Hero Motors IPO GMP: గ్రే మార్కెట్‌లో ప్రీమియంలో ట్రేడవుతోన్న హీరో మోటర్స్ షేర్లు..!
హీరో మోటర్స్ ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. సెప్టెంబర్ 17న ఉదయం 11:21 గంటల సమయానికి హీరో మోటర్స్ ఐపీఓ 2.20 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది. ఈ కంపెనీ షేర్లు గ్రే మార్కెట్ లో ప్రీమియంలో ట్రేడవుతున్నాయి. గ్రే మార్కెట్ లో రూ.87 వద్ద ట్రేడవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. గత సెషన్‌లో రూ.13గా ఉన్న GMP తగ్గింది. అంటే గ్రే మార్కెట్‌లో ప్రీమియం గణనీయంగా తగ్గిందని అర్థమవుతోంది. హీరో మోటర్స్ ఐపీఓ తన ఇష్యూ ధరల శ్రేణిని షేరుకు రూ.79 నుంచి రూ.84 మధ్య నిర్ణయించింది. రూ.1,000 కోట్ల విలువైన ఈ IPOలో రూ.600 కోట్ల విలువైన 7.14 కోట్ల కొత్త షేర్ల జారీ (fresh issue) కాగా, రూ.400 కోట్ల విలువైన 4.76 కోట్ల షేర్ల విక్రయ ఆఫర్ (OFS) ఉన్నాయి.
రిటైల్ పెట్టుబడిదారుల కోసం, ఒక దరఖాస్తుకు లాట్ పరిమాణం 178 షేర్లుగా ఉంది. గరిష్ట ధరల శ్రేణి ఆధారంగా, ఒక వ్యక్తిగత చిల్లర పెట్టుబడిదారునికి 178 షేర్ల ఒక లాట్ కోసం అవసరమైన కనీస మొత్తం రూ.14,952 గా ఉంది. ఈ ఇష్యూకి ICICI Securities Ltd. 'బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్'గా వ్యవహరిస్తుండగా, Kfin Technologies Ltd. రిజిస్ట్రార్‌గా ఉంది. Hero Motors Limited ఏప్రిల్ 1998లో స్థాపించారు. ఇది ఒక ఆటోమోటివ్ టెక్నాలజీ సంస్థ. ఇది అమెరికా, ఐరోపా, భారతదేశంలో ఆటోమోటివ్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులకు (OEMs) ఇంజనీరింగ్, పవర్‌ట్రెయిన్ పరిష్కారాలను (powertrain solutions) డిజైన్ చేయడం, అభివృద్ధి చేయడం, తయారు చేయడం చేస్తుంది.

ఈ సంస్థ ఎలక్ట్రిక్, నాన్-ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ల కోసం సమగ్ర పరిష్కారాలను అందిస్తుంది. దీని ఉత్పత్తులు ద్విచక్ర వాహనాలు, పనితీరు-ఆధారిత వాహనాలు, ఈ-బైక్‌లు, ఆఫ్-రోడ్ వాహనాలు, ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ కార్లు, భారీ వాహనాలు మరియు eVTOL అప్లికేషన్‌లకు ఉపయోగపడతాయి. సబ్‌స్క్రిప్షన్ గణాంకాలను పరిశీలిస్తే, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 3.49 రెట్లు సబ్‌స్క్రయిబ్ కాగా.. NII విభాగం 2.10 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను అయింది. QIB విభాగం 0.01 రెట్లు సబ్‌స్క్రయిబ్ కాగాగ.. NII విభాగంలో S-NII సెగ్మెంట్ 3.76 రెట్లు, B-NII 1.27 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
