Lalithaa Jewellery Mart IPO: లలితా జ్యువెలరీ ఐపీఓ గ్రే మార్కెట్‎లో ఎలా ఉంది.. దరఖాస్తు చేసుకోవాలా వద్దా..!

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లలితా జ్యువెలరీ మార్ట్ ఐపీఓ(Lalithaa Jewellery Mart IPO) ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. చెన్నైకి చెందిన ఈ ఆభరణాల రిటైలర్ సంస్థ షేర్లు గ్రే మార్కెట్ లో 15 శాతం ప్రీమియంలో ట్రేడవుతున్నాయి. లితా జ్యువెలరీ మార్ట్ ఐపీఓలో ఒక్కో షేరుకు రూ. 190-రూ. 201గా నిర్ణయించారు రూ. 1,700 కోట్ల ఈ ఇష్యూలో, రూ. 1,200 కోట్ల తాజా ఇష్యూ కాగా ప్రమోటర్, వ్యవస్థాపకుడు కిరణ్ కుమార్ జైన్ రూ. 500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయిస్తున్నారు. ఐపీఓ 2026 ఆగస్టు 17న ప్రారంభమై, ఆగస్టు 19న ముగుస్తుంది. షేర్ల కేటాయింపు ఆగస్టు 20న చేస్తారు. కంపెనీ షేర్లు ఆగస్టు 24న ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్ట్ కానున్నాయి.

ఆనంద్ రాఠీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఈక్విరస్ ఈ ఇష్యూకు బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తుండగా, ఎంయూఎఫ్‌జిని రిజిస్ట్రార్‌గా నియమించారు. కంపెనీ బలమైన FY26 ఆర్థిక పనితీరు, ఆకర్షణీయమైన వాల్యుయేషన్, విస్తరణ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని, లలితా జ్యువెలరీ మార్ట్ లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 508.20 కోట్లు సమీకరించింది. 22 మంది యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు రూ. 201 చొప్పున 2,52,83,581 ఈక్విటీ షేర్లను కేటాయించింది. ఈ యాంకర్ ఇన్వెస్టర్లలో గోల్డ్‌మన్ సాక్స్ బ్యాంక్ యూరోప్ ఎస్ఈ - ఓడిఐ, మోర్గాన్ స్టాన్లీ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ఇంక్., మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ ఇండియన్ ఈక్విటీ ఫండ్, కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, గ్రేటర్ ఇండియా పోర్ట్‌ఫోలియో, సంషి ఫండ్-I సహా పలు ప్రముఖ సంస్థలు ఉన్నాయి.

Lalithaa

ఐపీఓకు బిడ్ వేసే వారు రిటైల్ పెట్టుబడిదారులు కనీసం ఒక లాట్ బిడ్ వేయాల్సి ఉంటుంది. ఒక లాట్ కోసం రూ.14,874 చెల్లించాల్సి ఉంటుంది. ఒక లాట్ 74 షేర్లు వస్తాయి. ఈ ఐపీఓలో ఉద్యోగులకు కేటాయించిన భాగాన్ని మినహాయించి, 50 శాతం అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు (QIBs) కేటాయించింది. రిటైల్ పెట్టుబడిదారులకు 35% కేటాయించగా, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15% కేటాయించారు. ఈ ఇష్యూలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి దీని విలువ. ధరల శ్రేణి గరిష్ట స్థాయి వద్ద, డైల్యూటెడ్ FY26 EPS ఆధారంగా లలితా జ్యువెలరీ మార్ట్ ధర-ఆదాయ నిష్పత్తి (P/E ratio) 9.95 రెట్లుగా ఉంది. కనిష్ట స్థాయి వద్ద, ఈ P/E నిష్పత్తి 9.41 రెట్లుగా ఉంటుంది.

FY26 కోసం పరిశ్రమలోని ఇతర సంస్థల సగటు P/E నిష్పత్తి 29.69 రెట్లుగా ఉండటంతో పోలిస్తే ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది. అంటే విస్తృత పరిశ్రమతో పోలిస్తే ఈ IPO తక్కువ విలువతో వస్తుంది. ఫ్లోర్ ప్రైస్ (కనిష్ట ధర) ముఖ విలువకు 38 రెట్లు ఉండగా, క్యాప్ ప్రైస్ (గరిష్ట ధర) ముఖ విలువకు 40.20 రెట్లుగా ఉంది. లలితా జ్యువెలరీ తన IPO ద్వారా సమకూరే నికర నిధులను ప్రధానంగా భారీ రిటైల్ విస్తరణ కోసం, అంటే 10 కొత్త స్టోర్లను ఏర్పాటు చేయడానికి వినియోగించాలని యోచిస్తోంది. వినియోగించబోయే మొత్తం రూ. 1,033.23 కోట్లలో, రూ. 34.55 కోట్లు మూలధన వ్యయం కోసం కేటాయిస్తారు. ఇందులో స్టోర్ ఫిట్-అవుట్‌లు, ఫర్నిచర్, ఫిక్చర్‌లు, పరికరాలు, అలాగే IT హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ వంటివి ఉంటాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+