రూ. 1200 కోట్ల నిధుల సమీకరణపై గురిపెట్టిన హీరో మోటార్స్.. ఐపీఓ కోసం సెబీకి ముసాయిదా దాఖలు..
Hero Motors IPO Latest Update: ప్రముఖ ఆటో మొబైల్ తయారీ దిగ్గజం హీరో మోటార్స్ స్టాక్ మార్కెట్లో ఐపీఓ ద్వారా సత్తా చాటాలని చూస్తోంది. ఆటో విడిభాగాల తయారీ దిగ్గజం సుమారుగా రూ.12 వేల కోట్ల సమీకరణ కోసం ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం ముసాయిదా పత్రాలను దాఖలు చేసినట్లు రాయిటర్స్ నివేదిక తెలిపింది. కంపెనీ దాఖలు చేసిన పత్రాల ప్రకారం.. హీరో మోటార్స్ రూ. 800 కోట్ల వరకు విలువైన కొత్త షేర్లను జారీ చేస్తుంది.
ప్రస్తుతం కంపెనీకి ఉన్న వాటాదారులు రూ.400 కోట్ల వరకు విలువైన షేర్లను విక్రయిస్తారు.ఈ షేర్లు ఆఫర్-ఫర్-సేల్ కింద విక్రయిస్తారు. ఆఫర్-ఫర్-సేల్ (OFS) భాగంగా ముంజాల్ హోల్డింగ్స్ రూ.390 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి పెడుతుంది. ఇందులో ఒక్కో షేరు విలువ రూ. 10గా ఉంది. వీటితో పాటుగా భాగ్యయోదయ్ ఇన్వెస్ట్‌మెంట్స్, హీరో సైకిల్స్ ఒక్కొక్కటి రూ.5 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కూడా విక్రయానికి అందుబాటులో ఉంచుతున్నాయి.

కాగా BMW లాంటి పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు హీరో మోటార్స్ కు కస్టమర్లుగా ఉన్నాయి. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ నడుపుతున్న ముంజాల్ కుటుంబానికి చెందిన పంకజ్ ముంజాల్ హీరో మోటార్స్ కు నాయకత్వం వహిస్తున్నారు.రాయిటర్స్ తెలిపిన నివేదిక ప్రకారం.. IPO ద్వారా సేకరించిన నిధులను కంపెనీకి ఉన్న అప్పులను తిరిగి చెల్లించడానికి ఉపయోగిస్తారు. అలాగే యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ లో ఉన్న తన ప్లాంట్‌ను విస్తరించడానికి మరిన్ని పరికరాలను కొనుగోలు చేయడానికి ఐపీఓ ద్వారా వచ్చే నిధుల మొత్తాన్ని ఉపయోగించనున్నట్లు హీరో మోటార్స్ తెలిపింది.
2024 ఆర్థిక సంవత్సరంలో హీరో మోటార్స్ నికర లాభం 67 శాతం తగ్గింది. ఈ కాలంలో ఆదాయం దాదాపు 1 శాతం పెరిగింది. అయితే పెరుగుతున్న ఖర్చుల కారణంగా లాభాలు కూడా చాలానే ప్రభావితమయ్యాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో హీరో మోటార్స్ రూ.1896.99 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. అయితే, గత సంవత్సరం కంపెనీ PAT రూ.4862.25 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ ఐపీఓ ఇష్యూకు ఐసిఐసిఐ సెక్యూరిటీస్, జెఎం ఫైనాన్షియల్, డిఎఎం క్యాపిటల్ వంటి సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి.
హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ బంధువు పంకజ్ ముంజాల్ నేతృత్వంలోని ఆటో కాంపోనెంట్ తయారీ సంస్థే ఈ హీరో మోటార్స్. అమెరికా, యూరప్, భారతదేశంలోని ఆటోమోటివ్ ఒరిజినల్ పరికరాల తయారీదారులకు (OEMలు) పవర్‌ట్రెయిన్ సొల్యూషన్‌లను (ఎలక్ట్రిక్ మరియు నాన్-ఎలక్ట్రిక్) అందిస్తుంది హీరో మోటార్స్ కంపెనీ. ఇదిలా ఉంటే ఆగస్టు 2024లో రూ.900 కోట్లు నిధుల సేకరణకు హీరో మోటార్స్..సెబీకి ముసాయిదాను దాఖలు చేసింది. అయితో గత ఏడాది అక్టోబర్ లో అనుకోని కారణాలతో ఈ పత్రాలను ఉపసంహరించుకుంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.


Click it and Unblock the Notifications