HFCL: రూ.60 నుంచి రూ.257కు పెరిగిన స్టాక్.. అదీ 8 నెలల్లోనే..!
గత కొద్ది నెలలుగా HFCL షేర్ ధర భారీగా పెరుగుతూ వస్తోంది. గత ఆరు నెలల్లో స్టాక్ BSEలో ఈ స్టాక్ 260 శాతానికి పైగా పెరిగింది. మంగళవారం HFCL షేర్లు 5 శాతం పెరిగి రూ.255 వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకాయి. ఇది కంపెనీ అప్పర్ సర్క్యూట్ పరిమితి అయిన రూ.255.05కి చాలా దగ్గరగా ఉంది. అంతకుముందు వరుసగా రెండు సెషన్లలో కూడా ఈ స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. మంగళవారం నాటి ఇంట్రాడే గరిష్ట స్థాయిని కలుపుకుని వరుసగా మూడు సెషన్లలో ఈ స్టాక్ దాదాపు 16 శాతం వరకు పెరిగింది.
ఈ ఏడాది జనవరి 23న రూ.59.83 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని నమోదు చేసిన తర్వాత, ఆగస్టు 31న ఈ స్టాక్ రూ.257 వద్ద 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. HFCL రక్షణ, రైల్వేలు, టెలికాం రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్టాక్ ధరలో ఇటీవలి ఈ భారీ పెరుగుదలకు ఆయా రంగాలకు అనుకూలమైన పరిస్థితులు, కంపెనీ మెరుగైన ఆర్థిక పనితీరు, బలమైన ఆర్డర్ బుక్ కారణమని నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ 1న దాదాపు రూ.2,329 కోట్ల విలువైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (OFC) సరఫరా కోసం ఒక కస్టమర్‌తో దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది.

జూన్ 17న ఉత్తరప్రదేశ్ (పశ్చిమ) టెలికాం సర్కిల్‌లోని భారత్‌నెట్ ఫేజ్-3 ప్రాజెక్ట్ కోసం రైల్ వికాస్ నిగమ్ (RVNL) నుంచి రూ.2,666.09 కోట్ల కాంట్రాక్టును దక్కించుకున్నట్లు HFCL ప్రకటించింది. FY26లో HFCL మొత్తం ఆదాయం రూ.5,014.52 కోట్లుగా నమోదైంది. ఇది FY25లోని ₹4,122.28 కోట్ల నుంచి 21.6% పెరుగుదల. ఆ సంవత్సరానికి పన్ను తర్వాత లాభం (PAT) FY25లోని రూ.173.26 కోట్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఎబిట్డా 63.15% పెరిగి రూ.506.75 కోట్ల నుంచి రూ.826.75 కోట్లకు చేరింది. ఎబిట్డా మార్జిన్న్ FY25లో 12.47% నుండి FY26లో 16.70%కి పెరిగింది.
FY26 డివిడెండ్ చెల్లింపు కోసం HFCL సెప్టెంబర్ 22ని రికార్డ్ తేదీగా నిర్ణయించింది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు FY26 కోసం 20% తుది డివిడెండ్‌ను సిఫార్సు చేశారు. అయితే దీనికి రాబోయే వార్షిక సాధారణ సమావేశంలో (AGM) వాటాదారుల ఆమోదం అవసరం.2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన AGM మంగళవారం, 29 సెప్టెంబర్ 2026న జరగనుంది. గత ఎనిమిది నెలల్లో ఈ స్టాక్ రూ.60 నుండి రూ.252కి భారీగా పెరిగింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
