Multibagger Stock: రూ.8.30 నుంచి రూ.283 చేరిన స్టాక్ ఇదే..!
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు చాలా రిస్క్ తో కూడుకున్నది. మార్కెట్లపై ఎలాంటి అవగాహన లేకండా పెట్టుబడి పెడితే తీవ్ర నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది. అయితే మల్టిబ్యాగర్ స్టాక్ ను గుర్తించే పెట్టుబడి పెడితే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. మల్టీబ్యాగర్ స్మాల్-క్యాప్ స్టాక్ అయిన హెచ్‌ఈజీ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ బుధవారం నాటి ట్రేడింగ్ సెషన్‌ను ఒక్కో షేరుకు రూ.289 వద్ద 20 శాతం అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ బలమైన పనితీరు కనబరిచింది. ఎల్ఎన్‌జె భిల్వారా గ్రూప్‌లో భాగమైన హెచ్‌ఈజీ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, బలమైన తయారీ, పరిశోధన అభివృద్ధి (R&D), ఆవిష్కరణల పునాది మద్దతుతో ముందుకెళ్తోంది.
సెప్టెంబర్ 2026తో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ కార్యకలాపాల నుండి రూ.430 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని నమోదు చేసింది. ఎబిట్డా రూ.313 కోట్లుగా ఉండగా, పన్ను తర్వాత లాభం (PAT) రూ.209 కోట్లకు చేరంది. HEG అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్‌ను సాంకేతికత-ఆధారిత, ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల అధునాతన మెటీరియల్స్ ప్లాట్‌ఫామ్‌గా నిర్మించడంలో కంపెనీ సాధిస్తున్న నిరంతర పురోగతిని FY27 రెండవ త్రైమాసిక ఫలితాలు నిదర్శమని HEG అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రిజు ఝున్‌ఝున్‌వాలా అన్నారు. ఆర్&డిని బలోపేతం చేయడం, యాజమాన్య సాంకేతికతలను అభివృద్ధి చేయడం, యానోడ్ మెటీరియల్స్, గ్రాఫేన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, మరియు గ్రీన్ పవర్ రంగాలలో విభిన్నమైన, విస్తరించగల వ్యాపారాలను సృష్టించడంపై కంపెనీ దృష్టి సారించిందని ఆయన చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా లిథియం-అయాన్ బ్యాటరీ ఉత్పత్తి 2025లో దాదాపు 2.3 TWh నుంచి 2035 నాటికి దాదాపు 8 TWhకు పెరుగుతుందని అంచనా. అదే సమయంలో సెల్ తయారీదారులు తమ సరఫరా చైన్ వైవిధ్యపరుస్తున్నందున 2030 నాటికి చైనా యేతర యానోడ్ డిమాండ్ 1 మిలియన్ టన్నులను మించిపోతుందని అంచనా వేసింది. ఈ డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ 20,000 MT సామర్థ్యం గల ఫేజ్ I యానోడ్ మెటీరియల్స్ ప్లాంట్ నిర్మాణం మొత్తం 61% పురోగతిని సాధించగా, ప్రాసెస్ బిల్డింగ్ 72.25% పూర్తయింది. వాణిజ్య కార్యకలాపాల ప్రారంభ తేదీ (COD) జూన్ 2027గా ప్రణాళిక రచించారు.
ఫేజ్ IIలో అదనంగా 24,000 MT సామర్థ్యం గల ప్లాంట్ ఉంటుంది. దీని COD మార్చి 2029గా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్లాంట్ దేవాస్ సైట్‌లోని ప్రస్తుత మౌలిక సదుపాయాలు, విద్యుత్ కనెక్షన్, భూమిని ఉపయోగించుకుంటుంది. దీనితో కంపెనీ మొత్తం యానోడ్ మెటీరియల్స్ సామర్థ్యం 44,000 MTకి చేరుకుంటుంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఈ స్టాక్ 28% లాభపడింది. 2016 నాటి కనిష్ట స్థాయి రూ.8.30 నుంచి ఈ స్టాక్ 3,369 శాతం పెరిగి ప్రస్తుతం ఒక్కో షేరు రూ.283 కు చేరింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications