రూ. 177 కోట్ల డీల్‌తో దూసుకుపోతున్న హెల్త్‌కేర్ స్టాక్.. ఈ ఏడాదిలోనే 80% రిటర్న్స్!
ఇవాళ stock market లో ఒక హెల్త్‌కేర్ స్టాక్ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. నార్త్ ఇండియాకు చెందిన ప్రముఖ హాస్పిటల్ చైన్ 'పార్క్ మెడి వరల్డ్ లిమిటెడ్' (Park Medi World Ltd) షేర్లు సోమవారం ఉదయం ట్రేడింగ్‌లోనే ఏకంగా 8 శాతానికి పైగా ఎగబాకాయి. దానికి బలమైన కారణం కూడా ఉంది. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లో ఉన్న 'ది మెడిసిటీ హాస్పిటల్'ను 100 శాతం కొనుగోలు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించడమే ఈ భారీ ర్యాలీకి కారణమైంది. ఈ డీల్ వాల్యూ అక్షరాలా రూ. 177 కోట్లు! అదీ కూడా పూర్తి క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారా జరగబోతోంది.

మార్కెట్ ఓపెనింగ్‌లోనే జోష్.. కొత్త రికార్డ్!
ఈరోజు మన stock market లో పాజిటివ్ ట్రెండ్ నడుస్తుండటంతో, ఈ షేర్ కూడా మంచి లాభాలతో గ్రీన్ జోన్‌లో రూ. 264.50 వద్ద ప్రారంభమైంది (గత ముగింపు రూ. 259.19). హాస్పిటల్ కొనుగోలు వార్త బయటకు రాగానే ఇన్వెస్టర్లు ఈ షేర్లను కొనేందుకు ఎగబడ్డారు. దాంతో కొనుగోళ్ల జోరు పెరిగి, ఈ స్టాక్ సరికొత్త 52 వారాల గరిష్ట స్థాయి (52-week high) అయిన రూ. 282.30 మార్కును తాకింది. చివరిగా చూసేసరికి, ఈ షేరు రూ. 19.06 (7.35%) లాభంతో రూ. 278.25 వద్ద ట్రేడవుతోంది.
షేర్ ప్రైస్ హిస్టరీ: ఈ ఏడాదిలోనే 80% ప్రాఫిట్!
గత ఏడాది డిసెంబర్‌లోనే ఈ హెల్త్‌కేర్ కంపెనీ stock market లో అడుగుపెట్టింది. లిస్టింగ్ అయినప్పటి నుండి ఇన్వెస్టర్లను అస్సలు నిరాశపరచలేదు.
- ఈ ఏడాది (YTD): కేవలం ఈ కొన్ని నెలల్లోనే ఏకంగా 80 శాతానికి పైగా పెరిగి మల్టీబ్యాగర్‌గా మారుతోంది.
- గత 5 రోజుల్లో: 14 శాతానికి పైగా లాభపడింది.
- గత 1 నెలలో: 17 శాతం పైగా పెరిగింది.
- గత 6 నెలల్లో: ఏకంగా 85 శాతం రిటర్న్స్ ఇచ్చి ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోను నింపేసింది.
- ప్రస్తుతం దేశీయ మార్కెట్ సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్ కూడా మంచి కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో పయనిస్తుండటం ఈ స్టాక్‌కు మరింత ప్లస్ అయింది.
ఏంటి ఈ కొనుగోలు వ్యూహం? కంపెనీ ప్లాన్ ఏంటి?
ఈ డీల్‌తో పార్క్ గ్రూప్ మొదటిసారి ఉత్తరాఖండ్‌లోకి అడుగుపెట్టింది. దీనితో కలిపి మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఈ హాస్పిటల్ చైన్ తన నెట్‌వర్క్‌ను విస్తరించినట్లయింది. రుద్రాపూర్‌లోని ఈ 'మెడిసిటీ హాస్పిటల్' 330 బెడ్స్ ఉన్న ఒక పెద్ద మల్టీ-సూపర్ స్పెషాలిటీ హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూషన్.
కంపెనీ గ్రోత్ స్ట్రాటజీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పార్క్ మెడి వరల్డ్ తెలిపింది. తక్కువ సేవలు అందుతున్న, ఎక్కువ పొటెన్షియల్ ఉన్న మార్కెట్లలోకి విస్తరించడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సాధించవచ్చని కంపెనీ నమ్ముతోంది. "ఉత్తర భారతదేశంలోనే ఒక వరల్డ్ క్లాస్ హెల్త్‌కేర్ నెట్‌వర్క్‌ను నిర్మించాలనే మా ప్రయాణంలో ఈ కొనుగోలు ఒక మైలురాయి" అని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అంకిత్ గుప్తా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications