేంజ్‌లో ఏకంగా 7 లక్షల టన్నులకు పైగా సరుకు రికార్డు స్థాయిలో పేరుకుపోవడం వల్ల ఇతర అంతర్జాతీయ ఎక్స్ఛేంజీలలో నిల్వలు భారీగా పడిపోయాయని పరిశోధనా సంస్థ వివరించింది. ట్రంప్ ప్రభుత్వం విధించబోయే సుంకాల నిర్ణయానికి ముందే అమెరికాకు రాగి రవాణా పెరగడం కూడా ఇతర మార్కెట్లలో కొరతకు కారణమైంది. దీని ఫలితంగా ఈ ఏడాది ఇప్పటివరకు అంతర్జాతీయంగా రాగి ధరలు 16 శాతం మేర పెరిగాయి.

Also Read

దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఆగస్టు కాంట్రాక్ట్ ధర 0.92 శాతం పెరిగి కిలోకు రూ. 1,391.30 వద్ద ట్రేడ్ అవ్వగా.. సెప్టెంబర్ 2026 కాంట్రాక్టులు 0.9 శాతం లాభంతో కిలోకు రూ. 1,396.15 వద్ద ముగిశాయి. నిన్న మధ్యాహ్నం 2:08 గంటల సమయానికి బెంచ్‌మార్క్ నిఫ్టీ సూచీ 0.11 శాతం క్షీణించినప్పటికీ.. హిందుస్థాన్ కాపర్ షేరు లాభాలను నిలబెట్టుకుని ఎన్‌ఎస్‌ఈ (NSE)లో ఒక్కో షేరుకు రూ. 567.70 వద్ద 7.31 శాతం లాభంతో ట్రేడయింది.

ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు హిందుస్థాన్ కాపర్ షేర్లు 9.56 శాతం పెరగ్గా.. గత 12 నెలల కాలంలో ఏకంగా 136 శాతం ర్యాలీ చేసి ఇన్వెస్టర్ల పెట్టుబడులను రెట్టింపు కంటే ఎక్కువ చేశాయి. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం.. ఆనంద్ రాథీ విశ్లేషకుడు పార్థివ్ జోన్సా ఈ స్టాక్‌కు 'బై' (Buy) రేటింగ్ సిఫార్సు చేస్తున్నారు. భవిష్యత్తులో హరిత ఇంధన పరివర్తన వల్ల రాగికి దీర్ఘకాలికంగా బలమైన డిమాండ్ ఉండటం.. నూతన గనుల ఏర్పాటులో ఆలస్యం కావడం వంటి అంశాలు ధరల ర్యాలీకి మరింత ఊతమిచ్చే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+